ఎమ్మెల్యే ఎంపీ స్థానికం ఉండక, పార్ట్ టైం ప్రజా సేవ నాయకులు, లక్ష జీతం, సౌకర్యాలు, ఫించన్లు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,146; 104 తత్వాలు (Tatvaalu) and views 225,564.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జగనన్నా, ఏందన్నా ఈ దుస్థితి అని, మన పార్టీ అభిమానులు, సాధారణ ప్రజలు, అయోమయములో సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్నారు అన్నా.

మన వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు బాధ్యత గలిగిన పదవులలో ఉంటూ, నియోజకవర్గము లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నందుకు గాను, ప్రజల శ్రమ కష్టం పన్నులు నుంచి నిస్సిగ్గుగా, పక్క ఆదాయం కాకుండానే, లక్ష రూపాయలు జీతం, సౌకర్యాలు మరియు ఆ తర్వాత ఫించన్లు తీసుకుంటూ, కనీసం ఈ 5 ఏళ్ళు అయినా, కనీసం ఎటువంటి కొత్త కట్టుబడి అభివృద్ధి లేకపోయినా,

స్ధానిక జనం కు దగ్గరగా, అద్దెకు అయినా ఉండకుండా, నటించనైనా నటించకుండా కనీసం 15 రోజులు, పార్ట్ టైం జాబ్ లా, జనం తగవులు కన్నీళ్ళు తుడవడానికి కూడా తర్వాత రోజులలో తీరిగ్గా వస్తున్న , సొంత వ్యాపారాలలో మునిగి తేలుతున్న,

పార్ట్ టైం ప్రజా సేవ చేస్తున్న నాయకులను, పార్టీ ని భ్రష్ఠు పట్టిస్తున్న నాయకులు ను, 151 సీట్లు ఉన్న బలవంతులమైన మనం కూడా, మంచి దోవలో నడిపించ లేమా?

ప్రజలకు పూర్తి సమయం అందుబాటులో ఉంచలేమా? కనీసం కళ్ళ ముందు కనపడేటట్టు అయినా, ఉండమని ఆదేశించ లేమా?

ఇక 10 ఏళ్లుగా అలా చేయలేని, చంద్రన్న కు, మనకు తేడా ఏమిటి? రెండూ పార్టీలు ఒకటే అని, ప్రజలకు ఒకటిన్నర సంవత్సరం లోనే, మనం నిరూపించుకోవాలా, ఇంత చండాలము గా? కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా, పాత వారికి అవకాశం ఇస్తే, మన బతుకు ఇంతే అని ప్రజలకు, కేవలం 2 ఏళ్ల లోనే తెలియచెప్పాలా?

జగనన్న సలహా దారులు, మంత్రులు కళ్ళు తెరవండి, జగనన్న ఉప్పు తింటూ కూడా ఆయనకు ద్రోహం చేయకండి. కంచే చేను మేసినట్లు చేయకుండా, ఎంపీలు ను ఎమ్మెల్యేలు ను నియోజకవర్గంలో, కనీసం 15 రోజులు ఉండమని చెప్పండి.

లేకపోతే, వారి జీతాలు మరియు ఫించన్లు లో, నియోజకవర్గంలో తిరిగిన రోజులు వరకే చెల్లింపు చేస్తూ, మిగతా ధనం, సీఎం రిలీఫ్ ఫండ్ కు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు తరలించండి. రాష్ట్ర వ్యాప్తంగా గా, పార్ట్ టైం గా, పౌర్ణమికి అమావాస్య కు నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యే ఎమ్మెల్యే ఎంపీలు, వివరాలు బహిరంగంగా పేపర్లో వేసి, జగనన్న మందలించారు అని హెడ్డింగ్ పెట్టండి, మరలా టికెట్ రాదని గట్టిగా, ఇప్పుడే చెప్పండి.

వారు నియోజకవర్గంలో లేకపోతే, ప్రజలకు సేవ చేయనట్టే కదా. ప్రభుత్వ ఉద్యోగి ఊరు వెళ్ళేటప్పుడు, సెలవు చీటి మరియు కారణం, పై అధికారులు కి చెప్పి వెళతారు. మరి ఎమ్మెల్యే, ఎంపీలు తమ యజమానులు అయిన, ప్రజలకు నియోజకవర్గం దాటేటప్పుడు, ఎన్ని రోజులు ఏ కారణం ఏ వ్యాపారం కోసం, బయటకు వెళుతుంది చెప్పరా? చెప్పనప్పుడు దొంగలాగా పారిపోయినప్పుడు, సౌకర్యాలు జీతాలు ఫించను కోత ఉండదా?

ఆ ఎమ్మెల్యే, ఎంపీ ల దే బాధ్యత, స్ధానిక అధికారులు, పధకాల సమాచారం సోషల్ మీడియా లో పెట్టకపోతే అని కూడా చెప్పండి. కలెక్టర్ మరియు ఇతర జిల్లా అధికారులు మీద పట్టులేదు, అధికారులు జగనన్న ను లెక్క చేయడం లేదు, అని జనం నవ్వుతూ ఉన్నారు. ఆగిపోయిన కలెక్టర్, మున్సిపల్ సోషల్ మీడియా పేజీలే ఉదాహరణ.

జగనన్న ను నిబద్ధత గల నాయకులు గా నిలబెట్టాలి అన్న బాధ్యత ఉప్పు తినే మీ మీద, అలాగే ప్రతి రాజన్న అభిమానులు మీద ఉంది కదా.

స్ధానిక ప్రజలకు మరియు అధికారులు కు దూరంగా, కరోనా సమయంలో కూడా ప్రయాణం చేసి, స్ధానికం గా ఉండని, బాధ్యతరాహిత్య ఎమ్మెల్యే ఎంపీలు ని, శ్రమించి, ధనం ఖర్చు తో, కలిసే దుస్థితి తప్పించండి.

మన చేతులారా మనం, బీజేపీ జనసేన కు లేదా మరలా చంద్రన్న కు, రాజబాట వేయకూడదు కదా?

అలాగే, మా బాపట్ల ఎంపీ ని వారానికి ఒక అసెంబ్లీ నియోజక వర్గం తిరగమని, అలాగే చీరాల ఎమ్మెల్యే ని, వారానికి ఒక వార్డు తిరగమని, ప్రజలతో కలసి దిగిన కొత్త ఫోటోలు వీడియో లు ఫేస్బుక్ లో పెట్టమని చెప్పగలరు.

అలాగే, రాష్ట్రంలో ని అందరూ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు కు, అదే పని చెప్పగలరు. నిజమైన ప్రజా సేవ మరియు తిరగడం తెలియని వారికి, అనంతపురం జిల్లా ధర్మవరం మన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి, వార్డు సందర్శన వీడియో లు, వీరి ట్రైనింగ్ కోసం చూపగలరు.

స్ధానికం గా ఉండలేని తిరగలేని వారిని, ఆత్మాభిమానం తో రాజీనామా చేసి, కష్టపడి తిరిగే వారికి అవకాశం ఇచ్చి, జగనన్న పరువు రాష్ట్రంలో నిలబెట్టాలి, మరలా ఇంకోసారి జగనన్న గెలిచే విధంగా సహాయం చేయాలి మనందరం. ఎందుకంటే కృతజ్ఞతలు విశ్వసనీయత లేని వ్యక్తుల కన్నా, తల్లి లాంటి పార్టీ ముఖ్యం, ఈ పార్టీ నాయకత్వం కైనా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,146; 104 తత్వాలు (Tatvaalu) and views 225,564
Dt : 29-Jan-2021, Upd Dt : 29-Jan-2021, Category : Politics
Views : 768 ( + More Social Media views ), Id : 946 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : local , part time , public service , political leaders , lakh salary , facilities , pensions , ap , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content