గెలుపు ఎవరిది, గత ఆరోపణలు ఏమిటీ, ఎవరు దేని కోసం పోరాటమో పోలికలు - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,097,400; 104 తత్వాలు (Tatvaalu) and views 237,848.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ప్రవాస (విదేశీ) స్థానిక తెలుగు పౌరులు
* గ్రీన్ కార్డ్ తో, అటొక కాలు ఇటొక కాలు
* రాష్ట్ర రాజకీయ నాయకులు, ఆ స్వార్ధ సంఘాల
* ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు
* బయట వారి వీడియో మాటల ద్వారా
* గెలుపు ఫలితాలు - పెరుగుట విరుగుట కొరకే, కొత్త నీరు
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ఏవండీ తానా కొత్త నాయకుల లో ఎవరు గెలిచారు? వారి పై వచ్చిన ఆరోపణల వీడియోలు ఏవి? అలాగే కొత్త నాయకులలో, ఎవరు దేని కోసం పోరాటమో, పోలికలతో చెప్పలేదు, తిరుపతి ఎంపీ అభ్యర్ధులకు చెప్పిన విధముగా. రేపు ఎవరో ఒకరు గెలిచాక, మనకు ఐడియా ఉంటుంది కదా.

జవాబు -

దయచేసి ముందు కధనాలు కూడా చదవండి, పూర్తి అవగాహన కొరకు.

అమెరికా లేదా ఏ దేశ, ఏ తెలుగు సంఘాల నాయకులు అయినా, మన కన్నా, కాస్త నీతి నిజాయితీ నిబద్దత గా ఉండాలి.

ప్రవాస (విదేశీ) స్థానిక తెలుగు అమెరికా పౌరులు, తెలుగు సంఘ ప్రెసిడెంట్ అయితే, ఇన్ని సమస్యలు రావు, జాగ్రత్త గా ఉంటారు, చట్టాలతో తల నొప్పి అని, మన రాష్ట్ర పదవుల పై పైరవీల పై ఆశలు ఉండవు, ఉన్నా కూడా, చాలా తక్కువ ఉంటాయి.

కానీ గ్రీన్ కార్డ్ తో, అటొక కాలు ఇటొక కాలు వేస్తూ, పదవి ప్రచారం వ్యాపారం స్వార్ధం తో చేద్దాం, అనుకున్న వారితోనే అసలు సమస్యలు తలనొప్పి.

మన రాష్ట్ర రాజకీయ నాయకులు, ఆ స్వార్ధ సంఘాల నాయకులను దూరంగా ఉంచాలి, తమ లేదా తమ వారి పదవుల కోసం పైరవీలు చేస్తే.

ఏదైనా ఎన్నారై సమస్యలకు సహాయము చేయడం వేరు, పదవుల పైన ఆశతో తిరగడం, మచ్చిక చేసుకోవడానికి నటిస్తూ మన రాష్ట్ర నాయకులను పిలవడం వేరు.

జన్మభూమి కోసం విరాళం ఇవ్వడం వేరు, ఎమ్మెల్యె ఎంపీ లేదా అప్పాయింటెడ్ పదవులకై అర్రులు చాచడం వేరు.

వారి స్వప్రయోజనాల కోసం మన నాయకుల వెంట పడితే, మన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండే నిబద్దత గలిగిన స్థానిక నాయకులను వదిలి, ఎన్నారై నాయకులకు వారి బంధువులకు విలువ ఇచ్చి, పదవులు ఇవ్వడం అనవసరం అని స్థానిక నిబద్దత గల నాయకుల వాదన.

చంద్రన్న, విదేశీ ఎన్నారై సంఘాలకు ఎక్కువ విలువ ఇచ్చి, తలనొప్పి తెచ్చుకుని, చేతులు కాల్చుకున్నారు.

ఈ 2 ఏళ్ళలో, జగనన్న తెలుగు సంఘాల వారిని, చాలా వరకు దూరం పెట్టినట్లే, అని జనాలు అంటున్నారు. ఒకవేళ కరోనా జాగ్రత్త ల తో గమ్ముగా ఉండి ఉంటే, మిగతా 3 ఏళ్ళూ చూడాలి.

*** ఆరోపణల వీడియోలు *** :

నిజమే, 3 వైపులా వీడియోలు వస్తే పెడదాము అని ఆగితే అప్పుడు, ఆ విషయం పక్కకు పోయింది.

ఇప్పుడు ఈ లింక్ లో వీడియోలు ఉన్నాయి చూడండి, వారు ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు అవి, ఎంత వరకు నిజాలో, వారికే తెలియాలి. ఇంకా మీకు వేరేవి తెలిసి ఉంటే, పంపగలరు, ఇక్కడనే కలుపుదాము.

ఎక్కువ పాత వర్గం వైపే ఉన్నాయి మరి, ఎక్కువ రోజులు పాలించారు కాబట్టి. తప్పు ఒప్పులు మీరే నిర్ణయం చేసుకోండి.

ఇప్పుడు దాదాపు గా ఓటింగ్ పూర్తి అయ్యింది ఫలితాలు వచ్చింది కాబట్టి, ఎవరికీ పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చు.

*** దేని కోసం పోరాటం, పోలిక *** :

ముగ్గురు తో మాట్లాడి, వారి మనస్తత్వం తెలుసుకుందాము అని, మన ప్రతినిధి ప్రయత్నం చేస్తే, ఒకరు మాట్లాడారు, ఇంకొకరు రింగ్ మరియు సందేశం ఇచ్చి గమ్ముగా ఉన్నారు. ఇంకొకరు అసలు పై వారి ఆదేశం లేదని గమ్ముగా ఉన్నారు.

ఆ ముగ్గురు లేదా నాయకులు అధికారులు మాట్లాడినా కూడా, వ్యక్తిగత విషయాలు మనం బయటకు చెప్పము ఎలాగూ, వారి ప్రైవసీని కాపాడాలి కాబట్టి.

బయట జనాలతో విన్నా లేదా వారి ఫేస్బుక్ లో వారి వీడియో మాటల ద్వారా అర్ధం అయిన విషయాలు టూకీగా, 2 మాటలలో చెప్పుకుందాం.

* కొడాలి - పాత వారిని కూడా కలుపుకుని ముందుకు వెళదాం, అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని, అని వీరి వాదన. వీరికి కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్‌, సతీష్ వేమన లాంటి పాత వర్గ నాయకులు అండ. గతం మరచి, నిందిస్తున్నారు అని వీరు అంటారు కొత్త వర్గాన్ని.

మన పోలికకు, పాత ఎంటీయార్ గారి తెలుగు దేశం అనుకోండి. మరి చంద్రన్న రావాలి అంటే, రామన్న వెనక్కి పోవాలి కదా.

* నిరంజన్ - పాత వారి నీడ వద్దు, వారి అరాచకాలు వద్దు. గతం గతహా, కొత్త తరం వర్గం తో, సొంత నిర్ణయాల తో, ముందుకు వెళ్ళి, మన తానాను కాపాడుదాం, పాత వర్గం వాసనలు పెత్తనం లేకుండా, అని వీరి వాదన. కొత్త నాయకులు లావు, జయ తాళ్ళురి వర్గం వీరికి అండ.

పోలికకు, మన చంద్రన్న అనుకోండి, అంత కొత్త గా ఉండాలి, పాత వాళ్ళ వేలు ఉండకూడదు. రోజులు మారేటప్పుడు, కొత్త నాయకత్వం కొత్త నీరు రావాలి కదా అని వీరి వాదన.

* గోగినేని - అసలు కొత్త పాత వర్గాలు, ముఠాలు ఏమిటి? వర్గ రాజకీయాలు వదలి, వ్యక్తులు గా కలసి సాగుదాం. అసలు ఏ వర్గానికి ప్రాధాన్యత వద్దు. అందరమూ కలసి ఉండాలి, మనమే సొంతముగా నిర్ణయాలు తీసుకోవాలి.

బాలెట్ కలెక్షన్ వద్దు అని, అంతా మార్పులు తెచ్చి, పెత్తం దార్లు ఎవరూ ఉండ కూడదని వీరి వాదన. వీరి వెనుక ఏ వర్గం లేదు. జూనియర్ ఎంటీయార్ లేరు కాబట్టి, మన పవన్ లాగా పూర్తి గా మార్పు తెద్దాము లాగా అని అనవచ్చును.

అని జనము అనుకుంటున్నారు. మరి మీకు తెలిసిన విషయాలు ఉంటే చెప్పగలరు.

మరి తానా సభ్యులు ఎవరిని ఎన్నుకున్నారో, త్వరలోనే తెలుస్తుంది. ఇంకెన్ని వింతలూ విడ్డూరాలు వినాలో, ఆగి చూద్దాం.

*** గెలుపు ఫలితాలు ***:

గెలిచిన వారికి అభినందనలు, పోరాడి ఓడిన వారికి జేజేలు.

పెరుగుట విరుగుట కొరకే, కొత్త నీరు రావాలి పాట నీరు పోవాలి అని పెద్దలు చెప్పినది వాస్తవము.

ఏ ఎన్నిక అయినా, ఏకగ్రీవము అంటే, బానిసత్వమే. ఎన్నికలు గొడవలు లేకుండా ఖర్చులు మిగులుతాయి అంటే, అమెరికాలో ఎన్నికలు ఎందుకు? ట్రంప్ బైడెన్ చెరో 2 ఏళ్ళు పాలిస్తే సరిపోదా?

అలాగే మోదీ, రాహుల్ 2.5 ఏళ్ళు సర్దుకుంటే పోదా? అలాగె మన చంద్రన్న, జగనన్న, పవనన్న పంచుకుంటే, ఇక ఖర్చు గొడవలు ఎన్నికలు ఉండవు కదా?

మరలా గెలుస్తామో లేదో అని భయము ఉంటేనే, మనకు అభివ్రుద్ది లేదు. ఇక ఎన్నికలు లేకుండా, పంచుకుని దోచుకుంటే, ఇక ప్రజలను పట్టించుకుంటారా?

పోరాడి ఓడినా తప్పులేదు. వీర మరణం, శాస్త్ర సమ్మతమే. కానీ అసలు పోరాడను ప్రయత్నం చేయను అంటే మాత్రం, అది ధర్మ ద్రోహం.

* నిరంజన్ గారు గెలిచారు వచ్చిన ఓట్లు 10866, మన బొమ్మ లో మొదటి చిత్రము వారిదే, చూడండి, భగవంతుని విచిత్రము.

* కొడాలి నరేన్ గారికి 9108 ఓట్లు, గోగినేని కి 1006 ఓట్లు. శభాష్ మీ పోరాట పటిమ బాగుంది. ప్రయత్నము చేశాము, కనీసం నాయకులు గా మిగిలాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,097,400; 104 తత్వాలు (Tatvaalu) and views 237,848
Dt : 30-May-2021, Upd Dt : 30-May-2021, Category : America
Views : 896 ( + More Social Media views ), Id : 1182 , Country : USA
Tags : tana , election , win , result , accusations , comparison , fight , gogineni , kodali , niranjan

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content