Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *అమ్మా నాన్నా చేసిన తప్పులు, ఘోరం ఏమిటి? వారి గొప్ప చెప్పడానికి 3 ఏళ్ళు పైగా ఒక్క మాట, పాట లేదా? వారు చెప్పిన ఆచరించిన మంచి లో, మనం మన పిల్లలు, ఎన్ని ఆచరణలో పెట్టాము? మరి ఆధ్యాత్మికత వ్రుద్ది చెందుతుందా, అరిషడ్వర్గాల బానిసత్వం తప్పుతుందా?*
మా అమ్మ కు, నాన్న కు పాడిన పాట, మాట ప్రయత్నం విన్నారా? మనది గార్ధభ స్వరం, అలాగే మాధుర్యం రాగం కూడా ఉండదని, ముందే ఒప్పుకున్నాం, అజ్ఞాన శిష్యులు గా ఆచరణ భక్తులు గా. కేవలం మధురముగా పాడే, మా (మీ) గురువులను మరియు వారి పిల్లల మన్సుల ను మేల్కొలిపే ప్రయత్నం మాత్రమే ఇది.
- - -
*అమ్మా నాన్న కోసం పాటలు*
* ఈ పాట మా అమ్మ ను నిద్రపుచ్చడానికి, అలాగే పాట అర్ధం అమ్మ కు కూడా సరిపోతుంది.
జో..ఓ.. లాలి, జో..ఓ.. లాలి
లాలి నా చిట్టి తల్లి.. లాలి నను కన్న తల్లి ..
చిరు నవ్వు, కిరణాలు, చిందించు మో.ము, కన్నీరు, మున్నీరు,గా చూ.డలే.ను
* ఇది కరెక్ట్ గా నాన్న కు సరిపోయే పాట
ఓ నాన్న, నీ మనసే వెన్న, అమృతం కన్నా, అది ఎంతో మిన్న , ఓ నాన్న, ఓ నాన్న
ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూలతోటలో మమ్ము నడిపావు
- - -
*అమ్మా నాన్న మాటలు* -
బీదరికం అంటే చవిచూచి, కష్టపడుతూ పైకి వస్తూ, బిడ్డల కు కూడా, ఇంటి పని పొలం పని అన్ని పనులు నేర్పించి, తన బాధ్యత తాను, సంపూర్ణముగా పూర్తి చేసారు. ఉంటే తిందాము, లేకపోతే గమ్ముగా ఉందాము, ఉన్న దానితో త్రుప్తి చెందుదాము. అప్పు చేసి లేదా ఇతరులను దోచి, మనకు పరమాన్నం వద్దు, అది నిలవదు. అప్పుచేసి పప్పు కూడు, అసలే వద్దు. మంచి గుణం బాద్యత ఎప్పటికీ మారకూడదు, ఎంత నష్టపోయినా పర్లేదు. గతం మరియు మూలాలు మరువద్దు. ఎవరి దాని గురించి ఆశించవద్దు, అత్యాశకు చేయి చాపవద్దు. ఎవరినీ, మీరు మాకు, అది ఇది చేయలేదని నిష్టూరాలు అడగవద్దు.
ఇలా నీతి నియమాలతో ఉంటే, దేవుడే కావలసినవి అన్ని అమరుస్తాడు, మంచి వారి ద్వారా, సరైన సమయములో, కావలసినంత మాత్రమే - అని కఠిన క్రమశిక్షణలో పెంచారు. దానిని ఆచరించిన వారు ఆనందముగా ఉన్నాము, కష్టాల కు బెదరక, సుఖాల కు సంతోషాల కు పరితపించక. పాటించని వారు, వారి పాట్లు వారు పడుతున్నారు, రాబోయే శిక్షలకు ఎదురు చూస్తున్నారు. కష్టాలు ఉన్నంత కాలం, దేవుడు తోడు ఉంటారు.
--
అలాగే మా నాన్న గురించి చెప్పిన, కొన్ని మంచి మాటలు చదివారా, ధన హోదా సంబంధం లేనివి, కేవలం గుణం సంస్కారం గురించి? అంటే బీదవారైనా మధ్యతరగతి వారైనా అవి చేయవచ్చు. వాటిలో కొన్ని అయినా, మనం ఆచరణలో పెడుతున్నామా?
ఇంకేమైనా సరి చేసుకోవాలా? 8 ఏళ్ళు సజీవ గురువు (ముదుసలి కన్న తల్లి) సేవ కన్నా, ఇంకా ఉత్తమ దైవ పూజ/ సాధన ఉందా? అది మన తండ్రికి, తాత ముత్తాత లకు సంతోషమే కదా?
మరి మీరూ, మీ ఉత్తమ అమ్మా నాన్న ల కు గౌరవం గా కృతజ్ఞతలు తో విశ్వసనీయత తో, పాడిన పాటలు మరియు మాటలు ప్రయత్నం ఏవి?
ఈ అజ్ఞాన శిష్యులకు చదవడానికి వినడానికి, రూపాయి ఖర్చు లేని, ఆ చిన్న భాగ్యం కూడా కలిగించలేరా? చేతల్లో, దైవం ను నమ్మి, పేరెంట్స్ ని ప్రేమిస్తే నే సుమా?
లేకపోతే, మా మాటలు పట్టించుకోవద్దు, సంస్కృత భాష లాగా అర్థం కాకపోగా, అపార్ధం అవుతుంది, అలాగే ప్రాపంచిక మోహం లో మునుగుతూనే ఉందాం, రాహు కేతు శని క్రమశిక్షణ సమయం వచ్చిన దాకా.
మన పెద్దల గురించి 4 మంచి మాటలు ఏవి, ఇన్నాళ్లు ఇన్నేళ్లు గా? వారు చెప్పిన ఆచరించిన మంచి లో, మీరు/ మేము మరియు మీ/ మా పిల్లలు, ఎన్ని ఆచరణలో పెట్టారు?
మనం ఇల్లు కొంటే, పెళ్ళి అయితే, తోట పెంచితే, ధర్నా చేస్తే, ఉద్యోగం పదవి హోదా ఐశ్వర్యం వస్తే, షికార్లు సినిమా టూరు లకు వెళితే గొప్పగా ఫోటోలు వీడియో లు పెడతాము.
మరి సొంత అమ్మ నాన్న గురించి, ఓ పాట ఓ మాట కష్టమా? పితృ శాపాలు రుణాలు వదలవు సుమా
మన అమ్మా నాన్నా చేసిన తప్పులు, ఘోరం ఏమిటి?
మనలాంటి అరిషడ్ వర్గాల బానిసలను, కృతజ్ఞతలు విశ్వసనీయత కనికరం దయ జాలి లేని, రాతి గుండె బండలను కనడమేనా?
కాకపోతే, మన సొంత అమ్మ నాన్న గురించి, గొప్ప మాటలను 4 చెపడానికి, 3 ఏళ్ళు పైగా ఒక్క మాట పాట దొరకలేదా?
నిజంగా లేకపోతే, ఇక మనకు పెళ్లి పిల్లలు ఎందుకు?
కలియుగ పాపం ఇంకా పెంచడానికా లేదా కరోనా/ పంచభూతాలు లాంటి వాటికి బలిచేయడానికా? పాపం ఎక్కడ నో లేదు, మన ఇంట్లో నే ఉందని మనం ఒప్పుకోలేం, అంత ధైర్యం లేదు.
అందుకే మనలోకి మనము చూసుకోడానికి సరి చేసుకోవడానికే, ధ్యానం. ఇంకొకరు చెపితే, మనం వినము కదా?
కలియుగ ధర్మం ప్రకారం ధర్మం ఒక పాదాన కుంటుతుంది అంటే, 20 మంచి వారిలో ఉందాం, 80 శాతం చెడ్డ/ అరిషడ్వర్గాల బానిసల వారిలాగా వద్దు మిత్రమా, తగిన శిక్షలు తప్పవు నేడో రేపో.
First serve feet of living Guru Old Mom (Dad) at home, later serve feet of spiritual Goddess (God) at temple.
ముందు ఇంట్లో సజీవ గురువు ముదుసలి అమ్మ (నాన్న) పాద సేవ, తర్వాతనే గుడిలో ఆధ్యాత్మిక పెద్దమ్మ (పెద్దయ్య) పాద సేవ.
is parents wrong? One word/ song years say their great? We children, how many practice? Spiritual Arishadvargam?
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,270,601; 90 తత్వాలు (Tatvaalu) and views 175,061 Dt : 20-Jun-2022, Upd Dt : 20-Jun-2022, Category : General
Views : 251
( + More Social Media views ), Id : 1432 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
parents ,
wrong ,
word ,
song ,
children ,
practice ,
spiritual ,
arishadvargam Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments