గ్రామ పంచాయితీల అభివ్రుద్ది కి జవాబు దారీకి నిబంధనలు - జగనన్న - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1001 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం, మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజల పెన్నిధి, జగనన్న నాయకత్వం లోని, ఏపీ ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలను విడుదల చేసింది, అని సమాచారం సోషల్ మీడియా లో తిరుగుతూ ఉన్నాయి ఈ పాయింట్లు. ఇందులో తప్పులు అవాస్తవం ఉంటే చెప్పగలరు, స్ధానిక అధికారులు ను, కొత్త నిబంధనలు చూపించమని అడగవచ్చును.

ఇవన్నీ నిజంగా అమలు అయితే, పల్లె ప్రజలు శభాష్ జగనన్న అని, అలాగే పంచాయతీ అధికారులు ను, కలెక్టర్ ను, శభాష్ అని మెచ్చుకోవడం ఖాయం.

ఇంకా అమ్మమ్మ కాలం నాటి పాత మూస పద్దతిలో కాకుండా, ఆధునిక టెక్నాలజీ జగనన్న ప్రభుత్వం లో, రాజధానిలో బట్టన్ నొక్కి అమ్మ ఓడి ధనం ఇచ్చే ఈ రోజుల్లో, పల్లె కు కూడా ఇంటర్నెట్ మరియు ఇంటికి వాలంటీర్ వచ్చే ఈ కాలంలో, పంచాయతీ అలాగే మున్సిపాలిటీ పనులు, మార్పులు మరియు మీటింగ్ ఫోటోలు, వారి ఆఫీసు నోటీసు బోర్డు లో మాత్రమే కాకుండా, స్ధానిక పంచాయతీ మరియు మున్సిపాలిటీ సోషల్ మీడియా లో కూడా పెట్టాలని, జగనన్న ను ప్రజలు కోరుతున్నారు.

ఇంట్లో నుంచే అభివృద్ధి ని చూసి, సమస్యలు చెప్పుకునే అవకాశం, ప్రజలకు జగనన్న ప్రభుత్వం ఇవ్వాలని, కరోనా సమయంలో కూడా, ఆఫీసు కు వచ్చి నోటీసు బోర్డు చూడమనడం, భావ్యం కాదని విన్నవించుకుంటున్నారు. ఆన్లైన్ పన్నులు కూడా ఉండాలి అని ఆశపడుతున్నారు.

దయచేసి జగనన్న కు ఈ విషయం తెలియపరచి, మనది గొప్ప టెక్నాలజీ ప్రభుత్వం గా నిలపాలని ఆశిస్తున్నారు. మనం 2 ఏళ్లుగా అందరు నాయకులు, మంత్రులు, అధికారులు ను అర్ధిస్తున్నాము వాటి గురించి అని మీకు తెలుసు.

గతములో పెద్ది రెడ్డి గారికి కూడా విన్నపాలు పంపాము, ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోవడము లేదు, జగనన్న ఖ్యాతి పెంచడానికి అధికారులతో మాట్లాడి, తమ శాఖను టెక్నాలజీ లో ముందు ఉంచాలని అందరూ కోరుతున్నారు.

అవి ఏంటంటే...

1) నీటి/ ఇంటి పన్నులు వచ్చేటివి, వచ్చినవి ప్రతి నెల నోటీసు  బోర్డు పై  చూపాలి.

2) ప్రతి నెల వీధి లైట్స్  చెక్ చేసి, లైట్స్ వేయాలి,ఎన్ని వేసారో నోటీసు బోర్డు పై చూపాలి.

3) ప్రతి నెల కొత్త పింఛన్లు ఎవరికీ రావాలో వాళ్ళకు ఇప్పించాలి.

4) ప్రతి నెల లో ఒకసారి మరుగుదొడ్లను వాడడం మరియు చెత్తను చెత్త కుండీలో వేయడం లాంటివి, ప్రోగ్రామ్స్ ను చేపట్టాలి.

5) ఏదైన పండుగలు వస్తే, వాటికీ ఐన ఖర్చులు నోటీసు బోర్డు లో చూపించాలి.

6) గవర్నమెంట్ ఫండ్స్ వస్తే ఎంత వచ్చాయో, ఎంత ఖర్చు చేసారో, నోటీసు బొర్ఢ్ లో చూపాలి.

7) ప్రతి నెల గ్రామసభ నిర్వచించాలి. గ్రామసభలో 100 మందికి పైగా ఉన్న ఫొటో సంభదిత అధికారికి పంపాలి. ప్రజలకు గ్రామంలో, ఏమి అవసరమో తెలుసుకొని, వాటిని నిర్వచించాలి.

8) ప్రతి ఇంటికి మరుగు దొడ్డి లేని యెడల, కొత్త మరుగు దొడ్డి ని కట్టించాలి. ఇంతక ముందు కట్టినా వారికి డబ్బులు రాణించి వాటికి డబ్బులు ఇప్పించాలి..

9) గ్రామంలో మరియు ప్రతి ఇంటికి ఆవరణలో, రెండు చెట్లు ను నాటించాలి.

10) రేషన్ షాప్ లో బియ్యం ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్ లో అమ్మరాదు.

11) ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి కి 132.00 రూపాయలు  ప్రభుత్వం ఇస్తుంది ఉదాహరణకు గ్రామంలో 6000 మంది ప్రజలు ఉన్నారు అనుకోండి. 8,000,00 (ఎనిమిది లక్షల రూపాయలు) గవర్నమెంట్ గ్రామ పంచాయతీ లకు ఇస్తుంది. ప్రతి నెల గ్రామ పంచాయతీ, ఈ ఎనిమిది లక్షల రూపాయలు, దేనికి ఉపయోగిస్తున్నారో, గ్రామసభలో అడగవచ్చు.

ఈ పదకొండు పాయింట్లలో ఏదైనా లోపం జరిగిన, ఆ పదవి నుండి తొలిగించే అధికారం, ప్రజలకు ఉన్నది.

ప్రజలారా గుర్తు ఉంచుకోండి, ఏదైనా అన్యాయం జరిగినట్లయితే, పై అధికారికి తెలపండి.

11) వ పాయింట్ చాలా ముఖ్యమైనది, ప్రభుత్వం నుండి వచ్చిన నగదు ఎంత? పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు ఎంత?

గ్రామ పంచాయతీలో జరిగే ప్రతిదీ తెలుసుకొని, గ్రామ అభివృద్ధికి తోడ్పదాం.... 

వ్యవస్థ లో మార్పు రావాలి అంటే, ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. ప్రశ్నించడం ఒక సామాజిక బాధ్యత...  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1029 General Articles, 46 Tatvaalu
Dt : 19-Feb-2021, Upd Dt : 19-Feb-2021, Category : Politics
Views : 70 ( + More Social Media views ), Id : 981 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : rules , plan , development , answer to public , gram panchayat , open govt , jagannanna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content