ఇప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పరు, వారికి పేరు వస్తుంది ఏమో, అన్న ఈర్ష్య అసూయ తో - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,193,263; 104 తత్వాలు (Tatvaalu) and views 243,482.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పాత రోజుల లో, మనుషులు మంచి వారు కాబట్టి, ఆ అబ్బాయి మంచి వారు, ఈ అధికారి లేదా ఎమ్మెల్యే మంచి వారు కష్టపడి పని చేస్తారు, అని నిజాయితీగా అందరికీ చెప్పేవారు.

ఇప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పరు, వారికి పేరు వస్తుంది ఏమో, అన్న ఈర్ష్య అసూయ తో. అవసరం అయితే, ఎంత దూరమైన వెళ్లి అయినా, ఫిర్యాదులు మాత్రం చేస్తారు లేదా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు.

కాబట్టి మనకు మనమే, సొంతంగా బయటకు చెప్పుకోవాలి. తప్పదు రెండో మార్గం లేదు. లేదంటే ఇంకొక మంచి వారికి, ఎప్పటికీ మన మంచి తెలియదు. ఆనాడు రామానుజుల వారు కూడా గోపురం ఎక్కి, మంత్రం ని పెద్దగా చదివారు కదా. ఎందుకంటే, అది మంచి పని, అందరికీ ఉపయోగం కాబట్టి.

పేపర్ వారి పై ఆధారపడి తే, వారి సొంత ఉపయోగం అండను బట్టి, వార్త అర్థం దిక్కు మారిపోతుంది. పాత పేపర్ కటింగ్ లు దాచి పెట్టలేము ఎక్కువ కాలం, అలాగే వెనకవి వెతకలేము కూడా.

అలాంటప్పుడు, వ్యక్తి గతంగా మనమైనా లేదా అధికారులు అయినా, తమ మంచి పనులు మరియు కర్తవ్యాన్ని చేసేటప్పుడు, ప్రతి దానిని బహిరంగంగా, ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయడం మంచిది.

అందుకే జరిగే అన్ని కార్యక్రమాలు పనులు సోషల్ మీడియాలో పెట్టమని, మన జిల్లా మండల పట్టణ గ్రామ అధికారులు ను అభ్యర్థిస్తుంది, చాలాకాలంగా.

అది రెండు వైపులా ఉపయోగం. ఒకటి, ప్రజలకు అధికారులు ఏమి చేస్తున్నారో తెలిసి, కనీసం కొంతమంది అయినా, వారిని అభిమానించి ఆరాధిస్తారు. కొన్ని పనులు కు చేయూతనిస్తారు. ఆర్ధిక సహాయమూ చేస్తారు.

రెండో ఉపయోగం, పై అధికారి కి మనపై ఎవరైనా ఫిర్యాదు చేసినా, మన సోషల్ మీడియా పేజీ లింకు ఇస్తే, పై అధికారులు మన అన్ని పనులు వివరాలు చూసి, మనల్ని అభినందిస్తారు.

ఉదాహరణకు, మన సీఐ, డిఎస్పీ గారు లేదా సెక్రటరీ, ఎమ్మార్వో గారు మీద, పైన వారికి కి ఫిర్యాదు చేసినా, అసలు కనపడటం లేదు పనులు జరగడం లేదు అని, వీరి ఫేస్బుక్ పేజీ లో రోజూ పెడుతున్న సమాచారం చూసి, ఏ పై అధికారులు లేదా ఎమ్మెల్యే లు కూడా, ఏమీ మాట్లాడలేరు కదా. కొండంత అండ ఆ సమాచారం. పాతవి కూడా గూగుల్ లో వెతకడం తేలిక.

ప్రకాశం లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫేస్బుక్ పేజీలు చూడండి, అందులో ప్రతి రోజూ వారు పెట్టె, ఫోటోలు వీడియో లు అన్ని చూసాక, ఎవరూ కూడా, ఎస్పీ లేదా డీజీపీ గార్ల ని అభినందించకుండా ఉంటారా? వారు ఎక్కడ కనపడ్డా, చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం, వారు పడుతున్న కష్టం చూసి.

ఎందుకంటే అక్కడ, సమాచారం అంతా ఉంది. అలాగే మన ఊరు, మండలం సమాచారం కూడా, సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటే, మన అధికారులు కు అది శ్రీరామ రక్ష. అలాగే ప్రజలకు ఎంతో మేలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,193,263; 104 తత్వాలు (Tatvaalu) and views 243,482
Dt : 29-Apr-2020, Upd Dt : 29-Apr-2020, Category : Request
Views : 821 ( + More Social Media views ), Id : 521 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : publish good works of you , govt officers or individuals , people jealousy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content