రిక్షా ఇచ్చి మతం మార్చారు - ధన్యవాదాలా లేక నిందలా, మరి మన సహాయం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,140,856; 104 తత్వాలు (Tatvaalu) and views 240,219.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి ఆ లింక్ లో ఫోటో, ఒక కుటుంబం కు బతకడానికి, ఒక పదివేల లోపు తొక్కుడు రిక్షా ఇచ్చి, మతం మార్చారు అంట. వారి ఇరువురిని, బతుకు దోవ చూపించారు అని, ధన్యవాదాలు తెలుపుదామా లేక అది తప్పు అని నిందలు వేద్దామా? Religion.

మరి మన ధనవంతులైన హిందువుల లో, అలా, బయట వారికి ఉచితంగా ఏమీ ఆశించకుండా, 5 లేక 10 వేలు సహాయం చేసే, మంచి మనసు లు, ఉన్నాయా? ఎంత మందికి ఉన్నాయి? ఉంటే, ఇలా ఎందుకు వెళతారు? ఇతరులు, కనీసం 10 వ వంతు, తమ మత ప్రాబల్యానికి వాడుతున్నారు, సహాయం చేస్తున్నారు ఇతరులకు.

ఏమయ్యాయి ఆ మనసు లు కృతజ్ఞతలు మానవత్వం? అందరిని మత మార్పులు జరిగాక, ఇబ్బందులు పడేది మన తర్వాత తరాలు అని, ఎరుక బాధ్యత ఇంగితం మనకు ఉందా?

కోట్లు సంపాదించిన వారు, నాకు జనం తో, హైందవ ధర్మం తో సంబంధం లేదని, నిర్లిప్తంగా ఉంటున్నారు లేదా కంపెనీలు పెట్టి, ప్రజల బాంకుల ధనం కూడా, దోచుకుంటున్నారు. లేదా వడ్డీ కి ఇచ్చిన అయినవాళ్ళ సొమ్ము నే మింగుతున్నారు. ఆడంబరాల ఫంక్షన్లలో, లేదా ఊరేగింపు, లేదా ఇంకో సప్త వ్యసనాల లో, దుబారా ఖర్చు పెడుతున్నారు, కానీ, ఇంకో మనిషి బతుకు కు మాత్రం సాయం చేయరు.

ఇప్పుడు అయినా, స్వార్థం వీడి, పక్క వాడి క్షేమం చూద్దామా? అంటే సొంత హైందవ సోదరులు కు సహాయం చేసి, దోవ చూపించగలమా?

మనం ఏమీ ఇవ్వకుండానే, అవతల వారు ఎందుకు ఇచ్చారు అని లేదా ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే నిలదీస్తే ఉపయోగం ఉందా? ఆ కుటుంబం కు పని లేదా మార్గం దొరకకుండా ఉంటే, ఏమి చెయ్యాలి? తిండి లేకుండా, మాడి పోవాలా?

మనకు అలా కడుపు మాడితే కదా ఆ విలువ తెలిసేది? చెప్పులు లేదా సాక్స్ లేకుండా కూడా మనం నడవమే, మనకు ఆ కష్టం విలువ ఎలా తెలుస్తుంది మిత్రమా?

బాధ్యత లేని మనుషులు గా, బాధ్యత లేని నాయకులను ఎన్నుకుంటే, దేవాలయాల భూములు మింగేస్తున్నారు. మన జనమే వత్తాసు పలుకుతున్నారు, ఆ మాన్యాలు పనికిరావని, కబ్జాలకు గురి అవుతున్నాయి అని, ఆదాయం లేదని. దేవాలయాల ఆదాయం, బీద హైందవులకు అండగా లేదు ఏనాటి నుంచో.

ఎవరిది తప్పు అంటే, మరలా విత్తు ముందా చెట్టు ముందా, సామెత. హతవిధీ, కరోనాలు కూడా కర్కశులను మనల్ని మార్చలేవా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,140,856; 104 తత్వాలు (Tatvaalu) and views 240,219
Dt : 12-Dec-2020, Upd Dt : 12-Dec-2020, Category : General
Views : 859 ( + More Social Media views ), Id : 854 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rickshaw , hindu , religion , converted , thanks , blame , genuine , help
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content