తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు కోసం, హీన పరిస్థితులు భక్తుల అవస్థలు-పదవుల మత్తులో, తితిదే పాలకమండలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1490 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1525 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు కోసం, హీన పరిస్థితులు భక్తుల అవస్థలు - పదవుల నిద్ర మత్తులో, కరుణ సేవ లేని తెలియని, తితిదే పాలకమండలి

తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు, రెండో సారి జగనన్న పదవి ఇచ్చినందుకు, ఆయనకే చెడ్డ పేరు తెస్తే ఎలా? ఇదేనా కృతజ్ఞతలు చూపించే విధానం?

దేవుని సేవ ఇదే నా? మానవ సేవయే మాధవ సేవ అంటే అర్థం ఇదేనా? ఇది తెలియని వారికి, రాజకీయ ఆవాస పదవులు గా తితిదే మండలినా? link

రెండేళ్ల కు అందరికీ పదవిని మారుస్తూ, మిమ్మల్ని కూడా మార్చాలి కదా? అందుకే జగనన్న కు, మీరే బుద్ధి చెబుతున్నారా?

అదేమంటే తితిదే కు వ్యతిరేకంగా రాస్తే, కేసులు అంటారు. ఇక్కడ విలేఖరులు రాస్తుంది, భక్తి ముక్తి కరుణ దయ సేవ అంటే తెలియని అధికారులు మరియు రాజకీయ స్వార్థ తితిదే పాలకమండలి సభ్యుల, అలసత్వం నిర్లక్ష్యం లెక్క లేని తనం గురించి, ప్రత్యక్ష సాక్ష్య నిజాలు మాత్రమే.

అంతేగానీ, రాస్తుంది తిరుమల మరియు వెంకన్న గురించి కాదు కదా? దేవుని సుప్రభాతం, మంత్రపుష్పం, సూక్తాలు కూడా రాని వారిని తెలియని వారిని, కన్నతల్లి సేవ తెలియని వారిని, తితిదే పదవుల్లో ఉంచవచ్చునా? తగదునమ్మా అంటూ, మీరు అయినా, పాపం పెంచుకుంటూ, ఉండవచ్చునా?

భక్తుల సొమ్ము తో పదవులు సౌకర్యాలు ఆస్వాదిస్తూ, వారికే అన్యాయం చేస్తున్నారని, దేవుడు భవిష్యత్తు లో, మిమ్మల్ని అందరినీ శిక్షణ చేయరా?

రేట్లు పెంచితే మద్యం తాగరు అనేది, మన వైకాపా వాళ్ళ లాజిక్, అవునా? అలాగే భక్తుల్ని ఈ రకంగా టార్చర్ చేస్తే, తిరుమలకు రారనేది మనం అర్థం చేసుకోవాల్సిన, లాజిక్ నా? హిందూ దేశములో, హైందవ భక్తులను గౌరవించడం ఇదేనా?

తితిదే చరిత్రలో ఇంత దరిద్రమైన నిర్వహణ, ఎన్నడూ చూడలేదు అని, అందరూ ఆశీర్వాదం చేస్తున్నారు.

కర్ణాటక లో దేవాలయాలను, ప్రభుత్వ కబంధ హస్తాలు నుంచి తప్పిస్తాం అంటున్నారు అక్కడ నాయకులు. తితిదే ని, కేంద్రం నడిపితే బాగుంటుందా? మన వలన కావడం లేదు కదా? అందుకే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో గెలవాలని అందామా?

టీటీడీ ని సమూలంగా ప్రక్షాళన చేయాలి అంటున్నారు, భక్తులు.

పాపం చిన్నపిల్లలు, ఎండాకాలంలో సరైన వసతులు లేక, ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు.

తిరుమల వెంకన్న దర్శనాన్ని వ్యాపారం చేసిందే కాక, భక్తులకు సరైన వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేసి, తిరుమల ప్రతిష్టను మసకబారుస్తున్న వైసీపీ ప్రభుత్వం అంటున్నారు.

తితిదే పాలకమండలి, ప్రభుత్వము, అధికారులు అందరూ సిగ్గుపడండి అంటున్నారు. link.

ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులతో జనానికి పంచుతూ, దేవాలయ ధనం గింగే, అర్ధం లేకుండా పాలించే రాజకీయాల ప్రభుత్వాల చేతిలో హిందూ ధర్మం, హిందువుల భవిష్యత్ ఎందుకు ఉండాలి?

* హిందూ ఆలయాలకు, మిగిలిన మతాలకు ఉన్న స్వయం ప్రతి పత్తి లేకపోవటం, ప్రభుత్వాల నిర్వహణలో, వెంకన్న స్వామీ పై భక్తి లేని వాళ్ళు, ఉండటం వలనే కాదా?

* డబ్బు లు తీసుకుని ఉద్యోగం పదవి చేపట్టి, ఇన్నాళ్ళు అనుభవం తో, ఇంత మంది వస్తారు అని ఊహించలేదు, అని అంటే ఊరికే సరిపోతుందా, అధికార వ్యవస్థ సిగ్గు తో తలదించుకునేలా?

- నిన్న తిరుమల లో క్యూ లైన్లు, భక్తుల మధ్య తోపులాట

- ఎండకు తట్టుకోలేక, కొంతమంది సొమ్మసిల్లి పడిపోవటం

- చంటి బిడ్డ తల్లులు, ఎందుకు స్వామీ దర్శనానికి వచ్చామా, అని క్యూ లో చిక్కుకు పోయి , లోపలకు వెళ్ళ లేక, బయటకు రాలేక, సతమత మయ్యే దృశ్యాలు, ఎంతో బాధని కలిగించాయి

- హిందువులు ఇప్పటికి అయినా, కుల పోరాటాలు ఆపి, మన దేవాలయాలను కాపాడుకొందాం

* ఎండలకు అల్లాడుతున్న భక్తులు, టీటీడీ వైఫల్యమేనా? గొడ్లుకు కూడా, పాకలు వేస్తామే?

* భక్తుల రద్దీని సరిగ్గా అంచనా వేయలేకపోతోందంటున్నారు, పదవీ సౌకర్యాల నిద్ర మత్తులో.

జగనన్నా, రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులతో వచ్చే చెడ్డ పేరు ఎటూ ఉంది, మరలా హైందవ దేవుళ్ళు మరియు భక్తులతో కూడా శాపనార్థాలు మనకు కావాలా?

ఈ ఆదాయం కూడా పోగొట్టుకుంటే, ఇతర మతాల పూజారులకు, మనం దానా ధర్మంగా జీతాలు ఇచ్చే సౌభాగ్యం కూడా, మనకు ఉండదు. వారి పొట్ట కూడా కొట్టిన వారు అవుతాము.

Tirumala Tirupati Srivari Darshan tokens, worst conditions for devotees - in sleep intoxication of positions, merciless ttd governing body  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1525 General Articles, 51 Tatvaalu
Dt : 12-Apr-2022, Upd Dt : 12-Apr-2022, Category : General
Views : 258 ( + More Social Media views ), Id : 1340 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Tirumala , Tirupati , Srivari , Darshan , tokens , conditions , devotees , chairman , officials , merciless , reckless , ttd , governing , body
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content