Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. పంచభూతాల తో వారానికి ఒకసారైనా ఉండాలి, కలవాలి, నడవాలి, ఆస్వాదించాలి, దానివలన పుణ్యం పురుషార్దం, ఆరోగ్యం, ప్రక్రుతితో మమైక్యం.
అందులో భాగముగా, దేవాలయములో, మనము 2019 లో మొదలు పెట్టిన 108 ప్రదక్షిణాల సంఖ్య, 99 వారాల కి చేరింది. మీరందరూ సాక్ష్యము అప్పటినుంచి.
వచ్చే వారమే, దేవుని దయవలన, ఆయన అండ సంకల్ప బలముతో, 100 వ వారము పూర్తి చేయిస్తారు అని అనుకుంటున్నాము. ఈ వయస్సులో, సంవత్సరము మొత్తము, అన్ని కాలాలలో, అలా ఉత్త పాదాలతో తిరగడము కష్టము.
కానీ మనము మన భారతీయ హైందవ సాంప్రదాయాల విలువ, ముందు చూపు, అందరికి జీపీయెస్ సాక్ష్యము తో తెలియచేయాలి. మీకు వాట్సాప్ స్టేటస్ లో అలాగే సోషల్ మీడియాలో, ఆ ఫోటోలు కూడా పెడుతున్న విషయము తెలుసు, సాక్ష్యం కోసం.
కరోనా సమస్యలతో, మధ్యలో ప్రభుత్వం కొంతకాలము గుడులు మూస్తే, కొన్ని వారాలు ఆగిన విషయము కూడా, మీకు తెలుసు. అది మన చేతిలో లేదు, మనము ఆపలేదు.
కాళ్ళకు ఏమీలేకుండా, పాదం బండరాయిని తాకుతూ, గంట 15 నిమిషాలు, అలా తిరుగుతూనే ఉండాలి, పరగడుపున, సుమా, పాదాలు వాచినా కందినా ఏమి ఇబ్బంది కలిగినా సరే, చలైనా, వానైనా, ఎండ అయినా.
అదేసమయము లో, చేతి వేళ్ళ లెక్క మనసుతో, నారాయణ నామ స్మరణ కూడా జరగాలి. అది కనీసం 2.5 మైళ్ళు పైన వస్తుంది, 6000 అడుగులు 350 కాలరీల శక్తి ఖర్చు అవుతుంది, మనసు తేలిక పడుతుంది.
ఇక పుణ్యము సంగతి, క్రుష్ణునికి వదిలేద్దాము. అమ్మ ఆరోగ్యము అందరికీ తెలుసు, ఆయనే కాపాడారు, 76 ఏళ్ళ వయసులో అన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా, కరోనా చేతికి చిక్కకుండా, ఒక్క రోజు కూడా.
మీలో కొంత మందికి, కొత్త మార్పులు కూడా తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా, నీతి నియమము తప్పకూడదు, కనీసం చిన్న చిన్న విషయాలకైనా.
నా మిత్రుడు ఒకరు చెప్పారు, నేను 5 మైళ్ళు నడుస్తాను అని, మరి బూటు సాక్స్ వేసి నడుస్తావు, పాదము కందకుండా కదా, నలుగురితో కబుర్లు చెబుతూ, అని ఇద్దరము నవ్వుకున్నాము.
3 ఏళ్ళ తర్వాత, ఈ వారం లో, ఊరక డాక్టరు కు చూపించుకుందాము రక్త పరీక్ష తో, మన కాకర అల్లం వేప నిమ్మ అల్లం వెల్లుల్లి పనితనము చూడాలి అని, వెళ్ళాము.
కనీసము రోజూ అరగంట వ్యాయామము ఉందా అని అడిగారు, మన ప్రదక్షిణాలు సంగతి, అమ్మ తో మైలు నడక సంగతి, మన కాకర రసాల సంగతి వివరించాను.
వారు శ్రద్దగా ఆశ్చర్యముగా విన్నారు, అబ్బో ఇలా కూడా ఉంటారా అన్నారు. పర్లేదు, తగిన వ్యాయామము మరియు ఇంటి ఆయుర్వేద ఆరోగ్య రక్షణ వస్తుంది లే అన్నారు. మరి రక్త పరీక్ష ఫలితాలు ఇంకా చూడలేదు. సమయం పడుతుంది.
గతము లో యాగాలు చేస్తే, పెద్ద పెద్ద పూజలు చేస్తే నే పుణ్యం. కలియుగములో, నామ సంకీర్త స్మరణ తోనే పుణ్యం, మనసా వాచా ఆచరణలో ఉంటే.
మరి మన చిన్న ఊరిలోనే 100 వారాలు 108 ప్రదక్షిణలు చేస్తే వచ్చే పుణ్యం కన్నా, పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో చేస్తే వచ్చే పుణ్యం ఇంకా ఎక్కువ.
ఎందుకంటే, అక్కడ అంతా మాయా బ్రమలతో ఎక్కువ మంది ఉంటారు, చెడిపోయే దోవలు ఎక్కువ కాబట్టి, అప్పుల తో పప్పుకూడు, మోహం వ్యామోహం మానసిక బలహీనత ఎక్కువ కాబట్టి.
ధనము తో సంబంధము లేదు. మన గుణము, మన మంచి పనులు ప్రత్యేకము గా ఉండాలి, ఇతరులకు భిన్నముగా. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏదో ఒక పనిలో, దానిని బయటకు తీయాలి.
చూడండి వాట్సాప్ లో తెలుగు లో 1200 కధనాలు, అన్ని రకాలుగా రాయగలను, ఇంత మంది పెద్దల కు చిన్నల కు నాయకులకు అధికారులకు గురువులకు పంపగలను, వారి క్షేమము కోరగలను అని నాకూ తెలీదు.
ఈ చివరి 3 ఏళ్ళలో, ఏలిన నాటి శని గట్టి గా, బాది నేర్పించారు, రాబోయే 5 ఏళ్ళ లో జరగబోయే పరిణామాలు చెప్పించారు. చూద్దాము, ఎంతవరకు జరుగుతాయో.
మొన్న నే, నాతో పని చేసి, నన్ను అభిమానించే, స్నేహితుని కూతురు వాట్సాప్ లో కనపడింది. 7 ఏళ్ళు అయ్యింది, వారి గురించి విని. నేను దూరముగా ఇంకో చోటికి బదిలి అయ్యాము. అదే సమయము లో, నా స్నేహితుడు, శివైక్యము చెందారు. చాలా మంచి మనిషి, ఫోన్ లో మాట్లాడాము ఆ విషయము తెలిసి.
ఎంత మంచి మనిషి అంటే, మనకోసం ఆఫీసులో, తన నాయకుడు తోనే దెబ్బలాడా. సాధారణముగా ఇంటి పెద్ద లేకపోతే, చాల మంది ఇళ్ళలో, అన్ని పరిస్థితులు అస్తవ్యస్తము అవుతాయి, ఎవరి దోవ ఎటో, ఎవరికీ తెలీదు.
కానీ వాళ్ళ అమ్మ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తూ, మా పిల్ల సంగీత కచేరి చూడండి అని, వీడియో పంపితే, అది చూసి సంతోషము తో, చేతులు ఎత్తి, దండము పెట్టాము.
శభాష్, నా స్నేహితుని నమ్మకాన్ని నిలబెట్టారు అని. ఎందుకంటే, ఆ పిల్ల శాస్త్రీయ సంగీతము లో, అందరి ఎదురు కచేరి ఇస్తుంది, తన చదువు చదువుకుంటూ కూడా.
అలా ప్రతి వ్యక్తి లో ఉన్న, ఏదో ఒక టాలెంట్ బయటకు రావాలి, అది ఆ ఇంటి పెద్దలు తెప్పించాలి ప్రయత్నము చెయ్యాలి. ఇంకొకరు, కవిత రాసి పంపారు. ఇంకొకరు, వినాయక ఆర్ట్ గీసారు. అలా తన సొంతముగా చేసేది, ఏ పని అయినా మిత్రులకు చూపించాలి.
ఇవి చదివి కొంతమంది అయినా, ముందుకు వస్తారని, తమ సంపూర్ణ మనసుతో, దేవునికి దగ్గరకు చేరుతారని, ఇవి రాసి పంపుతున్నాము, మీరు చూసినా చూడకపోయినా. ఎందుకంటే, శని రాహు కేతు ప్రభావాల వలన, ప్రతి సంవత్సరము, గురువులు చదవడం లేదా అలిగి మానేయడం జరుగుతుంది, కాల చక్రానికి లోబడి.
వినాయక చవితికి, మట్టి వినాయకునే వాడాలి, సుమా. ప్రభుత్వం, ఇతర అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినట్లుగా, హైందవ కార్యక్రమాలకు కూడా కరోనా జాగ్రత్త ల తో, హైందవ దేశము లో అనుమతి ఇవ్వాలి అని ప్రజల భావన.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,513; 104 తత్వాలు (Tatvaalu) and views 253,864 Dt : 04-Sep-2021, Upd Dt : 04-Sep-2021, Category : General
Views : 947
( + More Social Media views ), Id : 1243 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
panchabhuta ,
100 ,
specialty ,
person ,
pradakshin ,
sing Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments