Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Outsider dont say good things about you. Everyone knows about the qualities of Rama, Sita and Krishna right from childhood.
బయట వారు మీ గురించి మంచి చెప్పరు. రాముడు, సీత, క్రిష్ణయ్య గుణాల గురించి చిన్నప్పటి నుంచే అందరికీ తెలుసు కదా?
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
*మన చేతులో ఏమీ ఉండదు గురువు గారు, ఉద్యోగాలు, అందులో కొన్ని రిమోట్ రావచ్చు. మొన్న 6 అవకాశం వచ్చింది అందులో కొన్ని రిమోట్, తర్వాత ఎప్పుడో, మనకు తెలీదు. ఉంటే తప్పకుండా గుణవంతులు అయిన మీకు చెపుతాము, మీరు మీకు తెలిసిన గుణవంతులకు చెపుదురు.*
అర్హత/ పాత్రత/ విశ్వసనీయత/ క్రుతజ్ఞత/ అందరి క్షేమం లేకుండా, సహాయం/ పెళ్ళి/ ఉద్యోగం/ వ్యాపారం/ జీవనం/ ప్రయాణం/ సంసారం/ సంవాదం ఎవరితో చేసినా, భస్మాసురులతో, వారి మరియు మన ఇంట్లో వంట్లో, గుండెపోటు వెన్నుపోటు తప్పదు కదా. అదే గుణవంతులకు అండగా ఉంటే, వారు వద్దు అన్నా, మనకు పుణ్యం ప్రవహిస్తుంది.
అందుకే మనము, ఎవరు కష్టం ఉంది అన్నా, గంటలు గంటలు వింటాము. మన బాధ వెళ్ళ గక్క క పోతే, అదే కణితలు గా మారి, రోగం వస్తుంది, మానసిక బలహీనులు అవుతారు, తప్పక ఇంకొకరితో చెప్పాలి, నమ్మకం అయినవారితో.
మనకు ఇద్దరు, కారు నడపటం నేర్పారు 20 ఏళ్ళ ముందు, తన్ని తిట్టి. ఇంకొకరు 25 ఏళ్ళ ముందు టమోటాలు వంకాయలు ఇచ్చారు వారం వారం, మనం వద్దు అన్నా కూడా. ఇప్పటికీ ఫోన్ లో నవ్వుకుంటూ ఉంటాము.
ఇప్పుడు అమ్మను కారులో అన్నిటికీ తిప్పే పుణ్యం లో వారికి కొంత శాతం, మనము వద్దు అన్నా వెళుతుంది, అది ఆపే శక్తి కూడా మనకు లేదు.
ఒక్కసారి మనల్ని అర్ధం చేసుకున్న వారు, మనల్ని వదలరు. అర్ధం కాని వారు, మనతో ఉండరు, తర్వాత వారి వారే వారితో ఉండరు, వీరి ప్రాపంచిక బ్రమల అజ్ఞానం వలన.
అలాగే రెఫెరెన్స్ కావాలి అంటే, 14 మంది లో 8 గురు స్వచ్చందముగా ముందుకు వచ్చారు. అలాగే ఇతరులు చాలా సహాయం చేసారు, కేవలం మన గుణం చూసి. వారికీ ఈ మన శని వార పుణ్యంలో భాగం, మనం వద్దు అన్నా, తప్పక వెళుతుంది.
గతములో నే చెప్పాము కదా, మన శనివారం సాధనల పుణ్య ఫలం లో మనకు 50% శాతం కన్నా తక్కువ వస్తుంది, మిగతాది సహాయం చేసిన వారికి వెళుతుంది అని.
అందుకే ఎప్పుడూ సత్వ గుణ వారు, అడగక అడగక సహాయం అడిగితే, ఎవరూ కాదనరు, ఎంత సహాయం అయినా చేస్తారు. ఎందుకంటే, అది వారికి, వారి పిల్లలకు, మనమలకు దైవం అండ. కాదు అన్నవారికి, రేపు అదే కాదు/ లేదు అనే జవాబు పంచభూతాల నుంచి వస్తుంది.
మీకు ఎటూ వెతికి పెట్టడం ఉచితమే కదా, మాకు పుణ్యమే కదా. రూపాయి మీరు ఇవ్వాలి అని అనుకున్నా, మీకు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదు అని నిరూపించాలి, అది మీ వలన కాదు, కాబట్టి పూర్తిగా ఉచితం. ఇంకా మేమే 7 ఇన్సెంటివ్స్ అని పంపాము కదా.
వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు చెపితే, మనం ఒకరం. వారం 10 రోజుల లో వెంటనే చెప్పాలి. అందుకే మొన్న 6 పంపి, సాఫ్ట్ స్కిల్స్ కూడా ముందు జాగ్రత్తలో వివరించాము, భవిష్యత్ కు. మీ గురించి, మీ పిల్లలు మనుమలు గురించి మీరే గుణాలు చెప్పాలి, సోషల్ మీడియా సాక్ష్యం తో.
బయట వారు మీ గురించి మంచి చెప్పరు. రాముడు, సీత, క్రిష్ణయ్య గుణాల గురించి చిన్నప్పటి నుంచే అందరికీ తెలుసు కదా? మరి మనకు భయం ఏమిటి, సత్వ గుణం ఉంటే?
మన మీద వారికి స్పెషల్/ ప్రత్యేక నమ్మకం ఏంటంటే, మన శని వార సాధనలు మొత్తము తెలుసు. సాఫ్ట్ స్కిల్ మరియు సత్వ గుణం లక్షణాలు, అన్నిటికి జవాబులు అందులోనే ఉన్నాయి కదా? అబద్ధాలు మోసం కుట్ర కపటం ఉండదు రెజ్యూం/ బయోడేటా లేదా విషయాలలో, స్పష్టం గా సత్వ రజో తమో గుణ లక్షణాలు విశ్వసనీయత కృతజ్ఞతలు వివరించి, ఉద్యోగం/ వ్యాపారం/ వివాహం కు అనుకూలంగా ఉంటేనే సర్దుకుని పోతారు అంటే నే చెబుతాం, మనవైపు వివరాలు పంచుతాం.
మనం ఏం సహాయం చేయకపోయినా తప్పు లేదు. కానీ గుణం లేని వారి ని తెలియని వారిని ఇవ్వకూడదు. నమ్మకద్రోహం చేయకూడదు, ఉద్యోగం పెళ్లి వ్యాపారం విషయములో. మన సొంత తమ్ముడు/ కూతురు/ కొడుకు అయితే, ఎలా మంచి వారిని ఎన్నుకుంటామో, బయట వారైనా అదే జాగ్రత్తలు.
లేదంటే చూడండి చుట్టూ మామ/ బాబాయి/ భాగస్వామి కి వెన్నుపోటు/ గుండెపోటు/ ఆస్తి పోటు/ విడాకుల పోటు. ఉద్యోగా/ వ్యాపారా లలో కూడా ఎన్నో మోసాలు.
సొంత పిల్లలే, అమ్మ నాన్న ను ఇళ్ళు ఖాళీ చేయించి, తమతో పెట్టుకుని, ఆ ఇళ్ళు అమ్మి తమ అప్పులు తీర్చుకుని, తగవులు ఇంట్లో మనశ్శాంతి లేదు అని, చివరలో వారిని అనాధాశ్రమంలో చేరుస్తూ ఉన్నారు.
అదిగో భవిష్యత్ లో అది జరగకుండా చూడాలని, మాత్రమే మన దగ్గర కు వస్తారు. గంట మనతో మాట్లాడితే, వారి మరియు వారి పిల్లల, గుణం ఓర్పు సహనం త్యాగం తనమన మనకు అర్థం అవుతుంది.
+ + +
నిన్న అమ్మ నేను నడిచి వస్తుంటే, పాత ఆయన, రోడ్ మీద ఆపి, తన గాధ వెళ్ళబోసుకున్నారు అని ఓ 2 లేదా 3 ఏళ్ళ ముందు చెప్పా, గుర్తు ఉందా? ఆయన చెప్పాడు, అమ్మాయి విడాకులు అయ్యాయి, మోసపోయాము. 2 వ వివాహానికి చూస్తున్నాము, త్వరలో చూడటానికి వస్తారు అని. మీతో మాట్లాడించనా, మీరైతే నిప్పో ఉప్పో ముందే చెపుతారు. తర్వాత, ఈ కోర్ట్లు గొడవలు మేము తిరగలేము, 2 వది అంటే ఇంకా జాగ్రత్త గా ఉండాలి అని.
ఆయన మనల్ని గుడి లో పూజారి గా చూసారు హారతి సమయములో, గుర్తు ఉందా, మనం 1 ఏడాది, హారతి ఇచ్చి ఎదురుగా 10-50 మందితో పాటలు పాడించాము ప్రతి వారము 2 సార్లు.
చెడు పెళ్ళి సంబంధము తప్పినా పర్లేదు అనుకుంటే నే, మనతో మాట్లాడించండి, లేదంటే, మీకు మీరే మాట్లాడుకొండి, కేవలం వీసా/ అందం/ ధనం/ ఆస్తులు కోసం అయితే, మేము అవసరం లేదు అని చెప్పాము. ఆయన నవ్వారు.
+ + +
ఇంకో విషయం, ఈ రోజు ఉదయం 4 కు, కొబ్బరి నూనె స్పూన్ నిమ్మరసముతో కలిపి తాగాము. హాయి గా ఉంది. త్వరలో ఆముదం అలాగే ఆలివ్ ఆయిల్ తో కూడా ప్రయత్నము చేద్దాము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,584; 104 తత్వాలు (Tatvaalu) and views 254,498 Dt : 20-Jul-2024, Upd Dt : 20-Jul-2024, Category : General
Views : 140
( + More Social Media views ), Id : 2152 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Outsider ,
good ,
things ,
knows ,
qualities ,
Rama ,
Sita ,
Krishna ,
childhood. Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments