మన లక్ష్యం - ఎక్కువ మందికి చేరాలి ప్రభుత్వ పనులు - ఇతర పార్టీ అభిమానులు, తటస్థంగా ఉన్న ప్రజలకు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,728; 104 తత్వాలు (Tatvaalu) and views 225,705.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చూడండి, మన నాయకులు తెలిసో తెలీకో, తమకు ఉచితంగా వచ్చే మరియు రావాల్సిన పబ్లిసిటీ నీ, అలాగే ప్రభుత్వం కు, మంత్రి గారికి మరియు జగన్ గారికి రావల్సిన పేరు ను, వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు అయినా మేల్కొనాలి.

ఇదే మాట, ఇంతకుముందు ఆర్టికల్ లో, జిల్లా మంత్రి వర్యులు మరియు ఎంపీ గార్ల కు, కలెక్టర్ గారికి విన్నవించాము.

ఇది పోలీసు, రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీ, విద్యా, మున్సిపల్, ఇతర అధికారులు అందరికీ వర్తిస్తుంది కదా.

ఈ ఫోటో (Pic 1) చూడండి, మంత్రివర్యులు బాలినేని మరియు ఎంపీ మాగుంట గార్లు, ముఖ్యమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ లో, జిల్ల కలెక్టర్ మరియు ఇతర అధికారులు తో పాల్గొన్నారు. ఈ ఫోటో ఎమ్మెల్యే మరియు ఎంపీ గారి ఫేస్బుక్ లో ఉంది. అంటే, కేవలం ఆ పేజి లైక్ చేసిన, అభిమానులు కు చేరుతుంది ఈ సమాచారం.

ఈ ఫోటో (Pic 2) చూడండి, ఎమ్మెల్యే కరణం గారు, మంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ లో, మున్సిపల్ అధికారులు తో పాల్గొన్నారు. ఈ ఫోటో ఎమ్మెల్యే గారి ఫేస్బుక్ లో ఉంది. అంటే, కేవలం ఆ పేజి లైక్ చేసిన, అభిమానులు కు చేరుతుంది ఈ సమాచారం.

అభిమానులు, ఎటూ మన వైపే ఉంటారు కదా. మన లక్ష్యం ఏమిటి, ఇంకా ఎక్కువ మందికి చేరాలి కదా మన మరియు ప్రభుత్వ పనులు. ఇతర పార్టీ అభిమానులు మరియు తటస్థంగా ఉన్న ప్రజలకు కూడా చేరాలి. రేపు న్యూస్ పేపర్లో వచ్చే ది ఎంతమంది చూస్తారో తెలీదు, ఇప్పుడు జనం కొనడం లేదు. మరి తటస్థంగా ఉన్నవారు కు, ఎలా చేరుతుంది?

జిల్ల కలెక్టర్ మరియు ఇతర అధికారులు (Pic 1) గనుక, తమ అధికారిక ఫేస్బుక్ పేజీ లో, ఈ రోజు ఇలా కార్యక్రమం జరిగింది, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే మరియు ఎంపీ గారు పాల్గొన్నారు అని నాలుగు ఫోటోలు పెట్టి 4 మాటలు రాస్తే, ఇతర ప్రజలకు కూడా చేరుతుంది.

మున్సిపల్ అధికారులు (Pic 2) గనుక, తమ అధికారిక మున్సిపల్ ఫేస్బుక్ పేజీ లో, ఈ రోజు ఇలా కార్యక్రమం జరిగింది, బొత్స మంత్రి గారు, ఎమ్మెల్యే కరణం గారు పాల్గొన్నారు అని నాలుగు ఫోటోలు పెట్టి 4 మాటలు రాస్తే, ఇతర ప్రజలకు కూడా చేరుతుంది.

ఇది అధికారిక కార్యక్రమం, కాబట్టే ముందు చూపుతో, ఆ నాడు చంద్రబాబు గారు దీనిని ప్రవేశ పెట్టారు. నేడు జగన్ గారి ప్రభుత్వం లో, దానిని ఇంకా వాడుక పెంచాల్సింది పోయి, అసలు పూర్తిగా మానేసి, ప్రభుత్వం కు నష్టం చేస్తూ, తమకు మరియు తర్వాత తమ ఎలక్షన్ గెలుపు కు కూడా, నష్టం చేసుకుంటున్నారు.

ఏ ఎమ్మెల్యే లేదా మంత్రి అయినా, ప్రభుత్వ అధికారులు ను కలసినప్పుడు, అధికారిక ప్రభుత్వ ఫేస్బుక్ పేజీ లో, ఈ కార్యక్రమం గురించి రాయమని కోరాలి. అది తమ కోసమే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు జనాలకు చేరడము కోసము కూడా.

ఫేస్బుక్ పేజీ అసలు లేదు లేదా పాత పేజీ పాస్వర్డ్ లేకపోతే, కొత్తగా పేజీ పెట్టండి, అని గట్టిగా కోరాలి. ఈ విధంగా కూడా ప్రచారం జరగాలి. ఇది ప్రజలకు కూడా ఉపయోగం. అలాగే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మరియు మాజీ లు కు అయినా లాభమే.

మంత్రి బొత్స గారి పేరు, అన్ని పట్టణ ప్రభుత్వ వెబ్సైట్ లో వస్తుంది కదా. బొత్స గారికీ ఈమెయిలు పంపాము, చేరుతుందో లేదో తెలీదు.

దయచేసి ప్రభుత్వం కు, మీకు, మరియు ప్రజలకు, సోషల్ మీడియాలో సమాచారం ఇవ్వండి వీలు ఉన్న అన్ని పద్దతులలో.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,728; 104 తత్వాలు (Tatvaalu) and views 225,705
Dt : 03-Jun-2020, Upd Dt : 03-Jun-2020, Category : Request
Views : 929 ( + More Social Media views ), Id : 575 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : our goal , reach more people , govt programs plans , other party fans , neutral people , karanam , magunta , balineni
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content