Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అద్దం, మన మొఖములో, మరకని చూపిస్తే, మరకని తుడుచుకుంటాము గానీ, అద్దాన్ని పగల గొట్టం.
అలాగే, ఎవరైనా మన మంచి కోరే వారు, మనలో లోపాన్ని సమస్యను చూపిస్తే, వీలైతే దాన్ని సరిదిద్దుకోవాలి. లేదంటే గమ్ముగా ఉండాలి ధన్యవాదాలు చెప్పి, వారిపై కోపము చూపించకూడదు, వాదించకూడదు. భవిష్యత్ నష్టము మనకే.
ప్రపంచములో, ఒకరి సమస్యను లోపాన్ని ఎత్తి చూపాలి, అన్న అవసరము తీరిక ఎవరికుంటుంది? దాని వలన ఎవరికి లాభం?
అయితే, చెప్పే వ్యక్తి వ్యక్తిత్వమును బట్టి, అతను మన నుంచి ఆశించేదానిని బట్టి, ఆ లోపము నిజమైనదా కాదా, అని ఆలోచన చెయ్యాలి.
మీరు చెప్పండి, 800 పేజీల ఆర్టికల్స్ పుస్తకము రాశాము అనుకోండి ఇప్పుడు దాకా, ఒక్కటి అయినా, కేవలము మాకు సొంతానికి ఇది కావాలని, స్వార్ధముగా ఉందా?
మన ఊరికి, రాష్ట్రానికి, మీ పార్టీకి అడిగింది, మా స్వార్ధము కాదు కదా? అధికారులు, పార్టీలు సోషల్ మీడియా పెడితే, వారి ఫోటోలు పనులు పెట్టుకోమనే గానీ, మన గురించి పెట్టమని కాదు కదా?
మొన్న ఒకతను అడుగుతున్నారు నవ్వుతూ. ఏమండీ, వైకాపా తెదేపా బీజేపీ జనసేన, నాయకులు లేదా అధికారులు మీకు తెలుసా? మీకు ధనము ఇస్తున్నారా? వారి వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపుతున్నారు, వారు బాగుపడితే, మీకు వచ్చిన లాభము ఏమిటి? అని అడిగారు.
ఒక్కరు కూడా మనకు తెలీదు, తెలియాల్సిన అవసరము కూడా లేదు, ఎవరు ఏమీ ఇవ్వరు. వారు ఇస్తే ధనము, బీహార్ లేదా అమెరికా కన్సల్టింగ్ కంపనీకి ఇస్తారు, మనలాంటి సామాన్యులకు అండగా ఉండరు, అని చెప్పాను. మరి లాభము ఏమిటీ అన్నారు, లాభము మీరే అంటే, నారాయణ సంతానమైన, నారాయణ స్వరూపులైన ప్రజలు.
ఒక వ్యక్తిగా, మన ఊర్లో జరిగే తప్పును, మనము అడగలేము. కనీసము కోపము లేదా సిద్ధంతము తో అన్నా, ఒక పార్టీ అడుగుతుంది. మరి, వారిని సక్రమములో పెట్ట గలిగితే, తప్పులు చెప్పి, లక్ష మంది జనాలను సక్రమముగా పెట్టినట్లే కదా. కేవలము ప్రయత్నమే, దేవుని మీద భారము వేసి.
ఒక వేళ జనము మారినా, నాయకులు మారినా, లాభము ప్రజలకే, మన దేశానికే కదా. ఇదీ ఒక ప్రజా సేవే, మానవ సేవే కదా? అదియే మాధవ సేవ కాదా, మిత్రమా? ఎవరూ మారలేదు అనుకోండి, మనము మరి ఆచరణలో పెట్టి, చెపుతున్నాము అన్న, ఆత్మ త్రుప్తి ఉంటుంది కదా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,353; 104 తత్వాలు (Tatvaalu) and views 256,978 Dt : 25-Nov-2020, Upd Dt : 25-Nov-2020, Category : General
Views : 1106
( + More Social Media views ), Id : 823 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
people ,
leaders ,
change ,
benefit ,
public ,
country ,
human service ,
madhava service Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments