అమెరికా తెలుగు సంఘం లేదా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, ఏకగ్రీవం, అబద్ధాలు మోసం? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1113 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

ఏవండీ, అమెరికా తెలుగు లేదా ఏ సంఘం లేదా మన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు లేదా పార్టీ లో, ఏకగ్రీవ ఎన్నికలు, అబద్ధాలు మోసం అనవచ్చునా?

మంచి విలేఖరి లేదా పత్రిక, తన ఆలోచన లను, నిజాలుగా, జనం మీద రుద్దరు లేదా రుద్దదు. ఎక్కువ సంఖ్య ఉన్న, మోహా రజో తామస గుణం కలవారే, అలాంటి తప్పుడు మాటలను నమ్ముతారు, ఆనందము లేదా కోపముతో ఊగిపోతారు.

అందుకే మాలాంటి వారికి, తక్కువ సంఖ్యలో, సాత్వికుల అండ మాత్రమే ఉంటుంది.

ఆనాడు కృష్ణుని కి 7 అక్షౌహిణులే అనుకూలం, కానీ వ్యతిరేకంగా 11 అక్షౌహిణులు, పెద్ద సంఖ్య కదా? అసలు యుద్ధం కు, దాని ఫలితాలు అనుభవించే వారికి, కృష్ణుని ప్రయత్నం కు, సంబంధం ఉందా? లేదు కదా.

మా ప్రయోజనం, మా ప్రయత్నం కూడా అంతే, 4 పార్టీలు అన్ని పార్టీలు అన్ని సంఘాలు మనవే, అంటే దాని వెనక ఉన్న అందరూ జనాలు మనవారే అంటే మీరు మేమే కదా.

ఉత్తమ విలేఖరి, ఎప్పుడూ ప్రశ్నలు తో ఓటరు ను లేదా వ్యక్తిని, సొంతంగా ఆలోచింప చేస్తారు. ఇప్పుడు మీరే ఈ కింది ప్రశ్నలు కు జవాబులను చెప్పి, ఏకగ్రీవం సాధ్యం అవుతుంది ఏమో చూడండి, ధన అధికార మోహ వర్గ బలవంతపు అంగీకారం తప్ప.

1. రోజూ మీ ఇంట్లో ఉదయం 5 కి లెగిచి, చెంబు నీళ్లు తాగి, పచ్చి కాకర రసం గ్లాసు తాగమని, అరగంట ధ్యానం చేయమని, ప్రేమతో సంవత్సరం చేపించ గలరా? మంచి అని తెలిసినా చేయము, విడాకుల కు కూడా పోతారు. కాని మంచి వినరు, ఏకగ్రీవంగా కదూ?

2. ఒకే ఇంట్లో కుటుంబములో, భార్య బీజేపీ సీనియర్ నాయకురాలిగా ఉంటే, కొడుకు లేదా భర్త వైకాపా తో పోటీ చేసిన విషయం, ఆంధ్రా లో 6 కోట్ల మందికి తెలుసా? భార్యా భర్తలు, తల్లి కొడుకుల మధ్య లో, ఏకగ్రీవం ఉందా?

3. ఈ 2 ఏళ్ళలో, తెదేపా లో పార్టీ గోడ దూకిన, ఇతర వర్గ ఎమ్మెల్సీ మహిళ ని రాజీనామా పట్టుబట్టి చేయించిన దాకా నిద్రపోలేదు. కానీ, తమ వర్గ ఎంపీలు ఎమ్మెల్యేలు ను మాత్రం, పక్క వారితో గోడదూకి తిరుగుతూ ఉంటే, నీతి నియమాలు సభ్యత సంస్కారం మరచి, చూడనట్లు వదిలేశారు. తెదేపా పాలిట్ బ్యూరోలో, అధిష్ఠానం లో, నీతి ఏకగ్రీవం ఉందా?

4. రాజీనామా చేయందే, నా పార్టీ లోకి ఎవరినీ రానివ్వను, అని జగనన్న ఓ పక్కన మొత్తుకుంటుంటే ఏళ్ళుగా, మంత్రులు దొంగ దోవలో, తెదేపా ఎమ్మెల్యేలు తో రాజకీయ సరసాలు నడపడం లేదా? వైకాపాలో, ఏకగ్రీవం ఉందా?

5. రాష్ట్రం కు అప్పులు వేల కోట్లు తగ్గించి, ఆదాయం వేల కోట్లు చేస్తామని, ఏ ఒక్క నాయకుని లో లేదా ఓటరులో అయినా, ఏకగ్రీవం ఉందా?

6. అసలు ఏకగ్రీవం ఉంటే, ప్రజాస్వామ్యం అవుతుందా? రాచరికం బానిసత్వం అవుతుంది. ఇరువురు పోటీతో, ప్రజా ధనం మిగులుతుంది అనేది పచ్చి మోసం, కాని, వారి సొంత పట్టు, అలాగే సొంత ధనం మిగులుతుంది అనేది నిజం. ఇరువురు పోటీ వద్దు అనేటప్పుడు, 3 ప్రాంతీయ పార్టీలు ఎందుకు, 2 జాతీయ పార్టీలు ఎందుకు, వారి మధ్యలో ఎన్నికలు ఎందుకు?

7. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మారతారు. కానీ ప్రాంతీయ పార్టీల కు అధ్యక్షుడు లేదా కుటుంబం మారుతుందా? వారి అనుచరులు వీరికి, వీరి అనుచరులు వారికి, బానిసత్వం ఒప్పుకుంటారా, అధికారంలో లేక పోతే? ఏకగ్రీవం అన్ని పార్టీల లోనే, అనుచరుల లోనే లేదు కదా?

8. అమెరికా తెలుగు లేదా ఏ సంఘ నాయకులు అయినా, ఏకగ్రీవం ఉంటే, ఇన్ని ముక్కలు చెక్కలు గా, ఊరుకో 3 సంఘాలు పుట్టుక వస్తాయా? ముందు కధనాలు చదివారు కదా.

ఇప్పుడు మీరు చెప్పగలరు, పైన చెప్పిన 8 పాయింట్లలో, ఎక్కడ అయినా ఏకగ్రీవం సాధ్యమా స్వచ్ఛందంగా? అది అసలు ప్రజాస్వామ్యం అవుతుందా?

జగనన్న అయినా, చంద్రన్న అయినా, ఇంకో అన్న అయినా, తెలుగు సంఘమైనా, తమిళ సంఘమైనా, తానా అయినా అటా అయినా నాట్స్ అయినా, ఏకగ్రీవ ఎన్నికలు అంటే మాత్రం, ఏదో తేడా ఉంటుంది కదా, పై ప్రశ్నలను బట్టి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1113 General Articles, 47 Tatvaalu
Dt : 31-Mar-2021, Upd Dt : 31-Mar-2021, Category : Politics
Views : 88 ( + More Social Media views ), Id : 1064 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , usa , america , association , andhra , panchayat , municipal , elections , consensus , lies , fraud
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content