అధికారిక కబ్జా షాపు ప్రభుత్వ బోర్డ్ లో పన్నుల వివరాలు ప్రకటన ప్రజల కోసం - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1113 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 నిమిష చదువు సమయం.

గౌరవ ప్రకాశం కలెక్టర్, జిల్లా పంచాయితీ అధికారి మరియు ఎస్పీ గార్లు కు నమస్కరించి వ్రాయునది,

విషయము - ప్రతి అధికారిక కబ్జా షాపు ముందు ప్రభుత్వ బోర్డ్ లో పన్నుల వివరాలు ప్రకటన ప్రజల కోసం - యజమాని బీదతనం, పిల్లల సంపాదన అండలేని తనం - పంచాయితీ, పోలీసు అధికారులు, నాయకులకు సంబంధించి ఏవైనా పన్ను వివరాలు ఉంటే తెలుపుట

అయ్యా,

మీరు వేటపాలెం మండలం కొత్తపేటలో రావి సుబ్బారాయుడు కల్యాణ మండపం దగ్గర, మిద్దె కలిగిన, కడు బీద వారు, తమ బిడ్డల సంపాదన అండలేక, పొట్ట కూటి కోసం పెట్టుకున్న, పంచాయితీ స్థల కబ్జా షాపు మరియు రోడ్ దాకా ఆక్రమణ, అలాగే రోడ్ మీద పార్కింగ్ ఫోటో చూసారు. గతములో ఈ అక్రమ షాపు తీయమంటే, బజారు మొత్తము తీసినాక, మాది తీయమని చెప్పారు అని వినికిడి. మనము బీదవారి షాపుల గురించి మాట్లాడడం లేదు, కేవలం ధనికులవి మాత్రమే.

ఇలాంటి షాపులు ఇంకా మా చీరాలలో వేటపాలేం లో, 2 వ పోలీసు స్టేషన్ అలాగె వీఆరెయెస్ కాలేజీ ముందు, అలాగే జిల్లా లో చాలా ఉన్నాయి, నాయకుల అధికారుల అండతో. అందరి షాపులు వీ ఫోటోలు పెడితే, వారు మమ్మల్ని కొట్టవచ్చు, కక్షలు పెట్టుకుని తర్వాత సాధించవచ్చు.

కాబట్టి, ఉదాహరణకు ఈ ఒకటి చూపించాము, మర్యాదస్తులు సంస్కారము వంతులు అయిన వీరై నా, మా మీద కక్షకట్ట వచ్చు కదా. ఎందుకంటే, గతములో కొడుకు పండగకు వారింటికి వస్తే, అక్రమ షాపు వలన ఖాళీలేక పక్కన ఇంటి దగ్గర పార్క్ చేస్తే, తీయమన్నందుకు, పక్కన అద్దెకు ఉండే ఓ అభాగ్యురాలిని, ఆ ఇంటి తండ్రి కొడుకు ఆఖరికి 10 ఏళ్ళ లోపు మనవడు కూడా, తన్నడానికి పెద్దగా అరుస్తూ వచ్చారు.

జగనన్న అలాగే ప్రతిపక్షాలు అలాగే, మీ లాంటి మంచి వారి, దయ అండ ఉంటుంది, అని వెలుగులోకి తెస్తున్నాము. బీదవారి షాపులు ఎటూ, చెప్పకుండానే లాగేస్తారు తీసేస్తారు అధికారులు పోలీసులు, కానీ మిద్దెలు కలిగి మరియు నాయకుల అండ, ఉన్న వారి జోలికి మాత్రం పోరు. కానీ సీయెం జగనన్న, బీదల పక్షపాతి, సమాన న్యాయం ఉండాలి అంటారు. అలాగే మీరు ధర్మానికి కట్టుబడి ఉంటారు.

ఈ షాపు లేదా ఇతర షాపుల వారి కడుపు కొట్టి అన్నము తీయమని, ఏ పౌరుడు కూడా అడగరు, మేము కూడా అడగము, మానవత్వము ఉన్న మనుషులము కాబట్టి, అలాగే ఇంకో 10 ఏళ్ళు ఉండనివ్వండి తప్పు లేదు, మీకు ఇష్టమైతే లీగల్ అయితే.

కానీ వారికి తగ్గ పార్కింగ్ చూపించండి, ఆ షాపు కి వచ్చే కస్టమరు కి పనిచేసే వారికి, అలాగే ఆ మిద్దె ఇంటి అల్లుడు కొడుకులు పండగకు వస్తే వారి కారులు కి, అలాగే ఆ ఇంట్ళో అద్దెకు ఉన్న 5 నుంచి 10 మంది కాలేజీ కుర్రవాళ్ళకు. దయచేసి ఇతర బజారు ఇళ్ళ జనాలకు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి.

కానీ వర్గ, మత, కుల, పార్టీ భేధము లేకుండా, అందరికీ ఆ సమాన కబ్జా అవకాశం ఇవ్వాలి కదా, ప్రజాస్వామ్యము లో? కేవలము ధనవంతులు రాజకీయ బలం కలవారే పెట్టుకుంటే ఎలా, కబ్జా షాపులు 2 వ పోలీసు స్టేషన్ మరియు వీఆరెయెస్ కాలేజీ ముందు చూడండి.

ఈ షాప్ అలాగే ఇలాంటి షాపులు, 10 ఏళ్ళు గా చాలా ఉన్నవి, ఈ రోజు కొత్త ఏమీ కాదు, ఈ బాధలు తగవులు. దయచేసి, అలాంటి షాపుల కు అనుమతులు లేకపోతే ఇచ్చి ఎదురుగా, ఒక పెద్ద ప్రభుత్వ బోర్డ్ పెట్టి, ఎంత పన్నులు, ఒక్కొక్క అధికారి కి లేదా శాఖ కి ఈ 10 ఏళ్ళు కడితే, పంచాయితీ మరియు పోలీసు డిపార్ట్మెంట్ లు అనుమతి ఇచ్చాయి, ఇన్ని ఏళ్ళు గా అని ప్రజలందరికి తెలియచేస్తే, అందరికీ సౌకర్యము గా ఉంటుంది.

దానిని తెలుసుకుని మిగతా ప్రజలు కూడా, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న పాలనలో, సమాన హక్కులు కలిగిన వారు గా భావించి అధికారులను ప్రేమించి, అవే టాక్సులు కట్టి, తమ ఇళ్ళ ఎదురుగా కూడా, ఇలాంటి షాపులు, ప్రభుత్వ కబ్జా స్థలములో కట్టుకుని, రోడ్ మీద పార్కింగ్ పెట్టుకునే విధముగా, వారు వాడుకుంటూ లేదా అద్దెకు ఇచ్చి ఆదాయము పొందు, సమాన అవకాశాలు ఇవ్వగలరని, ప్రజలు కోరుతున్నారు.

దయచేసి, ఆ షాపుల బోర్డ్ మీద వివరము గా, ఇందుమూలముగా యావన్మంది గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఈ ఇంటి యజమాని కడు బీద వారు, పిల్లలు సంపాదన పంచకపోవడము వలన, వీరి జీవన బ్రుతి కై, దయతో మానవత్వముతో అనుమతి ఇచ్చినందుకు, గత 10 ఏళ్ళు గా, పొలీసు మరియు పంచాయితీ శాఖకు, అలాగే ఎమ్మెల్యే ఎంపీ మరియు పంచాయితీ ప్రెసిడెంట్ కు, ఇన్ని పన్నులు చెల్లించారు.

ఉదాహరణకు, పంచాయితీ షాపు పన్ను 10, ఎస్సై సీఐ డీఎస్పీ పోలీసుల పన్ను 10, పంచాయతీ సెక్రటరి ఎంపీడీవో పై అధికారులకు మొత్తము 10, ఎమ్మెల్యె ప్రెసిడెంట్ ఎంపీ కి 10. ఇలా నెలకు 40 రూపాయల పన్ను రశీదుతో కట్టడము వలన, రోడ్ మీద దాకా షాపు మరియు రోడ్ మీద అలాగే పక్కన ఇళ్ళ దగ్గర పార్కింగ్ కు, ప్రభుత్వ పరముగా అనుమతి ఇచ్చి, మేము అంతా చూస్తూ ఉన్నాము.

ఇతర ప్రజలు కూడా, ఈ అవకాశమును సద్వినియోగపరచుకుని, మీ ఇంటి, అలాగే మా శాఖల మరియు నాయకుల ఆదాయాన్ని పెంచగలరని భావిస్తున్నాము.

అప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రజాస్వామ్యము అందరికీ సమానముగా ఉంటుంది, పంచాయితీ అలాగే పోలీసు శాఖకు ఆదాయము వస్తుంది. ఇతర జిల్లా అధికారులూ, ఇదే పద్దతి పాటిస్తారు.

ఇక బెదిరింపులు భయము బాధలు లంచాలు ఉండవు. అందరూ సఖ్యతగా సుఖముగా ఉంటారు అని, ప్రజలు సవినయముగా కోరుతున్నారు.

తప్పు మాట్లాడి ఉంటే, క్షమించి, పెద్దలు మన్నించి, అందరికీ తగిన సమాన న్యాయము చేయ ప్రార్ధన. ప్రజల తరపున, గడ్డిపరక లాంటి ఓ చిన్న అజ్ఞాన విలేఖరి, శిరస్సు వంచి నమస్కరిస్తూ వ్రాయు విన్నపము బాధతో నిస్సహాయతతో క్షమాపణలతో.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1113 General Articles, 47 Tatvaalu
Dt : 30-Mar-2021, Upd Dt : 30-Mar-2021, Category : Request
Views : 115 ( + More Social Media views ), Id : 1060 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : official , govt land , kabja , occupied , shop , front govt board , tax details , public , status , new shops
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content