Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* భక్తుల మధ్య ప్రేమ బంధం ఆప్యాయత అనుబంధం
* శివయ్య గరళం, విష్ణువు ఎన్నొ రూపాలు
* ముదుసలి తల్లి దండ్రులు ను చూడటం, నీతి నిజాయితీ
* కరోనా గుణపాఠం, దైవం ఆచారం కన్నా, ప్రాణాలు
* రెండు గ్రామాలు, పట్టణాలు, వర్గాలు మధ్యలో గొడవలు
* తిరుపతి బావాజీ, కొండల మధ్యలో
* కొన్ని కొలమానాలు, ఉత్తమ ప్రజా
* సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీలు, స్ధానిక పెద్దలు, అధికారులు
* అగ్ర కులం అధికారం ధనం కలవారు కన్నా
2 min read time. సాంప్రదాయం ఆచారం భక్తి అంటే, పవిత్రత సాత్వికత త్యాగం, అంతే గానీ రక్తం చిందటం, తన్నుకోవడం కేసులు పెట్టుకోవడం కాదు. భక్తుల మధ్య ప్రేమ బంధం ఆప్యాయత అనుబంధం పెరగాలి, పెంచాలి.
శివయ్య గరళం తాను తాగి, అందరినీ కాపాడారు. విష్ణువు తాను ఎన్నొ రూపాలు ధరించి, బాధలు పడి, జనాలను కాపాడారు. ఆఖరికి మన తిరుపతి శ్రీనివాసుడు కూడా, నానా కష్టాలు పడ్డరు, వైకుంఠము వదలి భువికి వచ్చి. భక్తులు కూడా, త్యాగము లో ముందు ఉండాలి.
రాజకీయ నాయకులు లేదా స్వార్థ పరులు, తమ లేదా తమ వారి అండ కోసం, ఆజ్యం పోసి ఎక్కువ సమస్య చేస్తారు, అది నేడు సహజం.
మూర్ఖ పాత సాంప్రదాయం చాలా వదిలేశాము, బాల్య వివాహం, సతీ సహగమనం.
మంచి సాంప్రదాయం కూడా వదిలేసాము , ముదుసలి తల్లి దండ్రులు ను చూడటం, నీతి నిజాయితీ గా ఉండటం కూడా. ఎవరూ బాధ పడటం లేదు, ముదుసలి తల్లి దండ్రులు కోసం, చావడం లేదు కదా?
కరోనా నేర్పిన గుణపాఠం, దైవం ఆచారం కన్నా, ప్రాణాలు ముఖ్యం అని. ప్రపంచం అంతా అన్ని మతాల దేవాలయాలు, ఆచారం పక్కన బెట్టి, నెలలుగా గుడులు మూసేసారు. ఆఖరికి తిరుపతి వెంకన్న కు మూత తప్పలేదు.
ఎవరం బాధ పడలేదు, ఆత్మహత్య లు చేసుకోలేదు మూర్ఖంగా. అలా చేసుకుని ఉంటే, వారికి మనసు దైవ భక్తి లేదు, వారు పూజలకు దైవానికి దూరం, ఎందుకంటే భక్తి , ఎటువంటి చావు ఆవేశం అరుపులు కోరదు. అలాంటి వారిని దేవాలయం కు, దూరంగా పెట్టాలి.
మేము 5 ఏళ్లుగా తిరుపతి వెంకన్న దగ్గరకు వెళ్ళకుండా, దగ్గర ఉన్న తెనాలి చిన వెంకన్న దగ్గరకు వెళుతున్నాం. పరాయి రాష్ట్రం, దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి, తొందరగా దర్శనం అందాలని. అంటే మాకు ఆచారం, సాంప్రదాయం, భక్తి, సాత్వికత లేదా? వెంకన్న, మమ్మల్ని ఆదరించరా, క్షమించరా?
రెండు గ్రామాలు, పట్టణాలు, వర్గాలు మధ్యలో గొడవలు వచ్చినప్పుడు సాత్విక మార్గం లో పరిష్కరించాలి.
అసలు రెండు గ్రామాలు వర్గాలు తన్నుకుంటే దేవుని దగ్గర, ఇద్దరు కూ మూర్ఖత్వం తప్ప , దైవ భక్తి లేనట్టే భావించాలి. సాత్విక ఆచారం పాటించనట్టే.
దేవుడు మన మనసులో మన గుండెల్లో ఉన్నారు అని ఎందుకు తెలుసుకోరు , పెద్దలు ఎందుకు తెలియచెప్పరు.
తిరుపతి బావాజీ, కొండల మధ్యలో నివసించి , దేవుని రప్పించుకున్నారు. కధ వినలేదా?
ఎవరు మంచి అని ఎలా కొలమానం? కొన్ని కొలమానాలు, ఉత్తమ ప్రజా గ్రామం కోసం , ఆ రెండు పోటీ గ్రామాల్లో, ఉత్తములకే అవకాశం ఇవ్వాలి. ఆ మీ ప్రాంతం బట్టి, ఇంకొన్ని మీరూ కలపవచ్చు.
1.ఏ గ్రామంలో, ఎంత తక్కువ సారా లిక్కర్ అమ్మకాలు జరిగాయి? తక్కువ యువకులు, జులాయి గా తిరగకుండా ఉన్నారు?
2. ఏ గ్రామంలో ఎక్కువ కుటుంబాలు, ముదుసలి తల్లి దండ్రలు ను, ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నాయి?
3. ఏ గ్రామంలో, ఎక్కువ మంది సమయానికి, పంచాయతీ పన్నులు కడుతున్నారు?
4. ఏ గ్రామంలో తక్కువ కేసులు, గొడవలు ఉన్నాయి?
5. ఎందుకు రెండో గ్రామంలో, ఇంకో కొత్త గుడి కట్టి, వారి వరకు వారిని పూజించుకుని , ఊరేగింపు చేసుకోకూడదు? దాతలు లేరా? ప్రభుత్వం కట్టవచ్చా?
ఇలాంటి సాత్విక ధార్మిక లక్షణాలు ఇరువైపులా సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీలు, స్ధానిక పెద్దలు, అధికారులు, సంవత్సరం ముందు నుంచే, అవగాహన పెంచాలి, సాత్వికత త్యాగాలలో మంచిలో పోటీ పెంచాలి.
పై 5 లో ఇద్దరూ సమానంగా వస్తే, అప్పుడు అగ్ర కులం అధికారం ధనం కలవారు కన్నా , ఇతరులకు బలహీనులకు ప్రాముఖ్యత ఇచ్చి, ప్రభుత్వం అండగా ఉండాలి.
ఇలాంటి మరలా జరగకుండా, ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరువర్గాలు ఒప్పుకోనప్పుడు , ఇంట్లో నే , ఎవరి గ్రామంలో వారు, ఊరేగింపు చేసుకోవడం లేదా పూర్తిగా ఆపివేయడం ఉత్తమం.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,083; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817 Dt : 14-Mar-2021, Upd Dt : 14-Mar-2021, Category : General
Views : 793
( + More Social Media views ), Id : 1031 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
ritual ,
devotion ,
sacrifice ,
holiness ,
blood ,
fighting ,
kicking others ,
shiva ,
vishnu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments