రాగి , సజ్జ , జొన్న పిండి ని తెల్ల లేదా ఎర్ర దంపుడు బియ్యం తో కలిపి సంగటి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,188,279; 104 తత్వాలు (Tatvaalu) and views 243,112.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నాలుగున్నర సార్లు బియ్యం మిల్లు లో, సాన బట్టి బాధ పెట్టి, వీలయినన్ని పోషకాలు పోగొట్టి, దేనికి పనికిరాని పిప్పి లాంటి, కల్తీ తెల్ల సన్నబియ్యం ను ఎక్కువ రేటు తో కొని, తెల్లమొఖం తో చప్పరిస్తూ ఆనందడోలికలలో ఊగుతూ ఉన్నాము.

తిండి బలం వలన తిరుగుతున్నామో, లేక వయసు బలం వలన తిరుగుతున్నామో తెలియని, అమాయకపు అర్థం లేని బతుకు బతుకుతున్నాము. అక్కడ ఏమో(స్వదేశం) మంచి గాలి లేదు రాదు, ఇక్కడే మో(విదేశం) ఉన్నా కూడా మూసిన ఇంట్లో కి రాదు రానీయము. ఛీ ఏం బతుకో, ఎప్పుడు ఈ బలహీన ఊపిరి తిత్తులు, బందు బాట పడతాయో.

భవిష్యత్ పిల్లలు ను కూడా అదే భ్రమలో అదే మాయాజాలం లో పెంచుతున్నాము, ఒంట్లో నరాల సత్తువ మనసులో లో మానసిక సత్తువ లేకుండా. నలభై దాటితే కానీ, ఆ భ్రమలో నుంచి బయటకు రాము, అల్సర్లు, బీపీ లు, షుగర్ లు, బట్టనెత్తి, బానపొట్ట, కీళ్ల నొప్పులు వచ్చాక.

అందుకే, ఇప్పుడు రాగుల పిండి ని విడిగా జావచేసి , దంపుడు ఎర్ర బియ్యాన్ని ఇంకో వైపు ఉడకబెట్టి, చివరలో రెండిటినీ కలిపి రాగి సంగటి చేసి, అందులో పప్పు చారు ఆ తర్వాత మజ్జిగ కలిపి, నాలుగు ముద్దలు లాగిస్తే, నా సామిరంగా. ఎక్కడ దొరుకుతుంది అంతకన్నా మంచి బలమైన ఆహారము.

కడుపు లోని జీర్ణాశయంకు కమ్మని పెళ్ళి భోజనం లాగా అరగదీస్తుంది, రాత్రి నిద్ర కు కమ్మని వెన్నెల కూనిరాగం లాగా ఉండి, మత్తులో కళ్ళు మూసుకుని పోతుంటే, పిచ్చి జనాలు నిద్ర పట్టలేదు అని, నిద్ర మాత్రలు వేసుకుంటారు ఎందుకో.

రాగి , సజ్జ , జొన్న పిండి ని తెల్ల లేదా ఎర్ర దంపుడు బియ్యం తో కలిపి సంగటి చేసి తినండి వారానికి మూడు సార్లు అన్నా. నలభై లలో కూడా గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసే, మానసిక బలం ఉచితంగా పొందండి. ఉచితంగా మత్తులో నిద్ర పోండి, రాత్రి పూట బిళ్ల లు వాడకుండా. శారీరక మానసిక బలంతో, హయిగా ఉండండి.

కొంతమంది సుఖానికి అలవాటు పడి, ఏదీ చేయక అన్ని కష్టం అనుకొని, రేపు కోడలో కూతురో వృద్ధ ఆశ్రమం లో, తప్పనిసరి పరిస్తితిలో బలవంతంగా, అలవాటు చేస్తే ఈజీగా నేర్చుకుంటారు ఆనందంగా.

70 ఏళ్ల అమ్మకు, నలభై లో వారికి అరుగుతుంది అంటే మీకు అరగదు అంటే, మీ ఆరోగ్యం రక్షణకు, ఇంకా ఎక్కువ శ్రమ చేయాలి కదా. రాగి, జొన్న, సజ్జ లో ఫైబర్ ఉంటుంది, తేలికగా అరిగి, పొద్దున్నే చెంబు కు వెళతారు.

రాగి తిండి బలం తేడా స్పష్టంగా కనపడుతుంది. ఈ సంగటి తిన్న రోజు అమ్మ గాఢమైన నిద్ర, తెల్లారి నాలుగు గిన్నెల లేదా అరుపుల మోత ఎక్కువ గా ఉంటుంది.

తినగ తినగ వేము తీయగ నుండు , తినగ తినగ తీపి రోగాలు తెచ్చు అని అందరికీ తెలుసు. నిరంతర సాధన తప్పదు, ఆకు రసాలు , నడక , ధ్యానం, . .

కల్తీ బయట హోటల్ తిండి తినగలం, టీ కాఫీ పిజ్జా బర్గర్ కోక్ చీజ్ ఐస్క్రీం పెప్సీ మైదా మాంసం ఇంకా ఎన్నో తినగలం అరాయించుకోగలం.

రాగి/ జొన్న/ సజ్జ సంగటి తినలేము అనడం సిగ్గు సిగ్గు కదా, భరత భూమి లో పుట్టానని చెప్పడానికి. మన ఆరోగ్యం ను మనమే కాలరాస్తున్నాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,188,279; 104 తత్వాలు (Tatvaalu) and views 243,112
Dt : 16-Dec-2019, Upd Dt : 16-Dec-2019, Category : General
Views : 2222 ( + More Social Media views ), Id : 256 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : millet , ragi , sajja , jonna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content