శ్రీరామ నవమి లవకుశ పద్యాలు- సప్తాశ్వరథ, నవరత్నోజ్వల, ఏమహనీయ, ఇంతకుబూని, అపవాద, ప్రతిదిన - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,474; 104 తత్వాలు (Tatvaalu) and views 224,967.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

Lava Kusa Poems/ Sloka - Saptasvaradha, navaratnoajvala, emahaniya, intakubunivachchi, apavada, pratidina, idemana asramambu

ఆనాటి రామరాజ్య స్థాపకులు, తండ్రి ఇచ్చిన మాటకై, మరునాటి ఉదయ పట్టాభిషేకమును వదలి నవ్వుతూ కారడువులకు వెళ్ళిన, అయోధ్యా శ్రీ రామ చంద్రుని మరియు మహాసాధ్వి భర్త వెంట అడవులకు నవ్వుతూ వెళ్ళి నానా కష్టాలు పడిన సీతమ్మ తల్లిని, అలాగే అన్ని చదువు శాస్త్ర అస్త్ర విద్యలలో రామునికే ఎదురినిల్చిన తనయులు లవకుశులును తలుస్తూ, శ్రీ రామ నవమి రోజున లేదా ఏ రోజున అయినా, మన గొంతు తో, తన్మయత్వముతో, నాటి మధుర చిత్ర కావ్యం, లవకుశ పద్యాలు, మీరు కూడా పలికే ప్రయత్నం చేయగలరు. ఇది మనము విన్నా, మనసారా పలికినా, మనశ్శాంతి కలిగి ఎంతో పుణ్యం వస్తుంది. వాక్సుద్ది కి కూడా, ఇదే మొదటి మెట్టు సుమా.

శ్రీ రాఘవం, నవరత్నోజ్వల, స్త్రీ బాల వృద్ధుల, మూడు పద్యాలు.

1. శ్రీ రామ చంద్రుడు, సూర్యునికి తలవంచి నమస్కరిస్తూ, స్తుతించడం

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం

2. గురువులు, రామచంద్రునికి పట్టాభిషేక కిరీటమును పెడుతూ, మంగళ వాక్యాలు పలికి ఆశీర్వదించడం

నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయో
ద్భవ రాజన్యుల మున్ను దాల్చి గరిమన్ పాలించిరీ భూమి సం
స్తవ నీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీకీ యెడన్
భువి పాలింపు ప్రజానురంజకముగా మోడంబుతో రాఘవా

3. సీతమ్మను ఆశ్రమానికి పంపే ముందు, అన్నా ఇంత కఠినాత్ముడి గా ఎలా మారావు అని, లక్ష్మణుని ఆవేదన.

ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సు
త్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరొ, అట్టి తల్లి సీ
తా మహిళా శిరోమణిని, దారుణ కానన వీధి కంపగా
నీ మది యెట్టు లొప్పె? నెట నేర్చితి వీ కఠినత్వ మగ్రజా

4. అడవిలో ఆశ్రమాలకు దగ్గరలో దించినప్పుడు, లక్ష్మణ స్వామి మరియు సీతమ్మల సంభాషణలో, ఎందుకు లక్ష్మణా బాధపడుతున్నావు అంటే, లక్ష్మణుని సమాధానం,

ఇంతకు బూని వచ్చి వచియింపక, పోదునె? విన్ము తల్లి!
దుశ్చింతులు దైత్యు చేబడిన, సీతను గ్రమ్మఱ నేలుచున్నవాడు
ఎంతటి విమోహి రాముడని, యెగ్గులు పల్కిన నాలకించి,
భూకాంతుడు నిందజెంది (2)
నిను కానలలోపల దిన్చి రమ్మనెన్ (2)

లక్ష్మణునికి, సీతమ్మ తల్లి జవాబు

అపవాద ధూషితయైన కాంతను బాసి, పతికీర్తి బొందుట భావ్యమనుము
కౌసల్యాదిగాగల్గు అత్తల కేను, కడుభక్తితో మ్రొక్కులిడితి ననుము
తోడి కోడండ్రు నాతోడి నేస్తము నెంచి, కడసారి సేమంబు నడిగె ననుము
చెలికత్తియలు నన్ను పలుమారు దలపోసి, యమ్ములింప నిరుపయోగమనుము

ప్రజలనికమీద మోదంబు బడయుడనుము, పతిని ఎడబాసి పతిని ఎడబాసి
ఇక సీత బ్రతుక దనుము, జన్మజన్మంబులకు రామసార్వభౌము 2
పరమ పావన భర్తగా బడతు ననుము

బాధతో లక్ష్మణుని వీడ్కోలు, సీతమ్మ తల్లి కి నమస్కారములు తో

ప్రతిదిన మేను తొల్దొలుత పాదములంటి నమస్కరించి,
నీ యతులితమైన దీవనల నంది చరింతు,
తదీయ భాగ్య మీ గతి యెడమాయె,
ఇంకెపుడు గాంతు భవత్పద పద్మముల్,
నమశ్శతములు సేతునమ్మా,
కడసారి గ్రహింపుము, జానకీ సతీ ... జానకీ సతీ

మీరు ప్రయత్నం చేసి, గొంతు శ్వాస పట్టు నిరూపిస్తారు కదు. ఇదీ, కరొనా నెగటివ్ కు ఉచిత పరీక్షే.

గొంతు మాధుర్యం అవసరం లేదు, శ్వాసక్రియ ను ఎక్కువ సేపు ఆపతూ, మన లాగా గార్ధభ స్వరంతో, పాడే ప్రయత్నం చాలు, దైవ సహాయం కు.

నాభి నుంచి రావాలి మన మాటలు, అందుకే ఓంకారం నేర్పారు. దీర్ఘకాలము ఓంకారం అన గలగాలి.

ఆరోగ్యం, ఊపిరితిత్తుల పై ఒత్తిడి, రక్తపోటు అదుపు అన్ని ఉపయోగాలే సుమా.

సనాతన హైందవ ధర్మం, కరోనా గురువు తాతకు కూడా, పరిష్కారం ఇచ్చింది. అహంకారం తో మన పాటించకుండా, ఎగతాళి చేస్తూ, ప్రాణాలు విడుస్తున్నాము.

మీరూ ప్రయత్నం చేస్తూ , పిల్లల కు నేర్పుతారు కదూ.

స్పష్టంగా ఉచ్చారణ ఉంటే, నోటి, రక్త నాళాల, ఊపిరితిత్తుల, పొట్ట రోగాలకు, ఇది ఉచిత మందు అందరికీ.

ముందు అమ్మ నాన్న ల పాద దాసుడు, తర్వాత హరి హర దాసుడు, ఈ అజ్ఞాన శ్రీనివాసుడు

Lord rama telugu movie, lava kusa, songs poems.

Don't worry about the voice sweetness.

Try to practice poems songs to hold the air for holding long time. Om karam should come from naabhi, naval.

Good for health, lungs, blood flow, stomach issues, vaksuddi, etc.

Please try and teach to kids.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,474; 104 తత్వాలు (Tatvaalu) and views 224,967
Dt : 21-Apr-2021, Upd Dt : 21-Apr-2021, Category : Songs
Views : 2910 ( + More Social Media views ), Id : 1120 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rama navami , festival , lavakusa , poems , songs , breathing , exercise , ntr , anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content