రాజకీయ వ్యామోహం-వర్గ రాజీనామా, స్కీంకు తండ్రి బిడ్డ పేరు, కడప గడప, 50, బెట్టింగ్, జాతీయ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,221; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

రంగన్నా, రాజకీయాలు లో విలువ లు పోతున్నాయి. చిన్న చిన్న తప్పులు, కూడా తర్వాత శాపాలు గా మారతాయి.

జనం గుండెల్లో నిలవాల్సిన నాయకులు, పధకాల పేర్లు, ఇప్పుడు విచిత్రంగా రెండు పేర్లు, రూపంలో నిలచిపోతున్నారు, బయట ఫోటోలు లో మరియు సోషల్ మీడియా గోడల మీద, సరిహద్దు రాళ్ళ మీద నిలచిపోతున్నారు, వర్గం ను బట్టి ఒత్తిడులు, గడప అర్ధం మారింది, 50 తగ్గింపు అని నిట్టూర్పు విడిచాడు వీరన్న, రచ్చబండ దగ్గర చుట్ట తాగుతూ.

రంగన్న నవ్వుతూ, ఎప్పుడూ వేదాంతం లో మాట్లాడుతూ ఉంటావు, సరిగ్గా తెలుగు లో చెప్పు, ఏ పార్టీ, ఏమా కధ? ఏమా మార్పులు? అన్నాడు, తనూ ఆసక్తి గా.

అన్ని పార్టీలు అలాగే తగలడ్డాయి బావా. చంద్రన్న అయినా, జగనన్న అయినా అంతే. కొత్త సీసా లో, పాత సారా. ఆ పార్టీ నాయకులే అలాంటి సలహా దారులే, ఈ పార్టీ లో పెత్తనం సాగిస్తున్నారు. మరలా వైజాగ్ లో గంట మోగటానికి, ఆత్రంగా ఉంది అంట.

అదిగో మరలా వేదాంతం వద్దు, ఉదాహరణలు చెప్పు.

* చీరాల ఎమ్మెల్సీ ని రాజీనామా చేయమని ఒత్తిడి చేసి, మన ఎమ్మెల్యే ను ఎంపీలను మాత్రం వదిలేశారు అంట. జనం, తమ వర్గం అని ఎమ్మెల్యే మీద ఒత్తిడి పెట్టలేదు అని అనుకోరా?

మన సుజనా, రమేష్, కరణం, వంశీ ఇంతమంది పక్క పార్టీలలో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఒక ఎమ్మెల్సీ, అదీ ఇంకో సామాజిక వర్గం కు చెందిన, ఆడ కూతురు దగ్గర, పట్టుబట్టి, రాజీనామా అవసరమా, మనకు ఎప్పటికైనా మచ్చ గాదా.

మన వర్గం వారిని, వదిలేసినట్టు పోనీలే అని వదిలేయవచ్చు గదా, మనకు నష్టం ఏముంది ఇప్పుడు. మనిషి కో నీతి, వర్గానికో నీతి, మహిళ కో నీతి నా? అవసరానికో నీతి నా? అని జనం ముక్కు న, వేలేసుకున్నారు.

ఏం చేద్దాం బావా, అధికారంలో లేకపోతే నే ఇలా ఉంటే, అధికారం లోకి వస్తే, ఈ వివక్ష ఎక్కువ ఉండదా? వారు ఇప్పటికీ మారరా? కనీసం, భావాలు లోన దాచుకుని, బయటకన్నా నటించరా? అన్ని వర్గాలు ఒకటే అని, సమాన గౌరవం ఒత్తిడి అని? వారి గీతం, రమేష్ ఆసుపత్రి అయితే నే, గట్టిగా స్పందిస్తున్నారు అని వైసీపీ గేళి చేస్తున్న కూడా, అర్థం చేసుకోరు. గీతం అక్రమాలు అన్ని బయటకు తీస్తున్నారు.

మరి పధకాలు గురించి ఏదో అన్నావు, ఏమిటి అది బావా.

* సలహాదారుల మాయలో పడి, జనం సొమ్ము తో, చంద్రన్న పధకాలు పేర్లు పిచ్చి, ఓట్లు రాల్చలేదని తెలిసీ, జగనన్న సలహా దారులు, కూడా మెప్పు కోసం మన అన్నను తప్పు దోవ పట్టిస్తూ, ఇంకో రెండాకులు ఎక్కువే చదివారు.

సరిహద్దు రాళ్ళు మీద జగనన్న ఫోటోలు వేసి, ఎవరో పెద్దాయన తిట్టారు అని, ప్రస్తుతం కి ఆపేశారు. కానీ పధకాల పేర్లు లో, ఒక పేరే తప్పు అంటుంటే, ఇప్పుడు మరీ రెండు పేర్లు ఇరికించారని, జనం నవ్వుతూ ఉన్నారు. వాళ్ళు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారులే. ఈ పధకం పేరు చూడు బావా,

జగనన్న వైయస్ఆర్ బడుగు వికాసం - కనీసం అంబేద్కర్ బడుగు వికాసం అని పెట్టవచ్చు. అది పెట్టకపోగా, జగనన్న, వైఎస్సార్ అని రెండు పేర్లు కలిపి ఒకే పధకం పేరు పెట్టారు. తర్వాత, తాత పేరు కూడా కలిపి, మూడు పేర్లు పెడతారా ఇక ప్రతి పధకానికి?

మోదీ లాగా, ఆత్మాభిమానం తో, తమ పేర్లు జనం సొమ్ము తో పెట్టుకోకుండా, ఉండలేరా? వీరిద్దరి ప్రభుత్వాలకి, మోదీ ఆదర్శము కనపడదా? తమ పేర్లు తీసేసి, ఉత్తమ నాయకులుగా, పేరు నిలుపుకోరా?

ప్రతిపక్షాలు కూడా చోద్యం చూస్తూ ఉన్నాయి. ఎవరి పిచ్చి లో వారు, ఉన్నారు. మరలా తెదేపా ప్రభుత్వం వస్తే, లోకేష్ చంద్రన్న ఎన్టీఆర్ - బడుగు వికాసం అంటారేమో 3 పేర్లతో? ఈ పేర్లు పిచ్చి, ఎక్కడ దాకా వెళుతుందో దేవా?

* జగనన్న 8 కోట్లు జాతీయ మీడియాకు తగలేస్తున్నారని పచ్చ్ పత్రికలు ఏడుపు, మరి అలాగే చంద్రన్న కూడా కొట్లు అప్పుడు తగలేసారు కదా, పచ్చ మరియు జాతీయ పత్రికలకు? ఈ ప్రచార పిచ్చి తగ్గదు.

* కడప అంటే, గతంలో దేవుని గడప అని నానుడి. ఇప్పుడు వైఎస్సార్ కడప అయ్యింది. అంటే దేవుని గడప అంటే గొప్ప నా లేక ఇంకొకరి గడప అంటే గొప్ప నా?

పిచ్చి పదహారు రకాలు. అందుకే మోదీ గారు, మన జనం కు బుద్ధి రావాలని, మీ రాష్ట్రం మీ ఇష్టం, మీ జనం మీ అభీష్టం, మీ చేతులతో మీ భక్షణం అనేశారు.

* పోనీ లే బావ ఎన్ని పేర్లు అయినా పెట్టుకోనీ, ముందు బాగా ధర పెంచి ఇప్పుడు 250 నుంచి 300 రూపాయల మధ్యన అమ్ముడయ్యే, మనకు మేలు గా, మద్యం ధరల్లో 50 రూపాయలు తగ్గించారు, ఆనందముగా పద మరి.

* అంతే కాదు బావా, రాష్ట్రంలో మొత్తం 132 వెబ్సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని, నిషేధించాలని కోరుతూ, జగనన్న కేంద్ర మంత్రిని కోరారు కదా, ముందు వాళ్ళు అలా చేయలేదు కదా. ఇది మాత్రం మంచి పని బావా, మన పిల్లలు అందరికి.

కానీ వీపీయెన్ తో ఆడుతారేమే ఇంక. ఇక్కడ మందు ఎక్కువ లేదా మంచిది దొరకడము లేదని, పక్క రాష్ట్రము నుంచి తెస్తున్నారు.

ఒక్క పార్టీ కూడా, అనుచరులారా కరోనా సమయములో అన్నా, తాగకుండా నిగ్రహముగా ఉండండి, అని చెప్పడము లేదు కదా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,221; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825
Dt : 29-Oct-2020, Upd Dt : 29-Oct-2020, Category : Politics
Views : 815 ( + More Social Media views ), Id : 780 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : political , maya , vyamoham , resign , vargam , dad son grand , scheme names , kadapa gadapa , 50 , online betting , ysr , jagan , mlc , chandrababu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content