Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. Telugu (or any mother tongue) words - Finger nerves that do not move for good, at least move for Mom gratitude?
తెలుగు (లేదా ఏదైనా మాతృభాష) పదాలు - మంచి కోసం కదలని వేళ్ళ నరాలని, తల్లి కృతజ్ఞతలు కోసం కదలిస్తావా!
To all soul mates, Gurus, Happy International Mother Language Day - 21st February. Telugu Language Day is 29th August.
ఆత్మ బంధువులు, గురువు లందరికీ, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు - 21 ఫిబ్రవరి. తెలుగు భాషా దినోత్సవం 29 ఆగష్టు.
On the occasion of International Mother Language Day, for more than a few years, we have been chasing people on WhatsApp, with namaskar/ praNam, to write at least two Telugu (or any mother tongue) words.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, ఏళ్ళ కు పైగా, కనీసం రెండు తెలుగు పదాలు రాయమని, దండాలు పెట్టి, బతిమాలి వాట్సాప్ లో, మొత్తుకుంటూ, జోరీగ లాగా వెంటపడుతూనే ఉన్నాము.
Once again we politely implore our Telugu people (especially children) to learn Telugu, speak Telugu, remember Telugu Gurus (Brahmam, Vemana, Raghavendra Swamy), write in Telugu, sing in Telugu.
మరలా ఇంకోసారి మన తెలుగు వారిని (ముఖ్యంగా పిల్లలను) - తెలుగును నేర్చుకోమని, తెలుగులో మాట్లాడమని, తెలుగు గురువు లు (బ్రహ్మం, వేమన, రాఘవేంద్ర స్వామి) ను స్మరించమని, తెలుగు లో రాయమని, తెలుగు లో పాడమని, సవినయంగా అర్ధిస్తున్నాము, వేడుకుంటున్నాము.
Betrayal of the mother tongue is backstabbing mother also. That is why family bonds and feelings are dried up, withered, blown away, like desert people, ungrateful rocks, uncultured, selfish people who are separated even though they are together, lonely people who are together without moisture in their hearts.
మాతృభాషా ద్రోహం, మాతృదోహం కూడా. అందుకే కుటుంబ బంధాలు, భావాలు ఎండిపోయి, ఇంకిపోయి, వీగిపోయి, ఎడారి మనుషులు లాగా, కృతజ్ఞతలు లేని రాతి బండలు గా, సంస్కార హీనులు గా, కలిసి ఉన్నా విడిపోయిన స్వార్థ పూరిత వారిలాగా, మనసు తడి లేని కలసి ఉన్న ఒంటరి బతుకులు, బతుకుతున్నాము.
If we keep on nurturing a culture that burns the raft after passing by, then eventually it catches up with us and gives us a taste of it, my friend, then there will be no one to save us.
ఏరు దాటాక తెప్ప తగలేసే సంస్కృతి ని, మనం పెంచి పోషిస్తూ ఉంటే, చివరకు అది మన వెంటే పడి, మనకు దాని రుచి చూపిస్తుంది మిత్రమా, అప్పుడు మనల్ని కాపాడేందుకు ఎవరూ ఉండరు.
For those without gratitude, there is no divine help. This is eternally true. Even now, let us give up the slavery of Arishadvarg and Ashtavyasan. Let's avoid panchabhut SikshaNa. Be respectful by children, at our old age, as gods.
కృతజ్ఞతలు లేని వారికి, దైవ సహాయం కూడా ఉండదు. ఇది నిత్యం సత్యం. ఇప్పుడు అయినా, అరిషడ్వర్గ, అష్టవ్యసన బానిసత్వం వదులుదాం. పంచభూత శిక్షణ తప్పించుకుందాం. పిల్లల దగ్గర, మన ముదుసలి వయస్సులో, దేవతలు గా గౌరవముగా ఉందాము.
Two Telugu words, at least accusing us, according to your intellect, you will write by moving rock heart? Whether it is here or a photo on paper, it seems that the nerves of the fingers that do not move for good, move for thanks to the mother who gave milk .
రెండు తెలుగు మాటలు, కనీసం మమ్మల్ని నిందిస్తూ అయినా, మీ బుద్ధి అనుసారం, బండ బారిన గుండె ను కదలించి, రాస్తావు కదూ? ఇక్కడ లేదా కాగితం మీద ఫోటో అయినా, మంచి కోసం కదలని వేళ్ళ నరాలని, పాలు ఇచ్చిన కన్నతల్లి, కృతజ్ఞతలు కోసం కదలిస్తావు కదూ.
International Mother Language Day is a worldwide annual observance held on 21 February to promote awareness of linguistic and cultural diversity and to promote multilingualism. Promoted by UNESCO (United Nations Educational, Scientific and Cultural Organization).
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్త వార్షిక ఆచారం. యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ద్వారా ప్రచారం చేయబడింది.
Please respect mother, mother tongue, local guru and write at least few words on social media or write on paper put photo. Please sing poems, sloka and songs in mother toung.
దయచేసి తల్లిని, తల్లి భాష ని, స్థానిక గురువును గౌరవించండి మరియు సోషల్ మీడియాలో కనీసం కొన్ని పదాలు రాయండి లేదా పేపర్‌లో పెట్టిన ఫోటోపై రాయండి. దయచేసి తల్లి భాష లో పద్యాలు, శ్లోకాలు మరియు పాటలు పాడండి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,415; 104 తత్వాలు (Tatvaalu) and views 253,853 Dt : 21-Feb-2021, Upd Dt : 21-Feb-2021, Category : General
Views : 1757
( + More Social Media views ), Id : 983 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
telugu ,
words ,
finger ,
nerves ,
good ,
gratitude ,
International ,
Mother ,
Language ,
Day Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments