వేటపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణి మరియు ఎస్సై ప్రమోషన్ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,369; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

1. కోవిడ్ 19 లో భాగంగా మార్చి 23 నుండి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధి లోని, ప్రజల కదలికలను నిలువరించుటకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ, విధులు నిర్వర్తిస్తూ ఉన్న వేటపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఈ రోజు అనగా తేది 04.05. 2020 న చీరాల రూరల్ సి.ఐ. వెంకటేశ్వర్లు మరియు వేటపాలెం యస్.ఐ. వి. అజయ్ బాబు గార్లు అభినందించారు మరియు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు.

వేటపాలెం పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది అందరు, వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలు లాక్ డౌన్ విధులలో పాల్గొంటున్న, వేటపాలెం పోలీస్ సిబ్బంది హోం గార్డు నుండి ఏ ఎస్సై స్ధాయి వరకు, గ్రామ మహిళా పోలీస్ మరియు పారా పోలీస్ సిబ్బందికి, మొత్తం 70 మందికి, ఒక్కొకరికి ప్రతిదీ 1 కేజీ చొప్పున మినుములు, కందిపప్పు, కారం, బొంబాయి రవ్వ, పచ్చళ్ళు మరియు శనగ పిండి ని అందచేసారు.

దీనికి, దేశాయిపేట కు చెందిన, సజ్జ శివ శంకర్ రావు గారు సహాయము చేసారు.

2. వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న, బత్తుల ప్రసాద్ గారు, ఎఎస్‌ఐ -683 సబ్ ఇన్‌స్పెక్టర్‌ గా, పదోన్నతి పొందారు. గుంటూరులో తన ప్రీ-ప్రమోషనల్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేశారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గుంటూరు, ఆదేశాల ప్రకారం సి. నం 2016 / ఎ 1/2020. తేదీ. 06.04.2020 .

సిఐ మరియు పోలీసు సిబ్బంది అందరూ, ఎఎస్ఐ నుండి సబ్ ఇన్‌స్పెక్టర్‌ గా పదోన్నతి పొందిన, ఎఎస్ఐని సత్కరించారు, వారి సేవలను కొనియాడారు.  
Photo/ Video/ Text Credit : Koti Veeraiah Ch., Vetapalem
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,369; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399
Dt : 05-May-2020, Upd Dt : 05-May-2020, Category : News
Views : 1744 ( + More Social Media views ), Id : 534 , City/ Town/ Village : Vetapalem , State : AP , Country : India
Tags : vetapalem police station , chirala rural ci venkatesvarlu , sajja siva sankar , si ajay babu , battula prasad , asi to si promotion

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content