శివ శనైశ్చర ఫోటో చూడగానే, మంచి జరుగుతుందా? కొందరికి కరోనా తగ్గింది అన్నారు, నమ్మకం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, శనివారం శివ శనైశ్చర ఫోటో చూడగానే లేదా మంచి దైవ సంబంధ విషయాలు చదవగానే, మంచి జరుగుతుందా? కొంత మందికి కరోనా లేదా ఇతర వ్యాధి తగ్గింది అని చెప్పారు. నమ్మకం కలగలేదు.

గురువు గారు, మంచి ప్రశ్న, ఇలాంటివి అడిగి తెలుసుకోవాలి. అద్దాలలో హల్వా చూస్తే, నోటి కి రుచి తెలుస్తోందా? గుడి కి ఇలా వెళ్లి వస్తే, కోరికలు తీరతాయా? ఒక్క దండం, చిన్న పూజ తో అన్ని సమకూరతాయా? అన్నిటి అర్ధాలు ఒకటే.

మన దేశ జెండా చూస్తాం, చూసిన వెంటనే మోహము నిండిన మన కళ్ళకు, ఓ కర్ర మరియు గుడ్డ ముక్క కనపడితే, మనం మనిషి కాము, కృతజ్ఞతలు లేని సంస్కార హీనులం.

దేశ జెండా చూడగానే, ఇన్ని రాష్ట్రాలు, ఇంత జనాభా, ఇంతమంది త్యాగాలు, ఇంత స్వేచ్ఛ, ఇన్ని వసతులు, మన సౌభాగ్యం, అంతా గుర్తు కు రావాలి. అప్పుడు ఆనందంతో మన మనసు పులకించి, కన్నీళ్ళు వస్తూ, అప్రయత్నంగా మన తలవంచి, నమస్కారం వందనము చేస్తాం. ఓ తల్లి, ఈ గడ్డపై పుట్టినందుకు ధన్యవాదాలు అని. అప్పుడు మనలో మానవత్వం, జీవత్వం, దైవత్వం, కృతజ్ఞతలు పెల్లుబికుతాయి.

అలాగే, గుడి అయినా పూజ అయినా. శనివారం గుడికి వెళ్ళిన వారు పంపే, ఫోటో చూసినప్పుడు, మనకు, అదే అనిర్వచనీయమైన అనుభూతి కలగాలి. అది సాధనతో నే అలవడుతుంది, మొహము బయటకు వస్తే దాని విలువ తెలుస్తుంది.

అయ్యో 6 ఏళ్లు పైగా, 75 ఏళ్ల పెద్దావిడ, రోజూ ఉదయం 5 కి లేచి, శని వారం దేవాలయం లో దీపం పెడుతున్న, నా వయస్సు కు నేను లేవలేనా పొద్దున్నే? పరమాత్మ కు కృతజ్ఞతలు చూపలేనా? ఏలినాటి శని దెబ్బ అంటే ఏమిటి? శివయ్య ధ్యానం అంటే ఏమిటి?

ఇలా ఆలోచన చేసి, మన స్వచ్చమైన మనసులో దండం పెట్టుకుంటే, 6 ఏళ్లుగా, మనలో నే మనకు తెలియని మార్పులు వస్తాయి. సాత్వికత వైపు అడుగులు వేస్తాము. మనసు పూర్ణ శాంతి వైపు అడుగులు వేస్తుంది. అంటే మనలో ఆధ్యాత్మిక చింతన, మానసిక బలం పెరుగుతుంది.

మనము రోజూ చేసే తప్పులు తగ్గుతాయి, మన జాగ్రత్తలు పెరుగుతాయి. అందుకే, ఆరోగ్యం కుదుట పడతుంది.

ఇవన్నీ భావన లేకుండా, ఏదో ఫోటో చూసాము, గుడి కి భోజనానికి వెళ్ళాము అంటే, దేని వలన కూడా ప్రయోజనం లేదు. ఇది ఉత్త బొమ్మ నే, అది ఉత్త రాయే. చివరకు, అంతా శూన్యమే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 28-Aug-2020, Upd Dt : 28-Aug-2020, Category : General
Views : 477 ( + More Social Media views ), Id : 663 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : photo , shiva , shani , corona , reduced , believe
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content