శారీరక ఆనందం, అర్థం లేని సంపాదన, నొప్పి తెలియక కదలని దేహము, ఇదే మనకు ముఖ్యం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,425,853; 104 తత్వాలు (Tatvaalu) and views 261,702.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మన వాట్సాప్ లేదా సోషల్ మీడియా స్టేటస్ లో, మంచి మాటల నిరంతర మేల్కొలుపు, మనసు లో నాటుకోవాలి సుమా.

అనాధాశ్రమంలో అయినా, చెప్పిన ది చేయక పోతే, మన పని మనము చేసుకోపోతే, బాధ్యత రహితంగా నిర్లక్ష్యంగా అహంకారంతో ఎవరి గురించి మనకు పట్టనట్లు ఉంటే, తిడతారు తడతారు. మనం అనుకునే విధంగా జరగవు, మన ఆటలు సాగవు.

వారికి ధనం కట్టినా లేదా ఉచితం గా ఉన్నా, మూడో వారి చేతిలో పడ్డాక, వయస్సు ఉడిగాక, కాళ్ళు చేతులు కదలనప్పుడు, అవమానాలు తప్పవు, మన ఇన్నాళ్ల బద్దకం నిర్లక్ష్యం అహంకారం చాతగాని తనంకు. అదేదో స్నేహితుల మాటలతో మారి జాగ్రత్త పడితే మంచిది కదా?

బయట వారి చేతిలో మాట పడి, తన్నులు తిని కూడా, అక్కడ మనల్ని పెట్టిన, మన చెడ్డ పెంపకంలో పెరిగిన, కూతురు మరియు కొడుకు కి చెప్పలేము. చెప్పినా వారు వినరూ, ఇంకోచోట పెట్టే సమయం ఓపిక వారికి ఉండవు. వారికి ఆ ఇంగితం ఉంటే, ఇంట్లో నే పెట్టుకునే వారు. ఒక వేళ ఆ యజమానికి చెప్పినా, తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోనే పెట్టుకోగలరు అంటారు.

అంటే ఇన్నాళ్లు కష్టపడి మోసాలు కుట్ర లతో, పెంచి పోషించిన పిల్లలు, అలాగే మన సంపాదన హోదా పేరు, దేనికి కొరకాకుండా పోయింది. కాలు కదలనప్పుడు కోట్లు తో ఏమీ చేయలేము, మన పాపపు కోట్లు ను, పిల్లలు లాగకా ఊడ్చకా మానరు, వారు ముఖ్యము అనుకున్న పలు మోహ కారణాలతో.

మరి ముందే మేల్కొని, సంస్కారం తో పిల్లల ను పెంచి, మంచి బుద్దులు అలవాటు చేయాలంటే, మనకూ ముందు అహంకారం, నిర్లక్ష్యం, నిర్దయ, బాధ్యత రాహిత్యం ఉండకూడదు కదా?

మరి వయస్సు లో ఉన్నప్పుడు, అధికారం లో తేలుతున్నప్పుడు, ఐశ్వర్యంలో మునిగినప్పుడు, విచక్షణ మానసిక బుద్ధి, పని చేస్తుందా? నేలమీద నడుస్తామా? మంచి మాట విననిస్తుందా? ఆచరణలో పెట్టనిస్తుందా?

లేదు, అదే ప్రాపంచిక మాయాజాలం. మన తాతల నుంచి, అది వస్తూనే ఉంది. కొత్త కాదు, మనం మారము.

అందుకే సంస్కారం తెలియని పిల్లల ది తప్పు కాదు, సంస్కారం లేకుండా పెరిగిన మరియు పెంచుతున్న మనది తప్పు. అది ఒప్పుకోము.

మనకు మన శారీరక ఆనందం, చేతి నిండా అర్థం లేని సంపాదన, నొప్పి తెలియకుండా కదలకుండా ఉండే దేహము, ఇదే ఇప్పుడు మనకు ముఖ్యం.

చివరకు జరిగేది తెలిసినా, మనం మారము, మన రాత మార్చుకోము. భగవంతుని ఆచరణలో శరణాగతి పొందము, కానీ నటన మాటలలో అందరం ఎన్నో చెపుతాము. హతవిధీ.

అందరూ జ్ఞాన వంతులే, మరి చివరలో ఇంట్లో మరియు బయట వారితో, ఈ తిట్లు మరియు తన్నులు ఏల? అనాధగా ఒంటరిగా అనాధాశ్రమంలో ఖర్మ ఏల?

40 తర్వాత కొందరికి మనసుకు ఎక్కుతాయి, ఇంకొంతమంది కి 70 వచ్చిన కూడా అర్థం కాదు. ఇంకో పది జన్మలు తర్వాత విసిగి వేసారి, ఏమిటి ఈ ఖర్మ జీవితం మనకు అని ఆలోచన చేస్తారు. కానీ ఇది కలియుగం, వంద జన్మలు కావాలేమో?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,425,853; 104 తత్వాలు (Tatvaalu) and views 261,702
Dt : 18-Feb-2021, Upd Dt : 18-Feb-2021, Category : General
Views : 1187 ( + More Social Media views ), Id : 979 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : physical pleasure , meaningless earnings , no body move , no hardwork , pain
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content