Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *సాత్విక మరియు సాధారణ తల్లి అని, తల్లుల లో కూడా తేడాలు ఉంటాయా? అమ్మ, తన పిల్లల చెడు కోరుతుందా? పిల్లల భవిష్యత్ పై, ప్రేమ బాధ్యత లో తేడా ఉంటుందా? సాత్విక తల్లికి ఎక్కువ లాభం ఏమిటి?*
జవాబు - మన ఇళ్ళ పక్కన, చాలా చూస్తుంటాము, మరలా వారికి కోపాలు వస్తాయి. అందుకే ఎవరు కాదనలేని, అందరికీ తెలిసిన ఉదాహరణలు మాట్లాడుకుందాము. మహా భారతం లో ఇద్దరు తల్లులు ఉన్నారు మనకు, వారు మనల్ని దయతో కనికరించి క్షమించాలి. ఇంచుమించు తండ్రులు అంతే. -
1). సాధారణ తల్లి - నీతి నియమం పాపభీతి సంస్కారం మానవత్వం లేని, అవసర అవకాశ వాద, 100 మంది కౌరవుల కు, ప్రాపంచిక మోహములో ఉండే, ఐశ్వర్యం మత్తు లో గాలిలో నడిచే, బాధ్యత ముందు చూపు లేని, మామూలు సాధారణ తల్లి, గాంధారి.
మన చుట్టూ ఎక్కువ శాతం వీరే, అందుకే ఏ ఇంట్లో నూ, ముందు ఆ తల్లి దండ్రికే, మనశ్శాంతి ఉండదు. వారి పిల్లలు వారి మాట నే వినరు. ఇంక పిల్లలతో బయట వారి పాట్లు చెప్పక్కరలేదు. ఎవరినీ లెక్క చేయరు, ఎవరి మాటా వినరు.
చిన్నా పెద్దా మర్యాద ఉండదు. ఇప్పుడు కరోనా వీరులు కూడా మొదలు అయ్యారు, అమిత తెలివి తేటలతో. సమాజానికీ ఉపయోగం లేదు, తా చెడ్డ కోతి వనమెల్లా చెడిపింది అన్న సామెత వీరికి సరిపోతుంది.
భారత యుద్దము తో, తమ బంధువులను స్నేహితులను కూడా, తమతో పాటే, పరలోకానికి తీసుకు వెళ్ళారు. అన్ని కుటుంబాలలో చిచ్చు పెట్టారు. కౌరవుల పిల్లల ఆలోచనలు అంతే, మంద బుద్దులు. అందుకే పిల్లల్కు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, సంస్కారం అనేది.
మనతో ఈ పెద్దలు ఎప్పుడు గొప్పలు చెపుతుంటారు - మాకు ధనం ఉందండి, వంద ఆశ్రమాలు అలాగే మనుషులు ఉన్నారు, ధనం పడేస్తే ఎవరైనా చూస్తారు, అంటారు. మా పిల్లలు మమ్మల్ని చూడక్కరలేదు వారి మీద ఆధారపడం, అని తమ పెంపక సంస్కార లోపాన్ని స్పష్టము గా గొప్పగా చెపుతారు.
వయసు శక్తి ఉడిగితే, కాళ్ళు చేతులు పని చేయవని, స్వాధీనము లో ఉండవని, మైండ్ పని చేయదని, చేతి స్పర్శ ప్రేమ కావాలని, వారికి అప్పుడు తెలీదు. ఇతరులను లేదా సినిమాలలో చూసి కూడా గ్రహించరు. అయ్యో అనరు, ముదుసలి వారిని, వారానికి ఒకసారి పలకరించరు, సేవ చెయ్యరు. తమకు ఆ గతి రాదని, బ్రమలలో ఊహలలో ఉంటారు.
అంటే ఇదంతా, కేవలం మోహ పెంపకం. ప్రేమ ఎప్పుడూ, బాధ్యత నేర్పుతుంది, ఇతరుల మంచి కోరుతుంది. కాబట్టి గాంధారిది సరైన తల్లి ప్రేమ కాదు. తనకు తెలీకుండానే, పిల్లల పతనం కోరుకుంది, ఎంత మంది చెప్పినా, పెడచెవిన పెట్టింది. చివరకు, తల్లికే, కడుపు కోత పెట్టి వెళ్ళారు, పది మంది తో చీవాట్లు తింటూ జీవితాంతం గడిపారు.
పిల్లలు, కనీసం పేరెంట్స్ కి కూడా పనికి రారు. అవసరం అవకాశం బట్టి నటిస్తూ మారిపోతుంటారు, నిలకడ లేకుండా. బయట వారి ముందు, అమ్మ నాన్న గురించి గొప్పలు చెపుతారు, కానీ దగ్గర పెట్టుకోరు.
ఎందుకంటే, వారికి సంస్కారం మానవత్వం క్రుతజ్ఞత తెలీదు కాబట్టి, సాధారణ తల్లి నేర్పలేదు కాబట్టి. గురువులు అంటే లెక్క లేదు. అంతా పై పైన, దేనికీ కట్టుబడి ఉండరు. ప్రాపంచిక సుఖాలే తమకు ముఖ్యం అంటారు, అరిషడ్వర్గాలు కు బానిసలౌతారు.
2). సాత్విక తల్లి - దేవునికి ఇష్టమైన సంస్కారం మానవత్వం తన మన గల పాండవుల కు, ఆధ్యాత్మికం గా ఉండే, ఐశ్వర్యం ఉన్నా నేల పై నడిచే, బాధ్యత గల సాత్విక ఉత్తమ తల్లి, కుంతి.
ఆఖరికి భోజనాన్ని కూడా, సమభాగాలు చేసి, బలం భారీ కాయం ఉన్న ఎక్కువ శాతం భీమునికి పెట్టి, సహనం ఓపిక త్యాగం పంచుకోవడం సోదరభావం ప్రేమ నేర్పింది.
కోపిష్టి బలాడ్యుడు భీమునికి కూడా, అన్న ధర్మరాజు అలాగే క్రిష్ణుని మాట, ఎప్పుడు జవ దాటకూడదని, మంచి గురువుల ను చూపించింది, తాను భవిష్యత్ లో తోడు ఉన్నా లేకపోయినా.
పిల్లలు అందరికీ, క్రిష్ణుడు మన మంచి కోరే వాడు, ధర్మానికి ప్రతినిధి, దేవుడు లాంటి వాడు, నా కన్నా మీరు క్రిష్ణు నే ఎక్కువ నమ్మాలి, విడువద్దు, ఆయన మాటకు ఎదురు చెప్పవద్దని, నూరి పోసింది.
క్రిష్ణునికి తెలీకుండా ఏ పని చేయవద్దు అని, నియమం పెట్టింది. కొన్ని సార్లు చనువుతో పాండవులు, బావ క్రిష్ణుని పై కోపము తెచ్చుకున్నా, తర్వాత క్షమాపణలు చెప్పారు. జీవితాంతం, తమకు మార్గదర్శి గా అంగీకరించారు.
ప్రజల కోసం, తన కొడుకు భీముడు ను, బకాసురు ని కి ఆహారము గా పంపింది. బకాసురుని చంపి, ఆ ఊరి ప్రజలకు మనశ్శాంతి కల్గించింది. వనవాసాన్ని దాని కష్టాలను, ఆనందముతో ఎదుర్కొన్నారు.
పాండవులతో, తల్లి దండ్రికి మనశ్శాంతి, తమ చుట్టూ ఉండే వారందరికి మనశ్శాంతి మరియు స్వార్ధం లేని రక్షకులు.
* * *
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటే, ఇదే ఉదాహరణ. నీతి నిజాయితీ గల మంచి స్నేహితుడు లేదా కొడుకు/ కూతురు ఒకరు చాలు, పనికిరాని 100 మంది కన్నా.
అందుకే ఎవరికి వారు మనసులో చూసుకోవచ్చు, తాము సాత్విక తల్లా/ తండ్రా కాదా అని ఇలా - 60 ఏళ్ళు దాటినాక పడే పరిస్తితిలో, బాధ్యత గల ఇష్టమైన పిల్లల దగ్గర ఉండే, తల్లి/ తండ్రి ని సాత్విక తల్లి/ తండ్రి అనవచ్చు.
ఎందుకంటే, తన ఉత్తమ సంస్కార పెంపకము లో, విద్యాబుద్దులు నేర్చిన పిల్లలు, క్రుతజ్ఞతలు విశసనీయత తో, కనీసం తమనైనా కళ్ళ తో చూసే, రోజూ సేవ చేసే జ్ఞానాన్ని పొంది ఉంటారు.
సాత్వికత అంటే, రామా క్రిష్ణ అంటూ ముక్కు మూసుకుని, మూలన జపం చేయడం కాదు. మనం చేసే ఏ పనిలో అయినా నీతి నిబద్దత సంస్కారం మానవత్వం ఉంటుంది. కపటం కుట్ర దాపరికం, ఒకరితో వేలెత్తి చూపించుకోవడం ఉండదు.
కౌరవులు పాండవులు ఇద్దరూ యుద్ద వీరులే. కానీ కౌరవులు ఎవరిని శిక్షించాలి/ చంపాలి అన్నా, దానికి కారణం, సమయం, కనికరం ఏవీ ఉండవు.
కానీ పాండవులు, ఏపని చేసినా, ధర్మం తో పెద్దలు ఎవరూ వేలు ఎత్తి చూపకుండా ఉండేలా, జాగ్రత్తలు తీసుకుంటారు. తమకు తెలియకపోతే, క్రిష్ణుని సంప్రదించి, అనుమతి ఉంటే గానీ, ముందుకు పోరు.
సాత్విక తల్లి కుంతి చేతిలో పెరిగిన పాండవులు, అందరి మన్ననలను పొందుతూ, దేవుని ఆశీర్వాదాలు కలిగి, అన్ని కష్టాలను ధైర్యముతో ఆనందముగా ఎదుర్కొన్నారు. ఎవరి పై ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేయలేదు. అన్ని తమకు దగ్గర వాడైన గురువైన, క్రిష్ణుని సలహా మేరకే చేసారు. అన్నిటిలో విజయం సాధించారు.
కానీ గాంధారి చేతిలో పెరిగిన కౌరవులు. ఎవరి మాట వినరు, ఎవరినీ లెక్క చేయరు. మంచి మర్యాద లేదు, అహంకారం ఐశ్వర్యం అహంకారం. ఎవరినైనా తూలనాడుతారు, అడ్డు గా ఉంటే, తొలగిస్తారు కూడా.
దుష్ట చతుష్టయములో 2 రు కౌరవులే - దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు. కుటిల బుద్ది గల, మేన మామ శకుని మాయలో పడ్డారు. తామంతా నాశనం అవుతూ, ఇతర కుటుంబాలకు కూడా కన్నీళ్ళు మిగిల్చారు.
పురాణ కధలు హైందవ శాస్త్రాలు, మహిళలకు పెద్ద పీట వేసాయి, ఇంటికి అసలు యజమానురాలు ఆదిశక్తి అమ్మనే. పిల్లలను సరిగ్గా పెంచే ఓపిక, సహనం, ముందు చూపు అమ్మకు మాత్రమే ఉంటాయి.
నాన్నకు అవన్నీ చేయాలంటే కష్టం, ఎక్కువ మందికి అంత ఓపిక ఉండదు, కేవలము బయట పని, అంటే నలుగురు తో మాట్లాడటం మరియు సంపాదించడం.
ఈరోజుల్లో కూడా చూడవచ్చు, మామూలు తల్లుల మాటలు. మా పిల్లలకు అస్సలు సమయం ఉండదు అండి, ఇవి చేయడానికి అని గొప్పలు గా, తమ తెలివి తక్కువ తనాన్ని 10 మందికి చెపుతారు, పిల్లలను తమకే పనికి రాని రాతి బండలు గా తీర్చి దిద్దుతారు - ఉదయం 5 కి నిద్ర లెగవరు, పూజా పునస్కారాలు, దైవ భక్తి పాటలు శ్లోకాలు, భారతం రామాయణం, సంస్కారం, త్యాగం, ఓపిక, సహనం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, మానవత్వం, పెద్దల యందు మంచి మర్యాద, నానమ్మ తాత తో ఓ రోజు, ఇలాంటి సాత్విక పనులు మరియు ఆలోచనలు నేర్పరు.
కానీ వీటికి మాత్రం, కుటుంబం మొత్తానికీ, కావల్సినంత సమయం ఉంటుంది - సినిమాకు, పార్కులకు, స్నేహితులకు, ప్రదేశాలుకు, టీవీలకు, సీరియల్స్ కు, వీడియోలు సోషల్మీడియా, పిచ్చాపాటీ మాటలు, తగువులు, గొడవలకు, పార్టీలకు, ఫంక్షన్ లకు - వీటి దగ్గర చదువుకు ఇబ్బంది ఎవరికీ ఉండదు.
కానీ సాత్విక తల్లి, తన బిడ్డకు మానవత్వాన్ని, సంస్కారాన్ని, ప్రతి రోజూ కధల రూపముగా, దేవుని గ్రంధ ఉదాహరణలతో, నూరి పోస్తుంది. వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తుంది.
కర్ణుడి గురించి అనుకోవాల్సిన పనే లేదు, అతను ఉంది అధర్మం వైపు. దుష్ట చతుష్టయం లో ఒకరుగా, అతని అండతోనే, అధర్మం పెచ్చు పెరిగి, లక్షల మంది ఊచకోతకు కారణం అయ్యింది.
Satvika sadharana tallulu? Amma, pillala chedu korutunda? Prema badhyata lo teda? Ekkuva labham?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,443; 104 తత్వాలు (Tatvaalu) and views 258,585 Dt : 10-Jun-2022, Upd Dt : 10-Jun-2022, Category : General
Views : 905
( + More Social Media views ), Id : 1422 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
satvika ,
sadharana ,
tallulu ,
amma ,
pillala ,
chedu ,
korutunda ,
prema ,
badhyata ,
labham ,
kunti ,
gandhari ,
krishna ,
pandava ,
kourava Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments