రుద్రవీణ - నమ్మకు నమ్మకు ఈ రేయిని, ఒంటరిగా దిగులు బరువు, నేను సైతం విశ్వవీణకు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1729 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1764 General Articles and views 1,281,089; 90 తత్వాలు (Tatvaalu) and views 175,742.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

రచయిత సిరివెన్నెల, దర్శకుడు బాలచందర్ మరియు గాయకుడు బాలు గార్లకు నివాళులు.

ఇళయరాజా గారి మధుర సంగీతంలో, చిరంజీవి నటిస్తూ జీవించిన, ఉత్తమ 3 జాతీయ అవార్డుల సినిమా, రుద్రవీణ లో పాటలు గుర్తు ఉన్నాయా (వీడియో చూడండి)?

నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని, నీ కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి, కలలే, వలగా, విసిరే చీకట్లను, నమ్మకు నమ్మకు. అరిషడ్వర్గాల బానిసలు, చీకటిని తమ తప్పులకు వాడుకుంటారు.

కానీ ఒక్కసారి వెలుగు వస్తే వారి జీవితములో, జ్ఞాన ప్రకాశముతో, అన్ని దురాలోచనలు తప్పులు మోసాలు దొంగ వ్యాపారాలు అన్ని, ఆగిపోతాయి. చిన్న పిల్లలు రాత్రి అయితే, పెద్దల ను పట్టుకుని నిద్ర పోతారు, కానీ తెల్లారగానే నవ్వుతూ అటు ఇటూ తిరుగుతారు.

కాని ఆ జ్ఞానం వచ్చేది ఎప్పుడు? అదే కోటి రూపాయల ప్రశ్న, జీవితం పూర్తి గా నాశనం అయ్యాకనా లేక కాళ్ళు చేతులు పడిపోయాకనా లేక ఇంకో 100 జన్మలకా లేక ఇప్పుడే అన్ని బాగున్నప్పుడా?

కాస్త సంపాదించగానే, ఓ పదవి రాగానే, కళ్ళు నెత్తి మీద ఉంటాయి. తోటి మనిషిని మనిషిగా చూడరు, శుభాకాంక్షలు ఆశీర్వాదాలు చెప్పరు, తమకు లాభం అవసరం లేకుండా. అందుకే చెపుతున్నారు, ఎంత పెద్ద భవనానికైనా, పునాది భూమిలో ఉంటుంది అని మరువద్దు. అంటే, గతం మరువద్దు.

పక్కవారు ఏడుస్తుంటే కష్టాలలో, మనము సుఖముగా ఉండలేము, ఏదో ఒక సాయం చెయ్యి, కనీసం మాట్లాడి, గుండె ధైర్యం ఇవ్వు. పదుగురి సౌఖ్యం పండే, దినమే పండుగ కాదా, నిజమైన భక్తునికి మానవత్వానికి? నరుని సేవయే నారాయణ సేవ సుమీ.

మనము కనీసం గంటలు గంటలు ఇతరుల బాధవిని, ఓదారుస్తున్నాము 20 ఏళ్ళు పైన. వారు నీతిగా ఉంటే, వారికి అండగానూ ఉన్నాము. వారు మరచిపోయినా, 20 ఏళ్ళ క్రితం మాటలు, కంప్యూటర్ మెమొరీలాగా, మన మనసులో ఉంటాయి, వారికి గుర్తు చేస్తాము. గత కాల స్మ్రుతుల బాంక్ మనము.

మన బాధవినే ఓదార్చే స్నేహితులు దొరకడం మన అద్రుష్టం, వారే మన గురువులు శిష్యులు. అటువంటి వారిని చిన్న చిన్న విషయాలతో దూరం చేసుకోకూడదు.

ఒంటరిగా దిగులు బరువు, మోయబోకు నేస్తం, మౌనం చూపిస్తుందా, సమస్యలకు మార్గం?
కష్టం వస్తేనే గద, గుండె బలం తెలిసేది. దు:ఖానికి తలవంచితే, తెలివి కింక విలువేది?
మంచైనా, చెడ్డైనా, పంచుకోను నేలేనా? ఆ మాత్రం ఆత్మీయతకైనా, పనికిరానా?
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని, అంతటి ఏకాంతమైన చింతలేమిటండి?

మనల్ని నమ్మిన మిత్రులకు, కనీసం మన దగ్గర అయినా మనసు విప్పి నిజాలు మాట్లాడే తమ తప్పులు ఒప్పుకునే మిత్రులు బంధువులకు, మనము అలాగే దేవుడు ఎప్పుడు నూ అండనే. మన కష్టాలను సుఖాలను ఎప్పటికప్పుడు, మనము నమ్మిన వారికి తప్పక చెప్పాలి. ఎందుకంటే, జరగబోయే నష్టాన్ని వారు అంచనా వేయగలరు, హెచ్చరించగలరు. చేతులు కాలాక చెపితే, ఉపయోగము లేదు, వారు సహాయము చేయలేరు.

నేను సైతం నేను సైతం...బ్రతుకు బాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా, వసంతం వరియించుదాకా..
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా

అంటూ మనందరము చేయి చేయి మనసు మనసు కలిసి నడిస్తే, నిజముగా కష్టాలు మనల్ని దరి చేరగలవా? ఒకరికి ధనము ఉంది, ఒకరికి గుణం ఉంది, ఇంకొకరికి శక్తి ఉంది, ఇంకొరికి మంది ఉంది, ఇంకొరికి అధికారం ఉంది. వీరు ఒకరికొకరు సహాయము చేసుకుంటూ, కలసి, అందరికీ మంచి చేస్తే?

ఎవరినీ పట్టించుకోను, నాది నా కుటుంబము వరకే నా పని అనుకునే వారు, దేవుని భక్తులు ఏ నాటికీ కారు. మోక్షము పొందలేరు. నరుని సేవ లేని నారాయణ సేవ సాధ్యం కాదు. వారు తమ బ్రమలు తొలిగాక అన్ని పోగొట్టుకున్నాక, దేవుడు భక్తులు వారిని ఆదుకోరు, ఎందుకంటే అది శిక్షా కాలము. కాబట్టి ఆ పరిస్తితి తెచ్చుకోవద్దు.

1) సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
ఎచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపే లేని సీకటే ఉండిపోని
మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక, సద్దుకుపోయే సీకటెనక ..

నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని 2
నీ కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి 2
కలలే.., వలగా.., విసిరే.. చీకట్లను

వెన్నెలలోని, మసకలలోనే, మసలును లోకం, అనుకోకు.
రవికిరణం, కనబడితే, తెలియును తేడాలన్ని ||నమ్మకు నమ్మకు||

ఆకాశం తాకే., ఏ మేడకైన.., ఆధారం లేదా.., ఈ నేలలో 2
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు, ఏనాటికి..
పక్కవారి గుండెల నిండా, చిక్కనైన వేదన నిండ 2
ఏ హాయి, రాదోయి, నీవైపు, మరువకు ||నమ్మకు నమ్మకు||

శీతాకాలంలో, ఏ కోయిలైన., రాగం తీసేనా ఏకాకిలా 2
మురిసే పువులులేక, విరిసే నవ్వులులేక, ఎవరికి చెందని గానం సాగించునా..
పదుగురి సౌఖ్యం పండే, దినమే పండుగ కాదా 2
ఆనాడు, రాకంత, గీతాలూ పలుకును కద

గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినిని
సగసని సని దనిదమదమ దనిదమపగ ||నమ్మకు నమ్మకు||

2) ఒంటరిగా దిగులు బరువు, మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా, సమస్యలకు మార్గం

కష్టం వస్తేనే గద, గుండె బలం తెలిసేది
దు:ఖానికి తలవంచితే, తెలివి కింక విలువేది
మంచైనా, చెడ్డైనా, పంచుకోను నేలేన
ఆ మాత్రం ఆత్మీయతకైనా, పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని

అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 2
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 2
గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ . .
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 3

కోకిలల కుటుంబంలో, చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే, అయినా నేనేకాకిని - మొత్తం 2 సార్లు
చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది 2

పాట బాట మారాలని, చెప్పటమేనా నేరం
గూడు విడిచి పొమ్మన్నది, నన్ను కన్న మమకారం
వసంతాల అందం, విరబుసే ఆనందం
తేటి తేనె పాట, పంచెవన్నెల విరితోట - మొత్తం 2 సార్లు

బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా.., ఏ ముళ్ళబా.ట 2

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 2
-----------------
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం

ఏదీ మరి, మిగతా కాలాలకు, తాళం
నిట్టూర్పుల, వడగాలుల శృతిలో, ఒకడు
కంటి నీటి, కుంభవృష్టి జడిలో, ఇంకొకడు
మంచు వంచెనకు మోడై, గోడు పెట్టు, వాడొకడు
వీరి గొంతులోని కేక, వెనుక ఉన్నదే రాగం..
అనుక్షణం వెంటాడే, ఆవేదన ఏ. నాదం..
అని అడిగిన నా ప్రశ్నకు, అలిగి మత్త కోకిల
కళ్ళు ఉన్న కబోదిలా, చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా, బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ.., కరువాయెను నా స్థానం

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 2

--------------
అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం - స్పీడ్
నాడుల నడకల తడబడి సాగే, అర్తుల ఆరని శోకం
ఎడారి బతుకుల నిత్యం, చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని, దీనుల యదార్థ జీవన స్వరాలు

నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ, నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను
----------------------------
నేను సైతం విశ్వవీణకు, తంతినై మూర్ఛనలుపోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాధ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం... బ్రతుకు బాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం...బ్రతుకు బాటకు గొంతు కలిపేను

సకల జగతిని శాశ్వతంగా, వసంతం వరియించుదాకా..
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను 2

నేను సైతం.. నేను సైతం.. నేను సైతం 2  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1764 General Articles and views 1,281,089; 90 తత్వాలు (Tatvaalu) and views 175,742
Dt : 26-Jul-2022, Upd Dt : 26-Jul-2022, Category : Songs
Views : 401 ( + More Social Media views ), Id : 1475 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rudraveena , chiru , nammaku , reyini , ontariga , digulu , baruvu , nenu , saitam , visvavinaku , srisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content