Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Rama Rama Ma Baddakamemi ra (Atmajnana sadhana daiva guna karma)*
The elders said that the Vedas instruct us to mentally worship the formless, Nirakara Nirajana God, to control the five senses, and to attain purity only if we control the monkey-like mind. Then, without being immersed in worldly delusions, like a drop of water does not touch a lotus leave, one can simply remain as a witness in the world of illusion/ impermanent.
వేదాలు నిరాకారుడు నిరంజనుడు అయిన భగవంతుని మానసికముగా పూజింపమని, పంచ ఇంద్రియాలను నిగ్రహించమని, కోతి లాంటి మనసుని అదుపులో ఉంచితేనే అది చిత్తశుద్ది అవుతుంది అని పెద్దలు చెప్పారు. అప్పుడు మనిషి, ప్రాపంచిక బ్రమలు లో మునగకుండా, తామరాకు ను నీటి బిందువు తడపనట్లుగా, మిద్య/ అశాశ్వతం/ మాయ అయిన ప్రపంచంలో, కేవలం సాక్షీభూతునిగా ఉండగలడు.
But this is not understandable to the common man (rajo and tamo guna). He does not know what divine qualities are and how to practice spiritual practice with the satva guna. That is why, by writing biographies of the best of humans, elders explained their virtues, intelligence, and suppression of unrighteousness.
కానీ ఇది సామాన్యులకు(రజో మరియు తమో గుణ) అర్ధం కాదు. దైవ గుణాలు ఎలా ఉంటాయో, సత్వ గుణం తో ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో తెలీదు. అందుకే, మానవులలో ఉత్తములైన వారి జీవిత చరిత్రలు రాస్తూ వారి గుణ గణాలను, తెలివి తేటలను, అధర్మం ను అణిచివేసింది వివరించారు.
పల్లెటూరు వ్యక్తి కూడా, ఒహో రాముడు కి 16 గుణాలు ఉన్నాయి, అందులో కొన్ని ఒకే మాట ఒకే బాట ఒకే భాగస్వామి పెద్దల మాటలను గౌరవించి ఆచరించు లాంటివి, నేనూ ఆచరించవచ్చు అన్న స్పూర్తి రావాలి. అందుకే వారిని పూజిస్తూ వారి గుణాలను కీర్తిస్తూ, అందుకో కొన్ని అయినా మనము ఆచరిస్తూ, వారిని అనుసరించాలి.
But today's people, with the mere pretense of offering puja, bhajan, pilgrimage, and donation, are drowning in worldly pleasures, acting hypocritically and acting like a fool. As a result, there is no seva for elderly parents, no confidence that their own children will look after them, and no one knows when friends, relatives, or partners will turn their backs (backstabbing) on them.
కానీ నేటి జనం, కేవలం పూజ ప్రసాదం భజన యాత్ర దానం అంటూ, పై పై కపట నటన 2 నాల్కల ధోరణితో, ప్రాపంచిక బ్రమలలో మునిగిపోతున్నారు. దాని ఫలితమే, ముదుసలి తల్లి దండ్రుల సేవ లేదు, సొంత పిల్లలు చూస్తారు అన్న నమ్మకం లేదు, స్నేహితులు బంధులు భాగస్వామి ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో తెలీదు.
Such people should be enlightened and practice in their minds, and it doesn't cost a penny.
అలాంటి వారికి కనువిప్పు కలిగిస్తూ, సాధన మనసులో చెయాలి, దానికి రూపాయ ఖర్చు లేదు. సాధన ఫలితాలు, మన నిత్య జీవితములో దైనందిక పనులు మాటలు లో స్పష్టముగా సత్వ గుణం వారికి తెలిసిపోతుంది రజో తమో గుణాల కోరికల పరుగులు మిత్రమా.
We hope that by understanding this song and practicing the divine qualities, you will avoid future backstabbing, heart attacks, and the training of the five elements (panchabhut).
ఈ పాటను అర్ధం చేసుకుని, దైవ గుణాలను ఆచరిస్తూ, భవిష్యత్ వెన్నుపోటు గుండెపోటు రోగపోటు పంచభూత శిక్షణ ను తప్పించుకుంటారు అని ఆశిస్తున్నాము.
Song
రామా రామా - మా బద్దకమేమి రా.., క్రిష్ణా క్రిష్ణా - మనసు నియంత్రణ బలహీనమే
పైపైపూజా యాత్రా- ప్రసాద ధన దానం తో, భూమిపై కాలం - వయసు వ్రుధా అయిపోయే,
ఆత్మజ్ఞాన సాధన- నేటికీ సున్నాయే, పంచఇంద్రియ నిగ్రహ - మేనేటికీ లేదాయే, మనసు సాధన కుదరలేదే ||రామా రామా||
ఇన్నేళ్ళైనా మనసు- స్తిమితం లేదాయే, ఇంట్లో మదిలో -మనశ్శాంతి దొరకదాయే
అవసర అవకాశ -కపట నటనలతో, జంతు సంబంధ -సంసార సంతానాలతో,
కంచం మంచం -లంచం బానిసలమే, ఈ జన్మ కూడా -వ్రుధా అయిపోయే, గత జన్మ నరకం గుర్తు లేదాయే ||రామా రామా||
భాగస్వామి పిల్లలూ - స్నేహితులు బంధువులూ, వయసు రోగం - మరుపు ముదిరిందని,
సంపాదన సత్తువ - మురిగింది అణిగిందని, ఒంటరిగా విడిచారే - జీవిత అంతం శూన్యమే
దైవ గుణ కర్మలు చేయక - సజీవ గురు సేవ చేయక, మానవ సేవ లేక - వ్రుధా బతుకు రుజువే, మరు జన్మ ఎంత నరకమో ||రామా రామా||
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,618,643; 104 తత్వాలు (Tatvaalu) and views 408,422
Dt : 21-Nov-2025, Upd Dt : 21-Nov-2025, Category : Songs
Views : 367
( + More Social Media views ), Id : 2280
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Rama ,
Ma Baddakamemi ra ,
Atmajnana sadhana ,
daiva guna karma ,
Krishna ,
Manasu balaheename ,
weak mind
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments