Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 అందరి ముందు సున్నితమైన వ్యక్తిగత ప్రశ్న
2 ఒంటరి వారు - 3 types
3 పెళ్ళైన వారు - మాకు పిల్లలు వద్దు - 6 types
4 పెళ్ళై పిల్లలు వద్దు అంటారు - సమాజ/ మత కోణం
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. *ఉపాసన ప్రశ్నకు, ఆధ్యాత్మిక సద్గురు జవాబు విన్నారా? సరైనదేనా? సున్నితమైన వ్యక్తిగత ప్రశ్నలు అందరిముందు?*
కొంచెము ఆశ్చర్యము వేసింది. ఇలాంటి సున్నితమైన వ్యక్తిగత ప్రశ్నలు అందరిముందు అడగకూడదు. ఇప్పుడు ఫాషన్ అయిపోయింది. జవాబు కూడా అందరి ముందు, కరెక్ట్ కాదు. ఎందుకంటే, అన్ని ప్రశ్నలు జవాబులు అందరికీ, ఒకే విధముగా వర్తించవు, ఎవరి ఇంటి మరియు మానసిక పరిస్తితులు వారివి. కొందరికి అది మంచి గా అనిపిస్తే, కొందరికి అది చెడు, ఇందులో పలు కోణాలు ఉన్నాయి. ప్రశ్న జవాబు వీడియో కూడా చూడండి.
ఇలాంటివి మేము విన్నాము, కానీ ప్రతి జంట లో, వారి వారి వ్యక్తి గత సమస్యలు అపోహలు అనుమానాలు నిర్లక్ష్యము బద్దకము ఆశలు ఉంటాయి. కాబట్టి, కామన్ జవాబు ఉండదు.
ఉదాహరణకు, కరోనా లేదా ఇంకో రోగం వచ్చింది అని అందరమూ, ఒకటే బిళ్ళలు వేసుకోకూడదు. కరోనా స్థాయిని బట్టి డోసు మారుతుంది. అంటే, అనుభవం గల డాక్టర్ మాత్రమే, తగిన మందులు తగిన ఆహారం, తగిన డోసు చెప్ప గలరు.
2 వేరు వేరు వర్గాలు అయినా కూడా, హీరో రామ్‌చరణ్- ఉపాసనలది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. పదేళ్ళు అయ్యింది, ఇప్పటికీ వీరికి సంతానం లేదు, అంటున్నారు. అది వాళ్ల వ్యక్తిగత విషయం, ఇలా బయట అందరిముందు అడిగి, అది ఇంకా పలుచన చేసి, అందరూ తలా ఒక మాట అనే విధముగా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.
ఉపాసన ప్రశ్న - నేను పెళ్లి చేసుకుని పదేండ్లవుతోంది. నా వైవాహిక జీవితం చాలా చాలా సంతోషంగా సాగుతోంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ ప్రజలు మాత్రం నా లైఫ్‌లోని ఆర్‌ఆర్‌ఆర్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ ఆర్.. నా రిలేషన్‌షిప్ గురించి, సెకండ్ ఆర్.. రీ ప్రొడ్యూస్ (పిల్లలను కనే సామర్థ్యం), మూడో ఆర్.. లైఫ్‌లో నా రోల్.. వీటి గురించే జనాలు ఎక్కువగా చర్చిస్తున్నారు అని చెప్పుకొచ్చింది.
సద్గురు జవాబు - రిలేషన్ అనేది నీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీప్రొడ్యూస్.. పిల్లలను కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులిస్తాను. ఈ తరం వాళ్లు పిల్లలని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా మరీ అధికమైపోయింది. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం.
పలు కోణాలు - వారి గురించి వద్దు, మామూలుగ అనుకుందాము. ఒంటరి నుంచి జంటకు వెళదాము.
1). ముందే అనుకున్నాము, ఇలా అందరి ముందు సున్నితమైన వ్యక్తిగత ప్రశ్న అడగడం అనవసరం. మేము ఎన్నో కధలుగా రాసినా, అసలు వ్యక్తుల పేర్లు పెట్టము, కేవలము సమస్య సమాధానము మన కోణాలు జవాబులు అంతవరకే.
2). *ఓంటరి వారు* - మాకు పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు అంటారు. దానికి సరైన క్లారిటీ ఇస్తే, బంధువులు స్నేహితులు అడగరు మరలా.
11. నీతి నియమాలు తో నిస్వార్ధముగా అరిషడ్వర్గాలను జయిస్తూ ఆధ్యాత్మికముగా ఉండాలి, మనకు తగిన వారు ఆ మనస్థత్వము తో దొరకడం చాలా కష్టం, కాబట్టి ఆ ఆలోచనలే వద్దు - బహుశా వీరిని ఎవరూ ఇబ్బంది పెట్టరు, అడగరు. ఎందుకంటే, అలాంటి జంట దొరకడం అరుదు.
22. నాకు బద్దకము తలనొప్పి బంధాలు మాటలు అంటే, పిల్లల గొడవ అసలు నాకొద్దు - వారికి, బద్దకము తో అపోహలతో వద్దు అంటున్నారు అని, నచ్చ చెపడానికి ముందు ప్రయత్నం చేస్తారు. కానీ తర్వాత వినరు అని వదిలేస్తారు.
33. నాకు ఎవరు దొరకడం లేదు, అని బాధపడుతూ 70 ఏళ్ళ కైనా ఎదురు చూస్తు ఉండటం - వీరికి సహాయపడటానికి ప్రయత్నం చేస్తారు 100 అబద్దాలు ఆడి అయినా.
3). *పెళ్ళైన వారు* - మాకు పిల్లలు వద్దు అంటారు. దానికి సరైన క్లారిటీ ఇస్తే, బంధువులు స్నేహితులు అడగరు కదా మరలా.
పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? 1. వారి శారీరక ఆనందము కోసము లేదా 2. ఊరికే ఒక తోడు కోసము లేదా 3. వ్యాపార/ హోదా బంధం కోసం లేదా 4. మరింత సంపాదన/ ఆస్తుల కోసం లేదా 5. సమాజం కోసం అడ్డము లేదా 6. ఆదర్శ దంపతులు గా పిల్లలు కని ఉత్తమ వంశాభివ్రుద్దికి.
మొదటి 5 కోవలకు చెందినవారు, స్పష్టముగా తమ బంధువులు, స్నేహితులకు తెలియపరిస్తే, బహుశా వారు, పిల్లల గురించి అడగరు. అవసరము ఏముంది, క్లారిటీ ఉంది కదా? ఎందుకంటే వీరు స్పష్టముగా చెప్పారు, మా పెళ్ళి బంధము కేవలము వీటికే పరిమితము అని, అది వారి ఇష్టం, తప్పా ఒప్పా ఫలితాలు ఏమిటి అనేది, తర్వాత రోజుల్లో తెలుస్తుంది.
దగ్గర చనువు బంధాన్ని బట్టి, అది తప్పు, మరి ఎందుకు పెళ్ళి చేసుకున్నారు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేయవచ్చు, వారు సున్నితముగా అదే సమాధానం మూర్ఖముగా చెప్పవచ్చు. వీరు వివాహ వ్యవస్థను, కేవలం తమ స్వార్ధ అవసరాలకు వాడుకుంటున్నారు అనేది స్పష్టం. విడాకులు కూడా తేలిక. ఎందుకంటే, పిల్లలు ఉన్నవారికి, విడాకులు అంత తేలిక కాదు. కాబట్టి ఎప్పుడైనా, తెలికగా విడిపోతారు, ఎందుకంటే ఇది అవసర బంధం మాత్రమే.
ఇక పిల్లల కోసం పెళ్ళి చేసుకున్న వారిలో -
1. తమ ఆదాయ పరిస్తితి ని బట్టి ఆగుదాం లేదా తాము ఇంకొన్నాళ్ళు జాలీగా తిరుగు దాం అనుకునే వాళ్ళు ఇంకొంత మది. - వారికీ నచ్చ చెపుతారు, రోజులు మనవి కాదు, వయసు దాటాక సంతానం లేక బాధలు ఎక్కువ అని.
2. అసలు పిల్లలు పుట్టని వారు - వీరిని మనం బాధించకూడదు, ఎత్తి పొడుస్తూ. విధి రాత. టెస్ట్ ట్యూబ్ బేబీలు లాంటి ఇతర మార్గాలు ఉన్నాయి, అది వారి ఆదాయం, అవసరం, నైతికత ను బట్టి ఉంటుంది. మనము వేలు ఎత్తి చెప్ప కూడదు. వీలైతే, దోవ చెప్పు, లేదా గమ్ము గా ఉండు.
4). *పెళ్ళై పిల్లలు వద్దు అంటారు - సమాజ మత కోణం*
ఓ పక్క హైందవ జాతి తగ్గుతూ, ఇతర మతాలు పెరుగుతూ ఉంటే, పిల్లలు వద్దు అని, మనమే మూర్ఖముగా ఉంటే, తర్వాత రోజుల్లో, మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ధనం లేక, పెళ్ళి కాక, గమ్మున ఉంటే ఆ పరిస్థితి వేరు.
పిల్లలకు పాలు ఇవ్వని తల్లులను చూసాము. అలాగే పిల్లలను 9 నెలలు కనలేము అని అద్దె తల్లులను వాడిన వారిని చూసాము. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ లేదా పెంచడం ఇష్టం లేక, ఆయాలతో పిల్లలను పెంచిన వారిని చూసాము. ఇప్పుడు అసలు మాకు పిల్లల తలనొప్పే వద్దు అనేవారిని చూస్తున్నాము.
ఇంకెన్ని ఘోరాలు వినాలో. స్వార్ధ అవసరం సుఖం తప్ప, ఉత్తమ జాతి విస్తరణ వద్దు అంటూ, తాము కూర్చున్న కొమ్మను నరకడం, తమ గొయ్యి తాము తీసుకోవడం అంటే ఇదే. పెద్దల మాటలు వినని పిల్లల పరిస్తితి ఇదే. పెద్దల పెంపకానికి, పిల్లలకు మంచి ఏదో చెడు ఏదో చెప్పలేరు.
అన్ని ఉండి, కోట్లు పెళ్ళి ఉండి కూడా, బద్దకము తో, మాకు ఇప్పుడే లేదా అసలు వద్దు అనడం, బాధ్యత గల పౌరుల పనేనా? ఇదేనా క్రుతజ్ఞత తమ వంశం పై, సమాజం పై? జనాభా పెరుగుతున్నారు కాబట్టి, మీకు పిల్లలు వద్దు అనుకుంటే, భూగోళాన్ని కాపాడతాం అంటే, అవార్డ్ ఇస్తాను అనడం కరెక్ట్ కాదు. రేపు బద్దకస్తులు మూర్ఖులు అందరు ఇదే మంచి అని గమ్ముగా ఉంటే? హిందువులు మడి కట్టుకుని కూర్చుంటే, ఇతరులు కూర్చోరు కదా? వినాశకాలే విపరీత బుద్ది అంటే ఇదే.
కాబట్టి, వీటి లో ఏ కోణము తో ఏ జంట అయినా ఉన్నారో, మనకు తెలీదు. కౌన్స్లింగ్ ఇచ్చేటప్పుడు అవి అన్ని మనము తెలుసుకోవాలి. నమ్మకము ఉన్న వారికి అన్ని చెప్పి, సరైన సలహా తీసుకోవాలి. తీరు మార్చుకోవాలి.
Spiritual Sadgurus answer to upasana question, Is correct? Sensitive personal questions in front of everyone?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,133; 104 తత్వాలు (Tatvaalu) and views 254,453 Dt : 06-Jul-2022, Upd Dt : 06-Jul-2022, Category : General
Views : 720
( + More Social Media views ), Id : 1454 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
spiritual ,
sadguru ,
answer ,
upasana ,
question ,
correct ,
sensitive ,
personal ,
everyone ,
ramcharan Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments