పాతాళభైరవి - ప్రేమ కోసమై వలలో పడెనే Parody - ఎన్ టీ ఆర్, ఎస్.వి.రంగారావు, మాలతి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,878; 104 తత్వాలు (Tatvaalu) and views 225,109.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ కాలం లో ప్రేమ కేం విలువుంది. ఈ పాట చూసైనా, మన్నించాలి ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. గుణం చూడకుండా చేసుకున్న, ఏ పెళ్ళి కూడా, అంటే ప్రేమ అయినా లేదా పెద్దలు కుదిర్చినదైనా, ఎక్కువ కాలం నిలవలేదు. నిలిచినా, ఉత్తమ సంస్కారం ఉండదు, తమ ముదుసలి పెద్దలను వీరు చూడరు, వీరిని వీరి పిల్లలు చూడరు. చివరకు అన్ని కన్నీళ్ళే, కోర్టులు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలే.

పింగళి సాహిత్యం, ఘంటసాల మాస్టారి సంగీతం, పి.విజయవర్మ గాత్రం, యన్.టి. రామారావు యస్ వి రంగారావు గార్ల నటన, వీళ్ళందరి పొందిక చక్కగా కుదిరిన పాట ఇది.

ఈ పాటను వి.జె.వర్మ పాడగా మధ్యన ఒక ఆలాపనతో ఘంటసాల తన గొంతును కలిపారు. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, సురభి కమల, మాలతిపై చిత్రీకరించారు.

సింధుభైరవి రాగచ్చాయలలో ఈ పాటను స్వరపరిచారు ఘంటసాల. పాటల రచయితగా ఈ పాట ద్వారా పింగళి సాధించిన విజయం చాలా ఉంది.

ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు అనే వాక్యం, ఒక సామెతలా తెలుగునాట ఈ నాటికీ చెలామణిలో ఉందంటేనే అలోచించుకోవచ్చు. ఆ విజయం ఎంతటిదో ? వాసిగల వాక్యానికి వార్ధక్యం ఉండదంటారు. బహుశా ఇదేనేమో! ఈ పాటను పాడింది వి.జె.వర్మ అని చాలామందికి తెలియదు. ఈ పాట మొత్తం ఘంటసాలే పాడారనుకునే వాళ్ళయితే లెక్కేలేదు.


Parody
ప్రేమ కోసమై, వలలో పడెనే, పాపం పసివాళ్ళు.. .
అయ్యో పాపం పసివాళ్ళు 2

వేమరు దేవుల వేడుకుని, తమ బిడ్డల క్షేమం కోరుకుని . . .ఓ ఓ ఓ 2
ఏమైనారో - ఏమౌనోయని, కుమిలే తలితండ్రిని, కుములుమనీ ||ప్రేమ||

ప్రేమకన్ననూ పెన్నిధియేమని, యేమి ధనాలిక తెచ్చుననీ 2
భ్రమసి చూచు ఆ తల్లి దండ్రులను, నిముసమె యుగముగా గడుపుమనీ ||ప్రేమ||

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని, ఆ వ్యామోహాలను నమ్ముకుని 2
ఏమి వ్రాసెనో, అటు వద్దని, బ్రమలన్నిటిదే భారమనీ ||ప్రేమ||

గుణసంస్కార క్రుతజ్ఞత ఏలని, ధన ఆస్తిసంపాదన మేలని
బతుకులు బండలు, అయినా కమ్మని, తలితండ్రిని గాలికి వదలి ||ప్రేమ||

Original
ప్రేమ కోసమై, వలలో పడెనో, పాపం పసివాడు...
అయ్యో పాపం పసివాడు 2

వేమరు దేవుల వేడుకుని, తన కొమరుని క్షేమం కోరుకుని . . .ఓ ఓ ఓ 2
ఏమైనాడో - ఏమౌనోయని, కుమిలే తల్లిని, కుములుమనీ ||ప్రేమ||

ప్రేమకన్ననూ పెన్నిధియేమని, యేమి ధనాలిక తెచ్చుననీ 2
భ్రమసి చూచు ఆ రాజకుమారిని, నిముసమె యుగముగా గడుపుమనీ ||ప్రేమ||

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని, ఆ మాయావిని నమ్ముకుని 2
ఏమి వ్రాసెనో, అటు కానిమ్మని, బ్రహ్మదేవునిదే భారమనీ ||ప్రేమ||

Pathala Bhairavi Paataalabhairavi Patala bhairavi పాతాళభైరవి
Actor : NTR / ఎన్ టీ ఆర్ , S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు
Actress : Malathi / మాలతి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : పి.విజయవర్మ, Ghantasala / ఘంటసాల

Pathala Bhairavi Prema Kosamai Valalo Padene NTR SV Ranga Rao Malathi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,878; 104 తత్వాలు (Tatvaalu) and views 225,109
Dt : 04-Nov-2022, Upd Dt : 04-Nov-2022, Category : Songs
Views : 512 ( + More Social Media views ), Id : 1608 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pathala , bhairavi , prema , valalo , ntr , svrangarao , malathi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content