Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఒక రోజు సందేశం - 7 సార్లు మెసేజ్ పెట్టిన
* ఒక రోజు సందేశం - గోడ పై కనెక్షన్ డబ్బా
* ఒక రోజు సందేశం - బజారు కు రక్షణ గా, కాపలా పెడదాం
* పనిచేసే కెమెరా కుర్రాళ్ళు రాకపోతే
* కొత్త గా కొనే వారికి సూచనలు
1 min read time. కల్పిత పాత్రల పేరుతో, ఒక ఇంటి వారి బాధను, కొంతమంది కెమెరా షాప్ యజమానులు పెట్టిన ఇబ్బందులు చూడండి. ఈరోజు మనకు ఈ ఇబ్బందులు లేకపోవచ్చును, కానీ రేపు రావచ్చును కదా. కంప్యూటర్, టాబ్లెట్, సెల్ఫోన్, ఏ ఎలెక్ట్రానిక్ వస్తువు అయినా ఇంతే. ఇవే జాగ్రత్తలు. చెప్పే మాటలు, మనకు ఇచ్చే లేదా పెట్టె పరికరాలు, తేడాలు జాగ్రత్త గా గమనించండి.
* ఒక రోజు సందేశం - సాయి గారు, 7 సార్లు మెసేజ్ పెట్టిన, జవాబు లేదు. ఇప్పుడు ఫోన్ చేశాము, మీరు ఎత్త లేదు. అందుకనే ఎప్పుడూ మెసేజ్ లు పెట్టేది. మీరు ఇప్పుడు కు 4 సార్లు చెప్పారు, రేపు వస్తున్నారు బాగు చేస్తున్నారు అని. 4 నెలలుగా ఎవరూ రాలేదు, ఇది ఫిబ్రవరి నుంచి మాట్లాడుతున్నాము.
ఎందుకు మీరు అబద్ధాలు చెపుతూ, దొంగ లాగా తప్పించుకుంటున్నారో తెలీదు. మీ ఉద్దేశ్యం ఏమిటో , వివరంగా చెప్పండి. కస్టమర్ ను ఇబ్బంది పెట్టి, నాలుగు మెతుకులు ఇచ్చే వృత్తి కి ద్రోహం, ఏనాటికైనా మీకే నష్టం చేస్తుంది.
కిషోర్ గారు, గతంలో బయట కనెక్షన్ డబ్బా మరియు కరెంటు కనెక్షన్, వెనుక వారింటికి మారుస్తాం అన్నారు. మార్చేయండి త్వరగా, ఈ వారం లో. కరెంటు వైరు, బయటకు ఓ మూర ఉంచి. భవిష్యత్తు లో అత్యంత అవసరం అయితే, మీకు ఉపయోగపడుతుంది. అక్క గారు పక్కన ఉన్నప్పుడే చేయండి ఆ మార్చే పని. వైర్లు ఇంటి ముందు వేళ్ళాడకుండా, చూడగలరు.
* ఒక రోజు సందేశం Nov 9th - కిషోర్ గారు, మా గోడ పై కనెక్షన్ డబ్బా, ఇంటి కరెంటు వాడకం తీసేసారా? మీరే చెప్పారు క్షణంలో వెనక ఇంటికి మారుస్తాను, బాధ పడకుండా అని, నవ్వుతూ ఆనాడు. మాట తప్పు తున్నారు ఇప్పుడు. జవాబు రాలేదు.
రెండు ఏళ్ళు ఉచితం గా, మా కరెంటు వాడుకున్న విశ్వాసం, కృతజ్ఞతలు చూపించండి, గుర్తు పెట్టుకుని. బిల్లు లో రూపాయ తగ్గించలేదు ఏనాడు. వ్యాపారం శాస్వతం కాదు, కృతజ్ఞతలు మంచితనం మాట విలువ ముఖ్యం.
సాయి గారు చేస్తున్న, వృత్తి నమ్మక ద్రోహం లో, భాగం కాకండి. 4 నెలుగా రేపు రేపు అంటూనే ఉన్నారు. నమ్మకం అయిన వ్యక్తి గా మిమ్మల్ని చూపించారు ఆనాడు ఆయన. ఇప్పుడు ఆయనే కనపడకుండా వినపడకుండా పోతున్నారు, హార్డ్ డిస్క్ మోసం చేసిన తప్పుడు మనిషి లా. ఇంక కెమెరా లలో ఎంత మోసం ఉందో, బయటకు రావాలి.
ముక్కు మొఖం తెలియకపోయిన కూడా సాయి గారిని నమ్మాం, నమ్మకద్రోహం మోసం చేసారు. కనెక్షన్ డబ్బా తీసినా, ఇంకా ఇంటర్నెట్ కస్టమర్ అనే గౌరవం నిలపండి, దానిని వద్దు అంటే చెప్పండి.
కెమెరా లు, ఇంటర్నెట్ కొత్తలో పెట్టేటప్పుడు ఉండే, మంచితనం, వ్యాపారం ధనం పెరిగాక లేక రోజులు పోయాక, ఎలా దరిద్రంగా అమర్యాదగా మోసం గా ఉంటాయో, తప్పించుకుని తిరుగుతూ ఉన్న మీ ఇద్దరే ఉదాహరణ.
* ఒక రోజు సందేశం - చూస్తున్నారు కదా, మన ఊరు జనానికి ఏదో ఒక రూపాయ పెడదాం, మన బజారు కు రక్షణ గా, కాపలా పెడదాం అన్న మంచి సంకల్పం ఆపడానికి, వారి వంతు ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారో, వ్యాపారం ధనం పెరిగాక.
అన్నం పెట్టే, వృత్తిని మోసం చేసేవారు, ఎప్పుడు అయినా, అదే మోసం కు గురికాకుండా తప్పదు. అడిగి 4 రూపాయలు తినాలి, దొంగ లాగా కాదు.
కొత్త కనెక్షన్ అప్పుడు ఎన్ని అబద్ధాలు నాటకాలు మాయ మాటలు. ఆ తర్వాత, అవసరం తీరాక బోడి మల్లన్న మర్యాద. భగవంతుడు తప్పక చూస్తున్నారు చూస్తారు.
* కరోనా కు పనిచేసే కెమెరా (లేదా ఇంకో వ్యాపారం) కుర్రాళ్ళు రాకపోతే, నన్నేమి చేయమంటారు?
అందుకే కదా గౌరవం ఇచ్చి 4 లేదా 6 నెలలుగా గమ్ముగా ఉన్నాము. బాధ్యత లేని చిన్న పిల్లల, విలువ లేని, నాటకీయ జవాబు అది. చెవిలో పువ్వులు వేరే వారికి పెట్టవచ్చు ను. వాస్తవం వేరు.
ఆనాడు 10 మంది కుర్రాళ్ళు పని చేస్తున్నారు, మీకు అండగా ఉంటానని చెప్పారు. ఎవరూ రాకపోతే, మీరే వచ్చి చూడాలి సమస్య ఓనర్ గా, తప్పదు, మాట తప్పకూడదు.
లేకపోతే క్షమించండి అని, ఇతర మార్గాలు వెతకాలి, ధైర్యంగా మనిషి గా నిజాయితీగా మాట్లాడాలి. అంతే గానీ మాట తప్పే, దొంగ లాగా, పారిపోకూడదు, ఫోన్ వాట్సాప్ జవాబు చెప్పకుండా, అన్నం పెట్టే తల్లి లాంటి, వ్యాపారం కస్టమర్ ను, మోసం చేసి ద్రోహం తో.
కంప్యూటర్ కెమెరా లు గురించి కాస్త తెలిసిన మనల్నే ఇబ్బందులు పెడితే, వీటి గురించి తెలియని అమాయకులను ఎంత మోసం చేస్తారో కదా?
అలా పారిపోతే మోహం చాటువేస్తే, కస్టమర్ ని నడి సముద్రం లో వదిలితే, రేపు మనకు లేదా ఇంట్లో వాళ్ళ కు రోగాలు వస్తే, వైద్యులు మందు దొరకక, అలాగే మనం కూడా నడి సంద్రంలో మునిగి పోవాలి, ఏదో ఒకనాడు. అవసరమా, భవిష్యత్ ఇబ్బందులు?
ఇప్పుడు కుర్రాళ్ళు గురించి మాట్లాడుదాం. కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించుకునే, కుర్రాళ్లు కరోనా అని రానంటారా? ఎంత అబద్ధం. మనం లక్షలు కోట్లు సంపాదిస్తూ, వాళ్ళ మొఖాన వేలు విదిలించి ఇన్నాళ్ళు వాడుకుని, బేరాలు లేవని, జీతాలు మిగుల్చుకుందామని, వాళ్ళ నోట్లో మటికొట్టి వారిని పస్తులు ఉంచి, వారిని పని లేకుండా ఆపింది, అన్ని షాపులు యజమానులు మనం కాదా?
వాళ్ళు ఇంటి అద్దెలు, తిండి ఖర్చులు ఎలా సంపాదించుకోవాలి, మీరు రావద్దు అంటే? మనం ఆ కష్ట జీవులను ఆపి లాభం కోసం, అపవాదు వారి మీద వేసి, కస్టమర్ దగ్గర, వాళ్ళ ను దొంగలు గా చూపడం, ఇంకా పాపం కాదా? వాళ్ళ కు ద్రోహం కాదా?
మీకు 4 నెలల ముందే చెప్పా స్పష్టంగా, 10 మందిలో, మానవత్వముతో కనీసం 3 నైనా ఉంచి, పూర్తి జీతాలు ఇవ్వండి, తప్పదు. కస్టమర్ సమస్యలు ఎప్పుడు అయినా రావచ్చు. ఈ ఖర్చులు తప్పవు, వాళ్ళ కు 4 ముద్దలు పెట్టినట్లు ఉంటుంది, దేవుడు మెచ్చుకోవాలి అని.
ఈ మొత్తము సమస్యలో, మీ స్వార్థం, చేతగాని తనం, మోసం , నిర్లక్ష్యం ఉంది కానీ, ఇంకే సమస్యలు లేవు. కళ్ళు తెరవండి, పాపం మూటగట్టుకుంటున్నారు ఇంకా.
మీ దగ్గర పనిచేసే సిబ్బందే, ఇది చదివి, మా కోసము కూడా అడిగే వారు ఉన్నారు అని, మేము పనికి రాము అంటే, మీ పరిస్తితి ఊహించుకోండి. ఎందుకంటే మీరు కస్టమర్లను ఎటూ మోసము చేస్తున్నారు, సిబ్బంది జీతము నోట్లో ముద్ద ఆపి, మోసము చేస్తున్నారు, మీపై ఆధారపడిన ఇంటెర్నెట్ వారి కూడు తీసేస్తున్నారు.
* Update Nov 17th -
సిసి కెమెరాల సాయిబాబు మరియు ఇంటర్నెట్ బాలాజీ కిషోర్ గార్ల కు బుద్ది వచ్చేటట్లు గా, వినియోగదారుల ఫోరం ఉంది కదా, మిమ్మల్ని హర్డ్ డిస్క్ మెమొరి లో, అలాగే కస్టమర్ సర్వీస్ లో మోసము చేసారు అని, ఫిర్యాదు చేయవచ్చును కదా? మీ దగ్గర మెస్సేజ్ లు, ఈమైల్, వాయిస్ మెస్సేజ్ లు ఉన్నాయి సాక్షాలు గా.
జవాబు - తప్పు, అంత దూరము వద్దు. మొన్ననే చెప్పాను కదా. రావు కేతు శని మార్పులు, వారి మనసు మీద ప్రభావము చూపిస్తున్నాయి. వారి వ్యక్తిత్వాన్ని మూసేసాయి, ఎంత తప్పు చేస్తున్నారో వారికి తెలియడము లేదు.
వారు అన్నము పెట్టే వ్రుత్తికి అలాగే కస్టమర్ ని ఎలా ద్రోహము చేస్తున్నారో, వారికి అర్ధము కావడము లేదు. దొంగలు గా దాంకుంటూ, మాట గౌరవించని క్రుతజ్ఞతలు లేని, వారి గా మిగిలి పోతున్నారు.
నవంబరు 9 న చివరి సారి ఇద్దరు కూ చెప్పాము. రోషం సంస్కారం ఉన్న వారు ఇప్పుడు దాకా గమ్ముగా ఉంటారా?
సాయి గారు ఇంకా జవాబు చెప్పలేదు, 6 నెలలుగా హర్డ్ డిస్క్ మోసం సరి చేయలేదు, 4 వ కెమెరా సరి చేయలేదు వారాలుగా. అంటే, ఇంకోచోట కొత్త కేమేరాలు పెడుతూ, ఎవరికో భవిష్యత్ మోసానికి చీటింగ్ కి, బాటలు వేస్తున్నారు.
బాలాజీ గారు, నవంబర్ 9 లేదా 10 న ఫోన్ లో మంచి వారిలా మాట్లాడి నటించి, నేను రేపు చూసి, డబ్బా మార్చడానికి ఇబ్బంది ఉంటే, చెపుతాను అన్నారు. ఇబ్బంది లేకపోతే వెంటనే మార్చేయండి, ఇబ్బంది ఉంటే చెప్పండి వివరముగా, ఇద్దరికి ఉపయోగకరముగా చేద్దాము అని చెప్పాను.
ఈరోజు, 18 వ తేదీ దాకా తీయలేదు, ఎంత నిర్లజ్జ గా అగౌరవంగా, మా గోడ మీద ఆధారపడి బతుకుతున్నారో క్రుతజ్ఞతలు విశ్వాసం లేకుండా, మీరే గోడ మీద, నల్ల వైర్లతో కూడిన డబ్బా చూడండి. అది వారి కుసంస్కారం, 2 ఏళ్ళు ఉండనిచ్చారు అన్న క్రుతజ్ఞతలు ఎటూ లేవు. ఇప్పుడు వద్దు అంటున్నది, మీ ఇద్దరి కుసంస్కారం తెలిసి. ఎందుకు మాకు వైర్లు తలనొప్పి.
ఇంటి యజమాని మాటను గౌరవించి, కనెక్షన్ డబ్బా తీసేయాలి వెంటనే అని, వారికి తెలీదు అంటే, ఇక ఆలోచన చెయ్యండి, వారి వ్యాపారం ఎంత హీనముగా నడుపుతున్నారో, విలువలు లేకుండా.
ఆ వినియోగదారుల ఫోరం లో వారికి బుద్ధి చెప్పే , దాకా మనకు వద్దు. వారికి బుద్ది చెప్పే సిబ్బంది, కస్టమర్ తప్పక దొరుకుతాడు. లేదంటే దేవుడు చూస్తారు. మనకు సంస్కారం ఉంది, సంస్కార హీనులకు దూరముగా ఉండాలి, అంతే. వారికి రోజులే, బుద్ది చెపుతాయి. ఇంకా ఓపిక పడదాము.
కిషోర్ గారు, సాయి గారు దొరికిందాకా, ఇంటర్నెట్ కూడా వద్దు.
వారి సిబ్బంది నోటికాడ అన్నము తీసిన పాపము, సాయి మరియు బాలాజీ గార్లదే.
మీకు దోవలో కనపడినా , కనీసం సంస్కారం గుర్తు చేయండి దయచేసి.
* కొత్త గా కొనే వారికి సూచనలు
1. నమ్మకమైన వారి దగ్గరనే కొనండి. 10 వేలు నుంచి, పైకి ఉంటాయి ధరలు, మీ ఇష్టము. 4 దగ్గర రేట్లు కనుక్కోండి, ఇంటికి పిలిచి. ఎన్ని కెమెరాలు, లోకేషన్లు, వైరు దూరం, కవర్ బాక్స్ రేటు, పెట్టినందుకు చార్జీలు, ఎన్ని గంటలు పెడతారు, ఎప్పుడు పెడతారు.
2. ఇంట్లోనే ఉండి చూసుకునే వారికి, ఇంటర్నెట్ అవసరము లేదు. కానీ బయట నుంచి చూడాలి ఫోన్ లో అంటే, ఇంటర్నెట్ కావాలి. దానికి వేరే వారితో కనెక్షన్ తీసుకోవాలి. తక్కువ రేటులో చూసుకోండి. లేదా జియో ఇంటర్నెట్ బాక్స్ లు వస్తున్నాయి కేబుల్ అవసరము లేకుండానే.
3. ముందు సంవత్సరము గా పెట్టుకున్న, ముగ్గురు కస్తమర్లతో మాట్లాడండి. సర్వీసు ఎలా ఉంటుది, ఊరక చూడటానికి చెక్ చేయడానికి వచ్చినా, ఎన్ని వందలు అడుగుతారు? ఎన్ని రోజులకు వస్తారు? అసలు ఫొన్ ఎత్తుతారా? ఇలాంటివి.
4. మెమొరి హార్డ్ డిస్క్ ను బట్టి రేటు ఉంటుంది. 1 టీబీ అంటారు, అంత ఉందో లేదో చూడండి, మీకు తెలీకపోతే, కంప్యుటర్ కోర్స్ చేసే వారిని అడగండి. సీరియల్ నంబర్ రాసి పెట్టుకోండి. మరలా వచ్చినప్పుడు, డిస్క్ మార్చేస్తారేమో. హర్డ్ డిస్క్ లో ఎన్ని రోజులు వెనక్కి చూడవచ్చు? కనీసము నెల ఉంటుందా?
5. కేమెరాలు వివరాలు తెలుసుకోండి. రాత్రి విజన్ ఉందా? ఎన్ని మెగా పిక్సెల్? కెమెరా సీరియల్ నంబర్ కూడా వేసి ఉంచండి. దూరపు వా, దగ్గరవా కూడా తెలుసుకోండి.
6. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్ళ మాయ మాటలకు మోసపోతాము అని మాత్రము తెలుసుకోండి. పైన ఒక ఇంటి ఆవేదన, చూసారు కదా?
వాళ్ళ సిబ్బంది కూడా, మన సిస్టం లోకి లాగిన్ అయ్యి, మన ఇంటి లేదా ఆఫీసు పరిసరాలు గమనిస్తారేమో కూడా చూడాలి, జాగ్రత్తలు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,497; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985 Dt : 11-Nov-2020, Upd Dt : 11-Nov-2020, Category : General
Views : 997
( + More Social Media views ), Id : 805 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
cctv camera ,
neighbors ,
night watch ,
scams ,
troubles ,
precautions ,
home owners Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments