ఒట్టిపోయిన గోమాత ను వదలడం సంస్కారమా? మరి తల్లి దండ్రులు ను వదలడం? గోమాత రక్షణ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,063; 104 తత్వాలు (Tatvaalu) and views 225,953.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఇన్నేళ్ళు మనకు సేవ చేసి, మనల్ని బతికించిన, ఒట్టిపోయిన పెంపుడు గొడ్డు/ ఆవు/ బర్రె/ దున్న/ మేక ను కసాయివానికి వదలడం సంస్కారం అయితే, మరి ఒట్టి పోయిన తల్లి దండ్రులు ను వదలడం తప్పా? ముదుసలి గోమాత రక్షణ ఎవరు చేస్తారు? అని మన పిల్లలు మనల్ని అడిగితే, మన సాత్విక జవాబు?

జవాబు - వాస్తవవాది లోక విరోధి అంటారు, అది నిజం. నిజాలు ఎవరికీ నచ్చవు, మీరు రాయవద్దు మాకు గుర్తుచేయవద్దు. మాకు తెలీదా ఆ మాత్రం, కానీ మేము ఆచరించము అంటారు.

చిత్తశుద్ది లేని మొక్కుబడి పూజలు తప్ప, మేము ధ్యానంతో మా లోపలకు మేమే చూసుకోము, ఆత్మవిమర్శలు చేసుకోము, మీరు చెపితే ఎలా అంటారు. ఎన్ని తీర్ధాలు పుణ్యక్షేత్రాలు తిప్పినా ముంచినా, చేదు దోస కాయ గుణం మారదు, మేము అంతే అని ఒప్పుకోలేరు.

మొన్న రాసిన, సాధారణ మరియు సాత్విక తల్లి కధనం గాంధారి/ కుంతి ఉదాహరణ తో, చాలా మందికి, సూటిగా తాకింది.

చాలా మంది బాధ వ్యక్తం చేసారు. కానీ తప్పు ఎవరూ ఒప్పుకోరు, సరి చేసుకోరు, ఎదుటి వారినే అంటారు, అంటూనే ఉంటారు, చివరి కన్నీటి పతనం వరకు. వచ్చే జన్మలో మరలా, వీటి పాప ఫలితాలు పొందాలి కూడా మరి. అందుకే విధిరాత వలన జరిగింది అనడం తప్పు, స్వయంక్రుతాపరాధం అంటే కరెక్ట్.

ప్రభుత్వం మద్యం (కరోనా) ఎందుకు ఆపదు అంటాము గానీ, మనము మన బంధువులు తాగకపోతే (తిరగకపోతే), అది ఆగిపోతుంది అని తెలుసు. చెడు సినిమాలు/ సీరియళ్ళు/వెబ్సైట్లు/ వీడియోలు ఆపండి అంటాము, కానీ మన పిల్లలు మనము వాటిని చూడకపోతే, వారు తీయరు అని తెలుసు.

కానీ మన మనసు మన మాట వినదు, ధనలక్ష్మిని/ కాలాన్ని వ్రుధా చేయకుండా ఉండలేము. స్వార్ధ సుఖాలతో సంపాదనతో, విషయాలతో మనకు క్షణం తీరిక లేదు, పిల్లలు మనల్ని లెక్క చేయరు, మాట వినరు.

ప్రాణం ఉన్న ఏ జీవికైనా, మనసు బాధ మమత ఉంటుంది అని, శాఖాహారులకు కొంత తెలుసు. మరి శాఖాహారులు కాని వారికి, ఈ మాటలు రుచిస్తాయా? అబ్బే వారి నాలుక, వారి మనసు, వారి మాట వినదు.

మా రుచుల బాధ ముందు, ఇతర మూగ జీవుల బాధ, మాకు అనవసరం అంటారు. మేము బతకాలి అంటే అవి చావాలి, మాకు ఆహారం/ సంపాదన అవ్వాలి అంటారు. మా ప్రాపంచిక సంతోషమే మాకు ముఖ్యం అంటారు.

మనిషికి గోవు/ జంతువుల కు పోలిక ఏమిటి అంటారు వితండ వాదములో, మరలా కొత్త ఇల్లు కట్టి (బొమ్మ) ఆవు పూజ చేస్తారు తిప్పుతారు.

మరలా దేవునికి మొక్కుతారు, మమ్మల్ని కాపాడు శత్రువులు కుట్రల నుంచి అని. దేవుడు నవ్వుకుంటారు, జాలి దయ క్రుతజ్ఞత లేని స్వార్ధ మనిషి, అరిషడ్వర్గాలకు బానిసలా పతనం అవుతూ ఓ పక్క, మరలా భక్తునిలా కొండకు వచ్చి, ఎలా నటిస్తున్నాడో నా దగ్గర, ఈ పిచ్చివాడి కి పంచభూతాల సాక్ష్యం ఎక్కడికీ పోదని, వీడికి ఎన్ని సార్లు చెప్పినా ఎక్కదు, అని అనుకుంటాడు.

కుక్క, పిల్లి లాంటివి కాస్త బాధ కలిగితే ఎదురు తిరుగుతాయి అరుస్తాయి, కానీ బర్రె/ గోమాత, మౌనంగా కన్నీళ్ళు మాత్రమే పెడుతాయి. కోడి ని మేకను పెంచుతారు, ప్రేమతో కాదు సుమా, తర్వాత కూరకు లేదా ఇంకొకరుకు.

జీవ హింస మహాపాపం అని కూడా, ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ఆచరణలో పాటించము. మనము బతకాలి అంటే, ఎన్నిటినో బలవంతము గా లాక్కోవాలి, పాపం పుణ్యం జాలి దయ ఉండవు, లేవు.

మనుషులనే బాధించి పబ్బం గడుపుకుంటాము, అలాంటిది జంతువుల గురించా? అబ్బే, మాకు అనవసరం, మీ సోది ఆపండి అంటారు.

ఆవు/ బర్రె, మనకు కన్న తల్లి లాంటివి. మన ఇంట్లో అవి లేకున్నా కూడా, మన బజారులో/ పేటలో ఇంకోకరు తెచ్చి పోస్తే, వాటి పాలు తాగే మనము చాలా మందిమి బతికాము, రకరకాల మిక్సింగ్ ల పాకెట్ పాలు రాకముందు.

మన అమ్మ, తన పిల్లలు వరకే పాలు ఇస్తుంది, పక్కవారికి ఇవ్వదు, వారికి అమ్మ లేదన్నా. కానీ గోమాత దేవత, అని ఓ వైపు పొగుడుతూ పూజిస్తూ, ఇంకో పక్క గుక్కెడు పాలు దాని దూడ పిల్ల కు ఇచ్చి, మిగతావి పది ఇళ్ళలో పోసి ధనం సంపాదిస్తున్నాము లేదా ఇంట్లో అందరమూఅ తాగుతున్నాము. రైతులు చేస్తున్న పుణ్యం అనాలో, ఈ పాపమే వారిని కష్టాలకు గురిచేస్తుందో తెలీదు.

చిన్నప్పుడు ఓ రైతు ని అడిగా, అలా తాగే దూడ ను లాక్కుని వెళ్ళి, మనము ఆవు/ బర్రె ల, సంతానం కు చెందిన పాలు, బలవంతముగా దొంగిలించడం, తప్పు కదా అని.

ఏమి చేస్తాము బాబూ, మనము బతకాలి కదా, అమ్ముకుంటేనే 4 రూపాయలు వస్తాయి అన్నారు.

అలాగే దున్నలతో అరక పట్టించి పొలము దున్నుతారు అని మనకు తెలుసు.

ఇలా ఆవు దున్న ల మీద, వచ్చిన సంపాదన లాభములో కొంత, పోస్ట్ ఆఫీసులో వేస్తే, వాటికీ ఫించను గా ముదుసలి తనము లో ఉపయోగ పడతాయని, ఎంతమంది రైతులు ఆలోచన చేస్తారు?

మరి అవి ముదుసలి వయసుకు వచ్చిన తర్వాత, మన తల్లి లాగా, మన ఇంట్లోనే ఉంచి, సేవ చేస్తామా?

లేదు, ఇక పనికి రాదని తెలిసిన వెంటనే, అమ్మేస్తాము. వారు ఎవరికి అమ్ముకుంటారో తెలీదు.

అది అన్యాయం కదా అని, ఒక పేద రైతును అడిగా, ఆదాయం లేకపోతే మాకు ఖర్చులు తలభారం అవుతాయి అన్నారు. మరి భూస్వామిని అడిగా, ఆయన ఉపయోగం లేని దాన్ని, మనము ఉంచుకోము కదండి అన్నారు.

అంటే ఇక్కడ ఖర్చు/ పేదరికం కాదు సమస్య, ఇంట్లో పిల్లలు భాగస్వామిని వదులుకోము కదా? కేవలం అవసరమా/ ఉపయోగమా లేదా అన్నదే మనకు ముఖ్యం. అదే పక్కా స్వార్ధం.

ఇన్నేళ్ళు పాలు తాగిన ముదుసలి గోవును ఉంచుకోము, అలాగే ముదుసలి అమ్మ/అత్త మరియు నాన్న/మామ పరిస్థితి అనుకుందామా? దీనిని మార్చే శక్తి మనకు ఉంది, కానీ దేవుడా నువ్వు మార్చు అంటాము, అదే మన బలహీనత, మన పతనానికి మొదటి మెట్టూ.

కానీ బర్రె/ గోమాత, మౌనముగా కన్నీళ్ళు మాత్రమే పెడుతాయి, ఒరే క్రుతజ్ఞత లేని మనిషి, నీ బతుకు చివరలో ఇలాగే నిర్దాక్షిణ్యముగా ముగుస్తుంది అంటాయా? అనవు అవి నిస్వార్ధ జీవులు, పరుల కోసమే జీవిస్తాయి. కానీ జీవ హింస ఫలితం మనకు తప్పదు.

అందుకే మానవుల కన్నా, జంతువులు మేలు. మన పిల్లలకు సంస్కారం ఎలా నేర్పుతాము, ముందు మనకే లేదు కదా. పిల్లలు ఈ ప్రశ్న అడిగితే, సాత్వికులు సిగ్గుతో తలవంచుకుని కన్నీళ్ళు పెడతారు. తప్పు సరి చేసుకుంటారు.

అందుకే ముదుసలి గోమాత మరియు తల్లి దండ్రుల రక్షణ మనందరి బాద్యత, దగ్గర ఉంచి ప్రేమగా చూసుకోవాలి క్రుతజ్ఞత గా.

మిగతా వారు, ఏవో మాటలతో అబద్దాలుతో సర్ది చెపుతారు, కానీ పిల్లలకు కళ్ళెదుట ప్రత్యక్ష సాక్ష్యం ఉంది కదా.

ఇప్పుడు మనిషి తోటి మనిషిని అసహ్యించుకుంటూ దూరంగా ఉంటూ, పెంపుడు జంతువులను ముద్దు చేస్తున్నారు. మరలా వాటికి వయసు ముదిరితే, వాటినీ ఉంచరు సుమా.

మన సంస్కారం ఇంతే, ఈ కలియుగములో, అందుకే మనకు కరోనా లాంటి గురువులూ వస్తూనే ఉంటారు, ప్రక్రుతి వైపరీత్యాలతో పాటుగా.

Ottipoyina gomata nu vadaladam samskarama? Talli danDrulu nu vadalaDam? Gomata rakshana?


https://m.facebook.com/watch/?v=2631725313740998  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,063; 104 తత్వాలు (Tatvaalu) and views 225,953
Dt : 12-Jun-2022, Upd Dt : 12-Jun-2022, Category : General
Views : 609 ( + More Social Media views ), Id : 1425 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : old , age , ottipoyina , gomata , cow , vadaladam , samskarama , talli , dandrulu , parents , rakshana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content