ప్రేమనగర్ - తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, మనసు గతి ఇంతే మనిషి - అక్కినేని, వాణీశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,448; 104 తత్వాలు (Tatvaalu) and views 243,406.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మీరూ పాడండి ప్రయత్నం చేయండి, శ్వాసక్రియ వ్యాయామము చెయ్యండి, మనశ్శాంతికి. మా గార్దభ బండ గొంతుకన్నా, మీ మరియు పిల్లల గొంతులు ఇంకా బాగా పాడవచ్చు సుమా. తినగ తినగ వేము తీయగ నుండు, సాధనమున సమకూరు.

ఇప్పుడుకు 14 వందల కధనాలు అయినాయి, అన్ని రకాల విషయాలమీద - రాజకీయం నుంచి రామాయణం వరకు, అనకాపల్లి నుంచి అమెరికా వరకు, పంచాయితీ సెక్రెటరి నుంచి సీయెం వరకు. విలేఖరులు నిర్భయముగా రాస్తారు, కానీ పద్యాలు పాటలు వాటికి వివరణలు ఇస్తూ పాడరు. ఇదంతా గురువులైన మీ అండవలనే, మీ దీవెన వలనే, 3 ఏళ్ళు పై గా, సర్వం క్రుష్ణార్పణము. మంచి చెడు, పొగడ్తలు తెగడ్తలు అన్నీ ఆయనకే.

పూర్తిగా సాత్వికముగా మారి మాకు ప్రజలకు మీ కుటుంబానికి, న్యాయము చేయమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, కానీ కొంతైనా అన్యాయము పాపము తగ్గించుకోమని ప్రాధేయపడతాము, ఎందుకంటే మీకు మాకు పంచభూతాల ఎక్కువ శిక్ష పడకూడదని మాత్రమే.

ఆనాడు ప్రేమికులకు అక్కినేని ఆరాధ్యదైవం, ఇలాంటి పాత్రలు ఎంటీయార్ వల్ల కాదు, ఎవర్ గ్రీన్ ఏయెన్నార్ మాత్రమే. అందుకే తెలుగు చిత్రపరిశ్రమ లో, NTR మరియు ANR, 2 కళ్ళు. జనం ఎక్కువ గా కనెక్ట్ అయ్యేది ప్రేమ పాత్రలకే. దేవదాసు, దసరాబుల్లోడు, ప్రేమాభిషేకం, లాంటి ఎన్నో సినిమాలు జనాన్ని ఉర్రూతలూగించాయి.

ఆనాటి పాటలలో, ఎటువంటి తప్పులు చెడు భావన బూతు లేకుండా, ప్రేయసిని మహిళలను ఎంతో గౌరవము గా రచయితలు రాశారు. ఎటువంటి తలనొప్పి వాయిద్యాలు లేకుండా, గొంతు ప్రధానముగా, గీతాలు పాడారు ఘంటసాల మాష్టారు గారు. ఈ సినిమాలో పెద్దవయసు గొంతు ఇబ్బంది కూడా మీరు గమనించవచ్చు వీడియోలో, ఆయాసము తో గాలి పీల్చడం, ఘంటసాల గారి గొంతులో. ఆనాటి ఉత్తములు ప్రజలు ఇవన్నీ ఆదరించారు.

ఇప్పుడు, మొదటి నెలలోనే వ్రుధా ఖర్చు పెట్టి సినిమా చూడకపోతే, గిల గిలా కొట్టుకుంటున్నారు మానసిక బలహీన మోహములో. ఇక సినిమా చూసి బయటకు వచ్చాక మైకుల ముందు సినమా లో వీరి త్యాగాలు నేర్చుకున్న చదువు గురించి అరుపులు, దేవుడా, వారు బీపీ తో పోతారేమో అనిపిస్తుంది.

చక్కటి చిక్కటి సాహిత్య సంస్కార పాటల్లో, ఊ అంటావా మావా ఊహూ అంటావా అని ఉంటేనే, అందరూ తమ పిల్లలతో కలసి, సంతోషము గా చూస్తూ, తమ ఆడపిల్లల చేత కూడా, ఢీ డాన్స్ లలో కాలేజ్ మరియు విదేశీ తెలుగు సంఘాల కార్యక్రమము లో పోటీలు పడుతున్నారు. రాత్రి క్లబ్ లకు కూడా కార్లు ఇచ్చి పంపుతున్నారు, ఉగాది పచ్చడి ఆయుర్వేదం మందులు కషాయం తెచ్చుకోండి అని. వారి అమ్మా నాన్న ఎంత ధన్యులో, పుణ్యం ను తమ ఇంట్లో కూడా, పాలు పోసి పెంచుతున్నారు.

ప్రేమ అంటే, ముందు తల్లి దండ్రుల దగ్గర నుంచి రావాలి. వారి మెప్పుతో ఇంకో మనసు గెలవాలి. కానీ ఇప్పుడు, ఇల్లు వీడి దూరముగా పోయి, తల్లి దండ్రులను వదిలేసి, మాకు వయస్సు అనుభవం ఉంది, ప్రేమ అంటే మాకు తెలుసు అంటున్నారు, వయస్సు వేడిలో వ్యామోహములో.

ఎందుకంటే ప్రేమ విలువ తెలిస్తే, 25 ఏళ్ళు పెంచిన వారి ప్రేమను వదలి పోరు. ఆ తర్వాత, సంవత్సరం కాకుండానే, మేము ఆవేశ పడ్డాము తొందరపడ్డాము ఇలా అని అనుకోలేదు ఇంత చండాలం అని తెలీదు మా ఎదురు నటించారు అని ఎడుపులూ, పెడబొబ్బలు, లాయర్లు కోర్టులు, ఒంటరి బతుకులు.

పెద్దలు కూడా చెప్పి చెప్పి చేసేది లేక, కాలం తో మారుతూ, మొక్కై వంగనిదే మానై వంగదని తెలిసి, మీ చావు మీరు చావండి అని, ఆస్తులు అధికారం ఇచ్చి మరీ, పిల్లల పతనానికి సిమెంట్ రోడ్ల బాటలు వేస్తున్నారు తలనొప్పి వదిలించుకోవడానికి, మెట్టినింటి వాళ్ళ కు కన్నీళ్ళు తెప్పించడానికి, ఆ తర్వాత వ్రుద్దాశ్రమానికి ఆనందము గా చేరుతున్నారు.

ఇప్పుడు మహిళలు లో కొంతమంది కూడా, కళ్ళు మూసుకో ముచ్చట చెబుతా అని, పెళ్ళి కాకముందే, పురుషుల గొంతు కోసే కాడికి ఎదిగారు. ఇక పెళ్ళి అయిన తర్వాత చెప్పక్కరలేదు, అంతా అస్సామే. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. అందరికీ బుద్ది రావాలి, గత తప్పులు ఇప్పుడు తెలిసి రావాలి.

ఏదైనా ప్రేమ అభిమానముతో పొందాలి కానీ, కోపం పగ తో కాదని, నిజమైన ప్రేమికులు తెలుసు. అంటే, నిజమైన ప్రేమికులు ఇప్పుడు లేరు. ప్రేమతో బాధ్యత నీతి నిజాయితీ ముందుచూపు త్యాగం కూడా ఉంటుంది సుమా. కోరికతో కామము తో ఇవేమి ఉండవు, అందుకే ఏ మత్తు అయినా గుడ్డిది అనేది.

ప్రేమ విఫలము అయితే, అదీ మన మంచికే అనుకుని, ఉద్యోగం మరియు తల్లి దండ్రులకు మరియు సహాయం చేసిన వారికి, క్రుతజ్ఞతలు ఎలా తీర్చుకోవాలో ఆలోచన చెయ్యక, కనీసం దేవుని గీతాలైనా పాడక, తాగి వీధుల్లో దొర్లుతూ, లేదా ఇతరుల జీవితాలు పాడు చేస్తూ, తాము నష్టపోతూ, ఇతరులను కూడా నష్టపరుస్తున్నారు, జీవితాలు వ్రుధా చేసుకుంటూ.

60 ఏళ్ళు వచ్చిన వారికే ఇంకా ప్రేమంటే తెలీదు, తమ తల్లి దండ్రులను అనాధాశ్రమములో లేదా ఒంటరిగా ఇంట్లో వదులుతున్నారు.

ధైర్యం గా కనీసం రాక్షస ప్రవ్రుత్తి తో, మోహం వ్యామోహం కోరిక కామం ఆస్తి ఐశ్వర్యం ఉద్యోగం వీసా అని చెప్పి, నాశనం అయితే పర్లేదు నిజాయితీ గా, ప్రేమ అన్న ముసుగు తమ తప్పుడు పనులకు వాడుతున్నారు, దాని విలువ దిగజార్చారు.

ప్రేమ అభిమానం అంటే ఎవరి మీదైనా ఒకే విధముగా ఉంటుంది. రిక్షా వాని నుంచి రాజకీయ నాయకుడి దాకా, ఒకటే మాట ఒకటే అభిమానం ఒకటే ఆగ్రహం తప్పు చేస్తే.

పల్లవి:

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా..
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా.. మొత్తము 2 సార్లు

చరణం 1:

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని, ముద్దబంతి పువ్వులా 2

గోదారి కెరటాల గీతాల వలే నాలో, పలికినది..... పలికినది.... పలికినది
చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా
కడలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...

చరణం 2:

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి, ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి 2

లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు, వెలసినవి..... వెలసినవి... వెలసినవి...
వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా, ఎదుట నిలిచింది కనుల ముందరా

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...

2)
తాగితే మరిచిపోగలను తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను మరువనివ్వదు

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ... సుఖము లేదంతే.... 2

ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు 2
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ...
మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే

అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు 2
తెలిసీ వలచి విలపించుటలో.... తియ్యదనం ఎవరికి తెలుసూ...
మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే.., మనసు గతి ఇంతే

మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమౌతాయో 2
మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా...
మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ... సుఖము లేదంతే... మనసు గతి ఇంతే

చిత్రం : ప్రేమనగర్ (1971), సంగీతం : కె.వి. మహదేవన్, గీతరచయిత : ఆచార్య ఆత్రేయ, నేపధ్య గానం : ఘంటసాల, అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ

Prema Nagar (ప్రేమనగర్)
1971 ‧ Drama/Romance ‧ 2h 50m
Theta Theta Thelugula Thellavari Velugula

prema nagar manasu gati inte manishi bratuk inte

Prema Nagar - Teta Teta Telugula Tellavari Velugula - MANASU GATI INTE MANISHI BRATUKINTE ANR, VANISRI  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,448; 104 తత్వాలు (Tatvaalu) and views 243,406
Dt : 13-May-2022, Upd Dt : 13-May-2022, Category : Songs
Views : 809 ( + More Social Media views ), Id : 1387 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prema , nagar , teta , telugula , velugula , manasu , manishi , bratukinte , anr , vanisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content