Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. మన చుట్టుపక్కల, మన ఇంట్లో కూడా, ఈ ఉత్తమ కారణ జన్ములు, రోజూ కనపడతారు సుమా, జాగ్రత్తలు. అందుకే పెద్దలు అంటారు, నాటి పురాణ రాక్షసులు నయం, నేటి కలియుగ రాక్షసులు కన్నా అని.
కొన్ని జీవితాలు అంతే, కృతజ్ఞతలు విశ్వసనీయత సంస్కారం మర్యాద ఉండవు, తల్లి దండ్రులు లేదా ప్రజలు లేదా ప్రభుత్వం పై పడి బతుకుతూ కూడా, వారినే తూలనాడుతూ వారినే ఇబ్బందులు పెడుతూ, మనశ్శాంతి లేకుండా చేస్తారు, చివరకు అదే మనశ్శాంతి కోల్పోయి, అధోగతి పాలు అవుతారు.
పిల్లల ను మరియు తర్వాత వంశాలను అలాగే తయారు చేసి, సమాజంలో అశాంతి రేకెత్తించి, చివరకు తమ సొంత పిల్లల చేతిలో నే అనాధలుగా, నానా కష్టాలు పడి పోయే విధంగా, తమ బతుకులు ను తిరగరాసుకుంటారు.
ఇవి చేయనిదే వారికి అన్నం సహించదు, కంటి కునుకు రాదు, మనసు తృప్తిగా ఉండదు. ఇవి ధనం ఉండి, మదం అహంకారం అధికారం తో ఉండే వారికి, మాత్రమే వర్తించవచ్చు, పేదవారి గురించి కాదు మిత్రమా.
* నిజం మరియు సంస్కారం అంటే వీరికి భయం, నిజం మాట్లాడటానికి భయపడతారు, దైవ శాపంతో. తడిగుడ్డతో నమ్మించి ఇతరుల గొంతు కోస్తారు. తాము మాయా భ్రమల జీవితం లో బతుకు తూ, ఇతరుల బతుకులు చిదిమేస్తారు, కేవలం తమ జీవితం సుఖం ఆనందం కోసం.
* ధర్మ వడ్డీ లు ఇస్తామని, ప్రజల దగ్గర ధనం పోగేసి, వ్యాపారాలతో కోటీశ్వరులై, చివరకు అసలు ఇచ్చిన వారి నెత్తిన, టోపీ వేయ చూస్తారు. వీరికి తప్పకుండా, రాజకీయ పార్టీల టిక్కెట్ మరియు ప్రజల భారీ ఓటు మెజారిటీ గారంటీ. బాంకు ల మరియు ఇతర సంస్ధల, అప్పుల ధనం తో బతుకు తూ, వారికి ఎగ్గొట్టే వారూ ఇదే బాపతు.
* తల్లి దండ్రుల ధనం తో పైకి ఎదిగి, కన్నతల్లి పాలు తాగి ఒళ్ళు పెంచిన విషయం మరచి, చివరకు వారినే, ముదుసలి వయస్సు లో, తమకు బరువు అని వదిలించుకుంటారు, రేపు తమ బతుకు అంతే అని తెలిసి.
* పుట్టింటి పసుపు కుంకుమ లేదా ఇంకో విధంగా ధనం, స్ధలం లాక్కొని లేదా తీసుకుని, లేదా మిత్రుల సహాయం పొంది కూడా, వారి ఇంటికే నిప్పు పెట్టి లేదా ఇతరులు పెట్టిన నిప్పు ను ఆర్పేందుకు ప్రయత్నం చేయక, ఆ చలిమంటలో, తమను కాల్చుకుంటూ శునకానందం పొందుతారు.
* సంవత్సరాలు గా, ఆఖరికి వారి ఇంట్లో ఉన్న చెట్లు కూడా, ఈ పాపిష్టి వారి ఇంట్లో, తన ఆకులు రాల్చలేనని బాధపడుతూ సిగ్గు తో ఇబ్బంది పడుతూ, పక్క ఇళ్లు మీద రాలుస్తుంది.
* సంవత్సరాలు గా, ఇంట్లో లేదా అద్దె వాళ్ళ చెత్త కూడా, ఆ పాపిష్టి నేలపై ఇమడలేక్, ఆ వింత మనుషులు తో ఉండలేక, సిగ్గు పడుతూ, పక్క స్ధలాలు పైకి ఎగబడుతుంది.
* వారు, వారి బంధువుల స్నేహితుల వాహనాలు కూడా, తాము పాపిష్టి ధనం తో కొన్న స్ధలం లేదా అపార్ట్ మెంట్ దగ్గర నిలవలేక, ఈ పాపిష్టి నేల పై విశ్రాంతికి ఆగలేము, అని కన్నీరు కారుస్తూ, పక్క స్ధలాలు వెతుకుతాయి.
* ప్రభుత్వ స్ధలాలు కబ్జా గా ఆక్రమించి, ఇళ్ళు మరియు షాపులు కట్టి, అద్దె పొందుతూ లేదా అద్దెకు తీసుకుని, చుట్టుపక్కల ఇళ్లు దగ్గర వాహనాలు పెట్టించి చెత్త వేస్తూ, ప్రభుత్వం కు పన్నులు కట్టకుండా, పరాయి పంచల బతుకు ను అందరికీ చూపిస్తూ, తమ వంశ శునకానందం ను, ప్రతి దినం పొందుతుంటారు.
* ఇతరుల కు మాయమాటలు చెప్పి, వారి జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటారు. ఎవరినీ లెక్క చేయరు. ప్రతి మాట మరియు నడత నటనే.
* తాము ఇతరుల సేవలను పొందుతూ, ఇతరులకు తాము ఉచితంగా సేవ చేస్తున్నామని, అబద్ధాలు చెపుతారు.
* కనీసం తాము గెలిచిన పార్టీ తో కూడా ఉండరు, నమ్మిన పార్టీ ని ప్రజలను వంచించి, వారు ఊసినా కూడా ఆనందం గా, ఆస్వాదించడం ఆనందించడం, వీరికి అలవాటు. రాజీనామా చేసి, దమ్మున్న ఆత్మాభిమానం ఉన్న, వంశ మనిషి లా వెళ్ళలేరు.
కానీ చివరలో అయినా, ఫలితాలు అనుభవించారు చాలామంది, అనుభవిస్తారు. కొందరు తప్పించుకున్నా, మరుజన్మ లో రోడ్డు వెంట ఖర్చీఫ్ తో, తమ స్ధానం పదిల పరుచుకుంటారు, అనాధలుగా. ఖర్మ విడువదు. పాపం శమించుగాక. ఇంకేమైనా ఉంటే, మీరూ చెప్పగలరు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,525; 104 తత్వాలు (Tatvaalu) and views 253,865 Dt : 14-Feb-2021, Upd Dt : 14-Feb-2021, Category : General
Views : 1003
( + More Social Media views ), Id : 974 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
purana rakshasa ,
better ,
todays ,
ungodly ,
sinful ,
ungrateful ,
people ,
kaliyuga ,
living on others Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments