పాటతో పరమార్ధం- జగమంత కుటుంబం నాది ఏకాకి జీవతం- చక్రం- ప్రభాస్, అసిన్, ఛార్మి, ప్రకాష్ రాజ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,722; 104 తత్వాలు (Tatvaalu) and views 225,931.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Jagamanta Kutumbam nadi - Chakram - Prabhas, Asin, Charmi, Prakash Raj

కాస్త వెనక ముందు, జీవితము లో ఏదో ఒక సమయములో, అందరమూ ఒంటరి వారిమే.
Either now or later, at some point in life, everyone will be alone.

అందుకే ఏనాటికైనా ఏకాకి జీవితం అయ్యే మనము, అరిషడ్వర్గం ను అష్టవ్యసనం ను వీడి, జగమంత కుటుంబం నాది అని అనాలి, అందరితో కలసి మెలసి నడవాలి, అందరి క్షేమం కోరాలి, అరిషడ్వర్గం బానిసత్వం వీడమని వేడుకోవాలి, చేయూతను ఇవ్వాలి చేయూత అందుకోవాలి.

That is why we, who will ever live alone in future, should leave Arishadvarg and Ashtavyasan, say that the family of the world is mine, walk together with all, seek the welfare of all, beg to leave the slavery of Arishavargam, give and receive a hand.

జగమంత కుటుంబం నాది అని నోటి మాట తో అనడం కాదు, సాక్ష్యం ఉండాలి. కనీసం ముదుసలి తల్లి తండ్రుల సేవ, సంస్కార పిల్లల పెంపకం, ఇతర నిస్వార్ధ మానసిక మరియు శారీరక సమాజ సేవలు, మన సాంపుల్ లిస్ట్ చూడండి.

It is not a word of mouth that Jagamanta family (family of the world) is mine, there should be evidence. At least old-age parents seva, raising samskar children, other selfless mental and physical community services, see our sample list.

లేదంటే భవిష్యత్ లో మరియు ముదుసలి తనములో, పంచభూతాల శిక్షణ (పాప ఖర్మ) కు పోవాలి.

Otherwise, in the future and in the old age, one should go for the training/ Sikshana (Sin result) of the Panchabhut.

సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం కూడా నావే అన్న సమతాస్తితిలో ఉండాలి. పాత్రత అర్హత ఎరిగి, అరిషడ్వర్గం అష్టవ్యసనం ను జయించే వారికి చేయూత ఇస్తే, మనల్ని జీవితానతము గుర్తుపెట్టుకుంటారు, దేవుడు సంతోషిస్తారు, మన బుద్దిని సరి చేస్తారు.

I should be on the same level that the family ocean (samsara sagaram) is mine and also the void of asceticism is mine. If we know the merit of the character and lend a hand to those who will conquer the Ashtavyasan of Arishadvarg, we will be remembered for the rest of their lives, God will be pleased, and our intellect will be corrected.

పదిమంది కోసం బ్రతికె, మన లాంటి వారి ఎందరో ఒంటరి బతుకుల కమ్మదనాన్ని, స్వభావాలను, కళ్ళకు కట్టినట్లుగా ప్రతిపదములో చూపింది ఈ పాట.

Live for ten people, this song shows the love and nature of many lonely people like us in the words.

జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని మీరూ నమ్మితే, మీరు దేవుడే సుమీ. దేవుడ్ని మనలో చూపించాలి. ప్రాపంచిక మోహములో, బయట కాదు, ఓ జీవుడా.

If you believe that Soul is God and Body is temple, then you are God. God must be shown within us. In worldly lust, not outside, O living being.

ఒంటరినై, ప్రతినిమిషం, కంటున్నాను నిరంతరం సాక్షీభూతముగా, కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల, చలనాన కనరాని, గమ్యాల కాలాన్ని, ఇంద్ర జాలాన్ని, ప్రాపంచిక మాయను అని చెప్పే ధైర్యం ఎంత మందికి ఉంది?

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఒంటరిగా ఉన్నా, జంటగా ఉన్నా, సంసార సాగరం నాదె, సన్యాసం శూన్యం నావే అనే త్రికరణ శుద్ది ఎంత మందితో ఎన్ని సాధనలతో ఎన్ని జన్మలతో మనకు వస్తుంది?

మన ముదుసలి తల్లి దండ్రులను మన పిల్లలుగా లాలించాలి, పాలించాలి. ఇతరుల కష్ట సుఖాలు వినాలి, ఓదార్పును ఇవ్వాలి నిస్వార్ధముగా.

We should cherish and care our old parents as our children. One should listen to the hardships and pleasures of others and give comfort selflessly.

తెలుగు ఆధ్యాత్మిక గురువులు వేమన ఎప్పుడో చెప్పారు, ఉల్లమందు ఉన్న బ్రహ్మము చూడుడీ అని. రాఘవేంద్ర స్వామి, బ్రమ్మం గారు అదే చెప్పారు.

The Telugu spiritual guru Vemana once said that - Find God in our heart. Raghavendra Swamy and Veera Brammam said the same.

మరి ఇకనైనా, ఆచరణలో చూపుదామా? అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదామా? పంచభూతాల శిక్షలకు తప్పించుకుందామా ముందుచూపుతో?

And now, let's show it in practice? Shall we leave the slavery of Ashtavyasan and Arishadvarg? Can we escape the punishments of the Panchabhutas with foresight?

జగమంత కుటుంబం నా.ది, ఏకాకి జీవితం నా.ది 2
సంసార సాగరం నా.దె, సన్యాసం శూన్యం నా.వే. ||జగమంత||

Jagamantha Kutumbam Naadi, Ekaaki Jeevitham Naadi 2
Samsaara Saagaram Naade, Sanyaasam Shoonyam Naavele ||Jagamantha||

**కవినై, కవితనై, భార్యనై.. భర్తనై.
కవినై.. కవితనై, భార్యనై.. భర్తనై
Kavinai Kavithanai, Bhaaryanai Bharthanai 2
మల్లెల దా.రిలో.., మంచు ఎడా.రిలో...
మల్లెల దా.రిలో మంచు ఎడా.రిలో
పన్నీటి జయగీతా.ల, కన్నీటి జలపాతా.ల
నాతో.. నే.ను అనుగమిస్తూ, నాతో.. నే.నే రమిస్తూ..

ఒంటరినై, అనవరతం, కంటున్నా.ను నిరంతరం
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని
రంగవల్లుల్నీ , కావ్య కన్యల్ని, రాగ పిల్లలని

జగమంత కుటుంబం నా.ది, ఏకాకి జీవితం నా.ది

**మింటికి కంటిని నే.నై., కంటను మంటను నే.నై 2
మంటల మాటున వెన్నెల నే.నై, వెన్నెల కూతల మంటను నే.నై.

రవినై, శశినై, దివమై, నిశినై
నాతో.. నేను సహగమిస్తూ, నాతో. నేనే. రమిస్తూ..

ఒంటరినై. ప్రతినిమిషం, కంటున్నా..ను నిరంతరం
కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల,
చలనాన కనరాని, గమ్యాల కాలాన్ని,
ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నా.ది, ఏకాకి జీవితం నా.ది
జగమంత కుటుంబం నా.ది, ఏకాకి జీవితం నా.ది

**గాలి పల్లకి, లో.న తరలి నా., పా.ట పాప ఊరే.గి, వెడలె

గొంతు వా.కిలిని, మూ.సి మరలి తను, మూగబో.యి, నా. గుండె మిగిలె

నా హృదయమే., నా. లో.గిలి.

నా హృదయమే.., నాపాటకితల్లి..

నా హృదయమే...., నాకు ఆ.లి
నా హృదయములో., ఇది ఆత్మ జ్యోతి

జగమంత కుటుంబం నా.ది, ఏకాకి జీవితం నా.ది
జగమంత కుటుంబం నా.ది, ఏకాకి జీవితం నా.ది

Actor : Prabhas / ప్రభాస్ , Actress : Asin / ఆసిన్ , Charmi / చార్మి , Music Director : Chakri / చక్రి , Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల , Singer : Shri / శ్రీ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,722; 104 తత్వాలు (Tatvaalu) and views 225,931
Dt : 24-May-2023, Upd Dt : 24-May-2023, Category : Songs
Views : 373 ( + More Social Media views ), Id : 1763 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Jagamanta , Kutumbam , nadi , Chakram , Prabhas , Asin , Charmi , Prakash , Raj
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content