శివయ్య, జ్ఞానం ఎవరికి ఇవ్వాలి? కృష్ణయ్య, ఎవరి వెంట ఉన్నారు? భగవద్గీత ఆచరణ ఇంకా ఎప్పుడు? ఉన్నారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1437 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1471 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

దేవుడి పేరు లేదా ధ్యానం/ పూజ పునస్కారాలు, రోజూ నోటితో మాటలు పాటలు చెప్పడము కాదు, శివ శివ క్రిష్ణ క్రిష్ణ అనుకోవడము కాదు, పాడిందే పాడరా పాచిపళ్ళ భద్రయ్య అన్న సామెత గా కాకుండా, అది చేతలలో ప్రతి రోజూ ప్రతి క్షణం కనపడాలి.

చిలుక కూడా చక్కగా ముద్దుగా చిలక పలుకులు పలుకుతుంది, కానీ ఆచరించలేదు, మనిషి కాదు కాబట్టి. దాని శక్తి అంతవరకే, దానికే దేవుడు ముగ్దుడు అవుతారు, అందుకే రామ చిలుక అంటాము. మరి మనం?

ఇప్పటికీ 40-60 ఏళ్ళు వయస్సు వచ్చి కూడా చాలా మంది కి, అరిషడ్వర్గాలు అంటే తెలీదు. కామ క్రోధ మద మాత్సర్యాలు, ఎంత జయించావు అంటే తెలీదు. గుణము, సేవ, త్యాగం, అంటే తెలీదు. పోనీ గత 5 ఏళ్ళు గా, క్రమం తప్పకుండా మీరు పాటిస్తున్న నీతి నియమాలు నిజాయితీ, ఏమిటి అంటే చెప్పలేరు. సజీవ గురు సేవ అమ్మ నాన్న తో ఉందా అంటే, భాగస్వామి మరియు పిల్లల మోహ వ్యామోహ బాధ్యత తిప్పల తోనే మమ్మల్ని మేమే మరచి తీరికలేదు అంటారు, ముసలి వారి గోల వాసన చాదస్తం మాకొద్దు అంటారు.

శివుడు క్రిష్ణుడు విడిగా బయట మనకు కనపడరు, కలలోకి వచ్చి రేపు ఈ పని చెయ్యి, ఈ పూజ చెయ్యి, ఈ నైవేద్యం చెయ్యమని చెప్పరు. మరి ఏమి చేస్తారు?

దేవుని రూపాలలో ఎవరో ఒకరిని అనుసరించి, వారి పనులు వారి గుణాలు వారి సేవలు త్యాగాలు వారి సేవలను, ముందు ఇంట్లో ముదుసలి అమ్మ నాన్న కు చేసి చూపించి, అప్పుడు ఇతరులకు కూడా మన చేష్ట ల ద్వారా, శివత్వాన్ని విష్ణుత్వాన్ని చేతలలో రోజూ పనులలో, సాత్విక మాటలలో సంస్కారం చూపాలి. అదే మనసును సమర్పించడము, మనల్ని మనమే అర్పించడము.

అసలు పని వదిలి పెట్టి, నేను గుడికి వెళ్ళా, పూజ చెయించా, 10 గంగాళాల ప్రసాదం ఇచ్చినా, నేనూ ప్రసాదం తిన్నా, మొక్కుబడి భజన చేసా 50 ఏళ్ళు గా, కానీ మా ముదుసలి అమ్మా నాన్నను ఇంట్లో ఉంచి చూడను? మంచిని సమర్ధించను? అబద్దాలు చెపుతూ కపటము తో, 2 నాల్కలతో, తప్పుడు వారితో తిరుగుతాను అంటే, ఇంక ఆచరణ ఎక్కడ ఉంది?

ఉదాహరణ 1 - మా మిత్రుడు 20 ఏళ్ళు గా, గంట ధ్యానం పూజా మంత్రాలు నైవేద్యాలు అబ్బో అన్ని రకాల ఆర్భాటాలు చేస్తున్నారు. తన చుట్టూ ఉండే స్నేహితులు ఎంత తప్పు చేస్తున్నా, ఎంత నాశనం అయిపోతున్నా, భార్యా పిల్లలను విడిచిపెడుతున్నా, ఇది తప్పు అన్యాయం అని చెప్పడు. తన అవసరాలు, తన అవకాశాలే ముఖ్యం అంటాడు.

ఎందుకురా అలా బండ గా ఉంటావు అంటే, ధర్మాన్ని కాపాడు అది మనల్ని కాపాడుతుంది అంటే ఇదేనా అంటే? వాళ్ళకు తెలీదా ఆ మాత్రం మేమెందుకు చెప్పాలి అంటాడు చెడు తెలివితో, ఇంక స్నేహం అంటే ఏమిటి, మంచి కోరదా? నేను చెపితే కోపముతో వాళ్ళు ఇచ్చే వడ్డీ ఆపేస్తారు, నా అసలు కూడా రాదు కాబట్టి, నిజాన్ని నొక్కి చెప్పను అంటాడు.

వాళ్ళు ఎలా నాశనం అయితే మనకెందుకు, మనకు వడ్డీ లాభం వస్తే చాలు వారితో పనులు అయితే చాలు, మన సుఖం అవసరం అవకాశం మనకు ముఖ్యం అంటాడు. తను కూడా ఓ 50 మందికి ఎగ్గొట్టాడు, కావలసినంత అప్పు, స్వర్గ సుఖాలు.

నీతో ఇదే సమస్య, సత్యం ధర్మం అంటావు, అని అంటాడు. ఆ పాపపు ధనం తో ఎదుగుదల, విరుగుట కొరకే అని గుర్తించడు కర్ణునిలా.

ఇంక అతనికి 100 జన్మల తర్వాత అయినా, ఆత్మ శుద్ది కలుగుతుందా? క్రిష్ణుడే వెళ్ళి, మూర్ఖ కౌరవులకు నీతి భవిష్యత్ చెప్పి వస్తే, ఈ క్రిష్ణ భక్తుడు, ఏ ఒక్కరికీ నీతి చెప్పడు, తాను నీతి ఆచరించడు. అది ఆత్మ ద్రోహం కాదా? క్రిష్ణయ్యను ఆయన మంచిని అనుసరిస్తున్నాడా? లేదు కదా?

ఇంక ఆయన గంటల ధ్యానం పూజ, రోజుల యాత్ర వలన శూన్య ప్రయోజనం. చేదు దోస కాయా, ఎన్ని తీర్దాలలో ముంచినా, తీపి రాదు. మన ప్రతి కదలిక, పంచభూతాలు గమనిస్తున్నాయి, సమాచారాన్ని సేకరిస్తున్నాయి, శిక్షలు ఇస్తున్నాయి అని అతను నమ్మడు, వినడు.

అరిషడ్వర్గాల బానిసత్వం తెంపడములో, దేవుని సంతానం అయిన పది మంది నర నారాయణుల కష్ట సుఖాలను వినడం లోను, రోజూ వారి ఆచరణలో చూపించాలి సుమా. అదే నిజమైన మానసిక నైవేద్యం దేవునికి, బీదవారైనా రూపాయి ఖర్చు లేదు, ఏ ఊరు కష్టపడి ప్రయాణం తో పోనక్కరలేదు. అందుకే దేవుడు మనలోనే ఉన్నాడు అన్నది, మన త్యాగం లో గుణము లో నిస్వార్ధ సేవ లో చూపించాలి.

ఈ ఇద్దరి/ ముగ్గురి లో మధ్యలో మాటలకు చేతలకు తేడా చూడండి - ఇంకా ఈ రోజుల్లో భగవద్గీత ఆచరించే వారు ఉన్నారా అన్న సందేహం తొలిగిపోతుంది.

ఉదాహరణ 2 - రేపు తెలియని ముదుసలి అమ్మ కోసం, జిల్లా ఆఫీసు/ కలెక్టరేట్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 3 ఏళ్ళు పైన లక్షల ఆదాయం వదిలి, ఇంకో ఉద్యోగం ఆదాయ మార్గం చేతిలో లేకుండా, నవ్వుతూ ఒక్క ఈమెయిలు తో - అమ్మ క్షేమం చూడడం కోసం రాజీనామా - అంటూ వదలిన, అలాగే నాటి నుంచి లక్షల ఖర్చు భారం అవుతున్నా, ఇంకా నవ్వుతూ నవ్విస్తూ దేవుని వైపు అందరినీ మరులుస్తూ, పెద్దల ఆస్తులు అమ్మకుండా, అప్పు లేకుండా, చేయి చాచకుండా, అరిషడ్ వర్గాలకు దూరము గా ఉండే, ఓ మధ్య తరగతి సన్నాసి (80 శాతం మంది ద్రుష్టిలో)/ సన్యాసి (20 శాతం మంది ద్రుష్టిలో) ఓ వైపు.

ఉదాహరణ 3 - తన సొంత ఆరోగ్యం కోసం కూడా 50 లేదా 60 ల లో, తన విశ్వసనీయత క్రుతజ్ఞత లేని ఆశయాల ఆదర్శాల అనుగుణంగా పెంచిన (అ)నాగరిక ఉత్తమ (అ)సంస్కార బిడ్డల లక్షల సంపాదన, ఉద్యోగ ఫించన్ పిఎఫ్ గ్రాట్యూటి లేదా వ్యాపారం లక్షల ఆస్తి, అండ ఉండి కూడా, ఇన్నాళ్లు చేస్తున్న ఉద్యోగం/ వ్యాపారం వదిలితే, రేపు నా బతుకు ఎలా, నన్ను గుండెల్లో పెట్టుకుని చూసేది ఆదరించేది ఎవరు, అని ఆలోచన చేస్తున్న వ్యక్తి ఓ వైపు. తన బిడ్డలు ద్రోహులు అని చెప్పలేడు, దానికి కారణం తానేనని తన అమ్మ అయ్యను చూడలేదని, తాను సంస్కారం నేర్పలేదని, అసలు తనకే లేదని ఒప్పుకోడు, ఉద్యోగం/ వ్యాపారం వదిలి కొత్త యువతకు ఇవ్వడు, తానూ సుఖపడడు. పిల్లలతో గొడవ - వారినీ సుఖపడనీయడు. చివరకు ఒంటరి లేదా అనాధాశ్రమం. మరి ఏమి సాధించాడు జీవితములో? శూన్యం. అరిషడ్వర్గాలు కు బానిస అయిన ఇతను గొప్పవాడు, కోటీశ్వరుడు ధైర్యశాలి దయామయుడు దానశీలి, 75 శాతం ద్రుష్టిలో.

వీరిద్దరి లో, శివయ్య జ్ఞానం ఎవరికి ఇవ్వాలి? శివయ్య కృష్ణయ్య ఎవరి వెంట ఉన్నారు? ఎవరు భగవద్గీత ఆచరణలో ఉన్నారు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1471 General Articles, 48 Tatvaalu
Dt : 22-Jun-2022, Upd Dt : 22-Jun-2022, Category : General
Views : 58 ( + More Social Media views ), Id : 1437 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sivayya , jnanam , krishna , bhagavadgita , acharana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content