పోటీ దారుల ను, వారి అనుకూల వర్గాన్ని ఒప్పించి, మనసు గెలిచి, అందరి వారుగా? - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,274,950; 90 తత్వాలు (Tatvaalu) and views 175,308.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గౌరవ తానా తెలుగు సంఘ, కాబోయే అధ్యక్షులు పోటీలో ఉన్న నిరంజన్, నరేన్, శ్రీనివాస్ గార్లకు నమస్కరించి వ్రాయునది,

ప్రపంచ నలుమూలలా ఉన్న, తోటి తెలుగు వారును గౌరవిస్తూ, సొంత సంఘ సభ్యులను గౌరవిస్తూ, అన్ని సంఘాలు ఆహ్వానించే తెలుగు నేల పై ఉన్న అన్ని పార్టీల అధిష్టానాలను గౌరవిస్తూ, మీరు 19 ప్రశ్నలకు మీ గౌరవమైన జవాబులు, తెలుగు వాట్సాప్ మాటలలో గానీ, గొంతు ఆడియోలో గాని, వీడియోలో గాని ఇస్తారని ఎదురుచూస్తున్నాము. link.

మన తెలుగు తేజాల జవాబులు చూడాలని, ఆత్రముగా, తెలుగు నేల ప్రజలు చూస్తున్నారు. మీరు బయటకు చెప్పకుంటే, మీడియా ఎదో ఊహించి రాసుకునే, అవకాశం మీరే కల్పిస్తున్నారు. ఆ తర్వాత మీరు మీడియాను తప్పు పట్టే అవకాశం లేదు. చిన్న మీడియా మమ్మల్ని అగౌరవపరచినా ఇబ్బంది లేదు, ఇన్ని రోజులు గమ్ముగా ఉండి. మీ అనుకూల వర్గ మీడియా వీడియోలో నైనా, వీటికి జవాబులు చెప్పి, ఆ వీడియోలను లింక్ లు దయచేసి పంపగలరు.

ప్రజాస్వామ్యాన్ని, అలాగే తెలుగు మర్యాదను గౌరవిస్తూ, అందరినీ కలుపుకుంటూ, దాపరికము అహంకారము కుట్ర మోసము చాటు వ్యవహారాలు ముఠా సంస్క్రుతి లేని, మంచి సాంప్రదాయాన్ని పాటిస్తారని పాటించాలని, మీకు సవినయముగా కోరుతున్నాము.

రేపు ఒకరు గెలిస్తే, రెండో వారిని, పూర్తిగా తొక్కెస్తారు, అనుమానం లేదు. లేదా, ఇద్దరూ కలసి పోయి, గత తప్పులు మోసాలు ద్రొహాలను పూర్తిగా సమాధి చేస్తారని, అందరూ అనుమానపడుతున్నారు భయపడుతున్నారు.

దయచేసి ప్రచార పర్యటనలు, జనాలను కలవడాలు మానేసి, కుటుంబ సభ్యుల, తోటి సంఘ సభ్యుల, అలాగే మిత్రుల ఆరోగ్యాన్ని కాపాడగలరు, అని మొదటి నుంచి విన్నవిస్తున్నాము. కరోనా గురువును గౌరవించగలరు.

వీకెండ్ దొరకరని, ఇప్పుడే మరలా గుర్తు చేసే ప్రయత్నము చేస్తున్నాం, మన్నించాలి. మీకు తీరిక దొరకదనే, జవాబులు మీకు ఇచ్చే ఇతర దోవలు కూడా విన్నవించాము. సహ్రుదయముతో, మా ప్రజలకు, ఆరోపణల మీద, మీ ఆణిముత్యాల వంటి జవాబులను ఇచ్చి, మన సంస్థపై వస్తున్న ఆరోపణలకు, ముగింపు పలుకుతారని, వన్నె తెస్తారని, తెలుగు రక్షకులుగా మిగతా సంస్థలకు ఆదర్శముగా ఉండాలని, మిమ్ము మీ వెనక ఉన్న కధా నాయకులను, మరీ మరీ ప్రార్ధిస్తున్నాము. దయచేసి రాబోయే కధనాలు లేకుండా చేయగలరు.

2 వ భాగం

చీరాల జిల్లా రావాలని, ఊరికి అన్యాయం జరిగిందని, మా ఇంట్లో మరియు ప్రయాణాలు చేసి మా స్నేహితులు బంధువుల ఇంట్లో హోటల్లో, గంటలు గంటలు గొంతు చించుకుని అరిచి, కన్నీళ్ళు పెట్టుకుంటే, ఉచిత భోజనాలు పలహారాలు తింటూ, మా స్నేహితులు మా వర్గం ఈలలు చప్పట్లు కొట్టి, ఉత్సాహపరిస్తే, చీరాల జిల్లా వచ్చేస్తుందా?

అది చేత కాని వారు చేసే పని. మేము అరవాల్సింది, చాటుగా మా అనుకూల బంధువులు స్నేహితులు ముందు కాదు. ఎందుకంటే వాళ్ళు మా అనుకూల తానులో ముక్కలే కదా? లేకపోతే మా కంటే ముందే అరిచేవారు కాదా?

మేము అరవాల్సింది, బయట నాయకుల ముందు, బయట ప్రత్యర్ధి పోటీ దారుల ముందు. మా మాటలకు ప్రత్యర్ధి అనుకూల వర్గం కూడా, శభాష్ బాగా అడిగారు రా, చీరాల కే న్యాయం చేయడం కరెక్ట్ అనాలి.

అప్పటికీ చీరాల జిల్లా రాకపోవచ్చు. కానీ పోరాడి ఓడినా, బయట ప్రత్యర్ధులతో తలపడాలి, అందరి ముందు. చవటలా తెలిసిన వాళ్ళ ముందు కాదు, ఉపయోగము లేని కుప్పి గంతులు.

అందుకే మా ప్రయత్నం గా, మా ఎమ్మెల్యేని అడుగుతూ, ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అధికారులు అందరికీ విన్నపాలు పంపాము, మరలా మరలా గుర్తు చేస్తూనే ఉన్నాము, ప్రజల తో కలిపి.

ఎదగని పసి పిల్లలుగా, ఇప్పుడు భారత్ లో డిగ్రీ లు చదువుకుని, విదేశీ గడ్డ ను చేరి, తగిన అనుభవం సంపాదించి, వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న, అమెరికా తానా ఎన్నికల అధ్యక్ష పోటీ దారులు, చేస్తున్నది ఏమిటి? పై ఉదాహరణ తో పోల్చి చూడండి?

నేరుగా పోటీ దారుల ముందు అరవకుండా, వారిని మరియు వారి అనుకూల వర్గాన్ని ఒప్పించి, గొప్పవారుగా అందరివారుగా నిలవకుండా, అందరి మనసు గెలిచే ప్రయత్నం చేయకుండా,

చాటుగా తమ ముఠాలను వేసుకుని, ఊళ్ళు ఖర్చుతో తిరుగుతూ కరోనా పెంచుతూ, తమ అనుకూల వర్గాల దగ్గర, మేము మార్పులు చేస్తామని, గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను నిందిస్తూ, ఫలహారాలు విందులు వినోదాలు చప్పట్లు ఈలలతో, సాధించేది ఏముంది? వస్తే ఆ చాటు ముఠా లేదంటే, ఈ మాటు ముఠా, అంతే గదా?

ఈ విధముగా చేయడము వలన, అందరినీ కలుపుకుని ఒప్పించే మెప్పించే, మంచి ఉత్తమ నాయకుడు వస్తాడా? గొప్ప వ్యక్తి జనానికి తెలుస్తాడా? ఉత్తముడు రాడు. ఏ సంఘ నాయకుడు చరిత్ర చూసినా ఏమ్మున్నది గర్వ కారణం, సమస్త జీవితం గాడ్ ఫాదర్ ల బానిసత్వం, అని ఎవరో అన్నారు పెద్దలు.

సంఘాలు పార్టీలు మంచివే, వాటి పనులు మంచివే. కానీ కొంతమంది నాయకుల వలన, అవి బ్రష్టుపడతాయి. కాబట్టి, మనం విమర్శిస్తుంది లేదా మంచి దోవ చెపుతుంది, వర్గ అవకాశ అవసర నాయకులకు మాత్రమే.

ఇది ఒక్క తానా అనే కాదు, మిగతా తెలుగు సంఘాల లోను, ఇదే బానిసత్వం ఇదే చాటు వ్యహరాలు, నీ కీ పదవి మాకు ఆ పదవి, ముఠా గా దోచుకో పంచుకో పెంచుకో. తెలుగు నేల తేజాలు అంతరిక్షానికి వెళ్ళినా, మన కుల వర్గ అవకాశ అవసర పద్దతులు మానవు, కొనసాగిస్తూనే ఉంటాయి. ఇంకా ఎన్ని వినాలో ఎదురు చూద్దాం, నిజమైన మార్పుకోసం. నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా బద్దలు అవుతుంది.

ఇన్నాళ్ళు 19 ప్రశ్నలకు జవాబు రాలేదంటే నే, ప్రజాస్యామ్యం అన్నా, ఇతర వర్గాలు మీడియా అన్నా, మంచి మర్యాద అన్నా, ఇతర తెలుగు వారి నిజమైన సేవ అన్నా, వీరికి పట్టవు అవసరము లేదు, అని సగము నిరూపణ అయ్యింది కదా? ఆత్మాభిమానం గలవారు ఉత్తములు, ఇన్ని రోజులు గమ్ము గా ఉంటారా? కేవలము తమవారి సేవ చేసుకుంటూ తరిస్తూ, ఇతరులకు కూడా కాస్త విదిలిస్తే సరిపోతుంది అంతేనా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,950; 90 తత్వాలు (Tatvaalu) and views 175,308
Dt : 08-Apr-2021, Upd Dt : 08-Apr-2021, Category : America
Views : 519 ( + More Social Media views ), Id : 1082 , Country : USA
Tags : tana , election , competitors , pro , folks , win mind , everyone guy , naren , niranjan , sreenivas

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content