Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Yekkadi Maanusha Janmam(Annamayya Sankirtana) - Eakam - Aberaam Varma, Tanikella Bharani, Swethaa Varma పాటతో పరమార్ధం - ఎక్కడి మానుష జన్మం బెత్తిన(అన్నమయ్య సంకీర్తన) - ఏకమ్ - అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతా వర్మ*
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - 4-Aug-2024
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
మనము చిత్తశుద్ది లేక, మానసిక నియంత్రణలేక, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, పయనిస్తూ దేవునికి దూరం అవుతున్నాము అని ఈ అన్నమయ్య సంకీర్తన Annamayya Sankirtana చెపుతున్నది. సినిమాలో పాటకన్నా, మనము భిన్నముగా భక్తి తో ఆత్రతతో కన్నీరు తో పాడిన పాటగా ప్రయత్నం చేసాము.
Eakam is a 2021 Telugu-language philosophical fiction film that explores the idea of unity through the lens of five people representing the elements of nature:
ఏకం అనేది 2021లో విడుదలైన తెలుగు భాషా తాత్విక కల్పిత చిత్రం, ఇది ప్రకృతి మూలకాలను సూచించే ఐదుగురు వ్యక్తుల లెన్స్ ద్వారా ఐక్యత ఆలోచనను అన్వేషిస్తుంది:
Plot: The film follows five people from different backgrounds as they search for their place in life and discover the bond that connects all life. The five characters represent the elements of nature: earth, fire, wind, water, and sky.
కథాంశం: విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో తమ స్థానాన్ని వెతుకుతున్నప్పుడు మరియు అన్ని జీవితాలను కలిపే బంధాన్ని కనుగొన్నప్పుడు ఈ చిత్రం అనుసరిస్తుంది. ఐదు అక్షరాలు ప్రకృతి మూలకాలను సూచిస్తాయి: భూమి, అగ్ని, గాలి, నీరు మరియు ఆకాశం.
ఎక్కడిది ఈ మానుష జన్మం, దానివలన ఫలమే మున్నది దేవా? పూర్తిగా నిన్నే నమ్మితి, నీ చిత్తంబికను అంటే, మా మనసు మీకు అర్పించాము.
కానీ మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను యింద్రియ భోగము, మాధవ నీ మాయ. అంటే ఇవన్నీ మాత్రం, ప్రాపంచిక బ్రమలు లో పడి, మానసిక నియంత్రణ లేక, మరువలేకపోతున్నారు. కానీ తేలికగా మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము, మాధవ నీ మాయ. అహా మంచి వాటిని స్తిరముగా వదిలిపెట్టి, అశాశ్వతమైన వాటికోసం పరుగులు తీస్తున్నాము.
అంతేగాక, విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి యాసలు, విష్ణుడ నీమాయ. చూడండి, మన మానసిక బలహీనతను, మాయ అని ఎంత అందముగా చెప్పుకుంటున్నామో. అది మాయ అని తెలిసినా విడువము. కానీ వీటిని వదులు తాము - విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును, విష్ణుడ నీమాయ. అది విష్ణు మాయ కాదు, మానవ కల్పిత మాయ. దానిని మనమే జయించాలి మిత్రమా?
మా మానసిక బలహీనతతో అజ్ఞానముతో, తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధముల, తగులను మోక్షపు మార్గము, తలపున యెంతైనా? అని ఆ దేవుని వేడుకోవాలి.
అగపడి శ్రీ వేంకటేశ్వర, అంతర్యామివై, నగి నగి నను నీవేలితి, దేవుడా మానసిక నియంత్రణ సాధనతో మీ అండతో స్తిరముగా నిలబడితే, నాకా యీమాయ? నన్ను ఈ మానవ కల్పిత మాయ అశాశ్వత ప్రాపంచిక బ్రమలపై, ఏమి చేయగలదు?
+ + +
ఎక్కడి మానుష జన్మం, బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి, నీ చిత్తంబికను నీ చిత్తంబికను || - 2
మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము, మాధవ నీ మాయ.. - 2
మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము, మాధవ నీ మాయ.. || - 2 ||ఎక్కడి మానుష||
విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు, విష్ణుడ నీమాయ.. 2
విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును, విష్ణుడ నీమాయ.. || - 2 ||ఎక్కడి మానుష||
తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము, తలపున యెంతైనా..|| - 2
అగపడి శ్రీ వేంకటేశ్వర, అంతర్యామివై
నగి నగి నను నీవేలితి, నాకా యీమాయ.. ||- 2 ||ఎక్కడి మానుష||
Cast: The film stars Aberaam Varma, Tanikella Bharani, Swethaa Varma, Aditi Myakal, Kalpika Ganesh, Dayanand Reddy, and Laxman Meesala.
తారాగణం: ఈ చిత్రంలో అబెరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతా వర్మ, అదితి మైకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి మరియు లక్ష్మణ్ మీసాల నటించారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,202; 104 తత్వాలు (Tatvaalu) and views 266,140
Dt : 11-Nov-2024, Upd Dt : 11-Nov-2024, Category : Songs
Views : 110
( + More Social Media views ), Id : 2169
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Song Spirit ,
Yekkadi Maanusha Janmam ,
Eakam ,
Aberaam Varma ,
Tanikella Bharani ,
Swethaa Varma
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments