అంతకన్నా గొప్పది, ఏదో మన మనసును, గట్టి మోహం లో ఉంచింది, పట్టింది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,993; 104 తత్వాలు (Tatvaalu) and views 224,928.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మాకు ఒకరి దగ్గర నుంచి ఈ మెస్సేజ్ వచ్చినది. ఇది మనము చేయడము కష్టము అనిపించినది. అన్ని తెలిసినవే, చేయగలిగినవే, కానీ మనసు కదలదు. చూడండి ఈ మెస్సజ్ ను,

* అందరం బాగుండాలి

* ఎక్కువ సెలవులు ఎక్కువ మందికి, ఇక్కడ డిశంబర్ లో, అక్కడ జనవరి లో, ప్రయాణములో జాగ్రత్తలు.

* షష్టగ్రహ కూటమి 25, 26 లలో, మాటలు చేతలలో జాగ్రత్తలు.

* అరిషడ్ వర్గాలు, మోహములో ప్రతి క్షణం పరుగులు తీపిస్తాయి. దుమ్ము అద్దంలో, ఏదీ సరిగ్గా చూడలేము.

* ఆయన 27 వ వారం 108 ప్రదక్షిణలు చేయించారు, ఉదయం 10 లోపు ఆగకుండా, ఖాళీ కడుపు పాదం, మంత్ర ఉచ్చారణ, కరమాల వేళ్ళ లెక్క, గంటా పది నిమిషం.

* 6 వ సంవ. శని ఉదయం 8 గుడి, 74 ఏళ్ళ అమ్మ చేతితో 9 నవగ్రహ ప్రదక్షిణలు, నిమ్మ నేతి దీపాలు.

* 4 వ సంవ. ఇంట్లో రోజూ తులసి మొక్క దగ్గర నువ్వుల కార్తీక దీపం.

* అమ్మ, 6 లక్షల 80 వేల రామకోటి, డిసెంబర్ 10 2019 కి.

* పంపినవి ప్రతి అక్షరం మనసు కు ఎక్కితే, తెలీకుండానే సాత్వికులం అవుతాము. ఓం నమో నారాయణాయ.


చదివారు కదా, ఇవి చదివినాక, కొంత మంది గొప్ప లు చెబుతున్నారు అన్నారు, తాము పైవి ఏవి పాటించకుండా, అసూయా మోహాలతో.

కొంతమంది సాత్వికులు అయినా పైవి చదివి రోషం తెచ్చుకుని, వాళ్లు ఇన్ని పనులు చేయగలేనిది, కుర్రవాళ్ళం మేమూ లేదా మా పిల్లలు ఇవి చేయలేమా? అని ముందు జాగ్రత్తలు పడతారని ఓ చిన్న ఆశ కూడా కావచ్చు. దేవుడు, మనకూ బాకీ పడాలి అని మనమూ కోరిక కోరకుండా ఇలాంటివి చెయ్యవచ్చు. శనయ్య తీవ్రత తట్టుకోవాలని, శివయ్య అండ ఉండాలని కూడా ఇవ్ ముందు జాగ్రత్తలు.

మోడీ చేసిన పౌరసత్వ బిల్లు కు వ్యతిరేకంగా, ఇతరులు, బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అది హిందువులకు ఇతరుల రక్షణకు మంచిది అయినా కూడా, అనుకూలంగా ఎవరూ ధర్నా చేయడం లేదు.

ఇలాగే నిస్తేజంగా ఉంటే స్వార్థం తో, మరలా స్వాతంత్ర్య ముందు రోజులు వస్తాయి. మన తర్వాతి తరాలు అనుభవించాలి.

అది గొప్ప విషయం, మంచి విషయం అయితే, 60 ఏళ్ల లోపు ఉండి, శక్తి ఉండి, మనము ఎందుకు చేయము, 27 వారాలు లో కనీసం ఒకసారి?

అంటే, అది మన మనసు కు, చాలా అల్ప విషయం, రామకోటి రాయడం లేదా 6 సంవత్సరాలు శని వార వ్రతం లేదా 4 వ సం ఇంట్లో తులసి దీపం లేదా దేవుని చుట్టూ 108 ప్రదక్షిణలు తిరగడం.

అంతకన్నా గొప్పది, ఏదో మన మనసును, గట్టి మోహం లో ఉంచింది, పట్టింది, తిప్పుకుంటుంది. అది అందమో, ధనమో, అవసరమో, మోహమో, వ్యామోహమో.

తెర తొలిగి, భ్రమ వదిలిన, తర్వాత తెలుస్తోంది, మనము పట్టుకున్నది అశాశ్వతమైనది అని. కానీ ఆరోజు, అలాంటివి చెయ్యాలి అనుకున్నా, శరీరం శక్తి మనసు సహకరించదు. మన చుట్టూ ఎవరూ సహకరించరు.

సద్గురువు ఏనాడు కోరికలు తీర్చరు, తీర్చకూడదు. ఆయన పని, నారాయణుడు లేదా ఈశ్వరుడు వైపు దోవ చూపెడటమే.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,993; 104 తత్వాలు (Tatvaalu) and views 224,928
Dt : 22-Dec-2019, Upd Dt : 22-Dec-2019, Category : General
Views : 993 ( + More Social Media views ), Id : 262 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 108 pradakshina
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content