తెలివైన ఆయనకు, గడుసైన వీరికి, ఐదుగురు సంతానం - తేడా వస్తే వారి భవిష్యత్? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,593; 104 తత్వాలు (Tatvaalu) and views 224,694.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

విడాకుల కు పోబోతున్న వారికి చూపించండి, చదివించండి, పిల్లల భవిష్యత్తు కాపాడండి దయచేసి.

పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అంటారు, ఇప్పుడు మోహములో మంట చేస్తున్నాము. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మంచి చెడు చూడాలంటారు. ఇప్పుడు 7 క్షణాలలో ప్రేమ అంటున్నాము, 7 రోజుల/ నెలల/ ఏళ్ళ లో విడాకులు కు వెళుతున్నాము. ఎందుకంటే, అందము ఆస్తి అవసరం అవకాశం, ముఖ్యం కాబట్టి, గుణము ఓర్పు నిజాయితీ బాధ్యత కు విలువ లేదు కాబట్టి.

ఆ తర్వాత, 100 అబద్దాలు ఆడి అయినా, పెళ్ళి చేయాలి అన్నారు.

ఇప్పుడు 1000 అబద్దాలు / అవకాశం/ అవసరం తో మొదలు పెట్టి, ప్రతి అడుగు మోహం వ్యామోహం గా సాగిపోతుంది మన జీవితము, విడాకుల దాకా. కాదంటామా?

గత ఆర్టికల్ లో ఓ బంధము కధ చదివారు కదా. Link. ఇప్పుడు గతానికి వెళుతున్నాము, కల్పిత పేర్లు తో.

సరే మన అహంకారంతో అవకాశవాదముతో అవసరముతో, ఎన్నో పెళ్ళిళ్ళు విడాకులు జరిగినా పిల్లలు పుట్టకముందు, పోనీలే కలికాలం అని సరి పెట్టుకోవచ్చు. పాశ్చాత్య దేశాలతో సరిపోతుందేమో కాని, విలువలు కలిగిన, భారత వ్యక్తులకు ఇబ్బందులే.

కానీ అభము శుభము ఎరుగని, పసి పిల్లల జీవితాలతో, ఆటలు ఎందుకు? నేటి పరిస్తితుల్లో, 24 గంటలు వెంట ఉంటేనే, పిల్లలు ఎలా తయారు అవుతున్నారో, చూస్తున్నాము.

మరి వారానికి కొన్ని రోజులు, రోజుకి కొన్ని గంటల, కోర్టు రేషన్ నిబంధనల నటన ప్రేమతో, వారి బతుకులు చిదుముతుంది మనము కాదా? ఎప్పుడూ ఉండని నాన్న లేదా అమ్మతో, సర్దుకుంటూ బతకాల్సిన దౌర్భాగ్యం వారికి అవసరమా? తోటి పిల్లలు ఎప్పుడూ, మీ అమ్మా నాన్న కలసి రారు ఎందుకు అంటే, చిన్న బుచ్చుకునేది ఎవరు?

ఆ హక్కు మనకు ఉందా? రేపు పునర్ జన్మలో, అలాంటి గంటల అద్దె ప్రేమ బతుకు, మనకు వస్తే? పిల్లలు వీటికి అలవాటు పడి ఇదే సరైన సాంప్రదాయం అనుకుని, ఇప్పుడే 4 ప్రేమ సంఘటనలతో, తమ జీవితాలు కూడా, అదే వక్ర మార్గము లో మార్చుకోరా, అందులో పడి నలిగి పోరా?

గోపీ కి పెళ్ళి అయిన మొదటి భార్య రాధతో, విడాకుల ముందు, ఏళ్ళ క్రితము శ్రేయోభిలాషుల మాటలు ఇవి. ప్రశ్నలు జవాబుల రూపములో చదవండి.

గోపీ, అంత ఆవేశము ఎందుకు, ఇన్నేళ్ళు గడిచాక, సర్దుకో, ఇద్దరు పిల్ల భవిష్యత్తు ఆలోచన చెయ్యి. ఇంకో 10 యేళ్ళలో మీ ఇద్దరూ ముదుసలి వారు అవుతారు, కోపాలు ఆవేశాలు తగ్గుతాయి, తర్వాత బాధపడతారు. పిల్లలు ఇద్దరు మానసికముగా దెబ్బతింటారు. ప్రేమ బంధాల బాధ్యత విలువ వారికి తెలీదు, కోల్పోతారు అని చెప్పాము. అయినా వారు తగ్గ లేదు.

1) మరి విడాకుల తర్వాత, ఇంకో పెళ్ళి చేసుకుంటావా?

జవాబు - చేసుకుంటాను, మా తాతల ఆస్తి ఉంది, వయసు ఉంది, తెలివి ఉంది కదా, మనమెందుకు తగ్గాలి?

2) తెలీని రాబోయే దెయ్యము కన్నా, తెలిసిన దెయ్యం మంచిది అని సామెత. మన చేష్టలతోటి కూడా, మంచి వారిని, చెడు గా మార్చుతాము కదా? ఇబ్బంది పడతావు.

జవాబు - ఇప్పటి అనుభవముతో, మంచి వారినే ఎన్నుకుంటాము కదా. అదే తప్పు, మరలా చెయ్యను.

3) మొదటి ఆమె, ఆస్తి కై, రెండో ఆమె కాపురము కూల్చదా? నువ్వు మరలా మొదటి భార్య లేదా పిల్లల మోహం లో పడి, రెండో ఆమెతో గొడవలు పడి రెండో పిల్లలను దూరం చేసి, మొదటి ఆమె మాట వినవా?

జవాబు - చ్చీ, అలాంటి, నిక్రుష్టుడను కాను. మొదటి అధ్యాయం ముగిసింది. ఇక రెండో అధ్యాయమే. లేదంటే గమ్ముగా ఉంటాను గానీ, మొదటకి చచ్చినా పోను. పోయే ఉద్దేశ్యము ఉంటే, రెండో పెళ్ళి చేసుకోను కదా.

4) మరి, ఆ ఇద్దరి పసి పిల్ల ల భవిష్యత్ సంగతి?

జవాబు - వారికి నేను అన్యాయము చేయను. కోర్ట్ నిబంధనల ప్రకారము, బాగా చూసుకుంటాను అప్పుడప్పుడు వెళ్ళి, మంచి చదువు చదివిస్తాను దూరముగా ఉండి. వాళ్ళు ఇద్దరు అంటే, నాకెంతో ప్రేమ.

5) మరి నిజముగా ప్రేమ ఉంటే, ఒంటరిగా ఉండు. మరలా పెళ్ళి ఎందుకు? అంటే, నీ ప్రేమ గొంతులోనిది, గుండెల్లోనిది కాదు? అసలు పెళ్ళి కాని ప్రసాద్ లు ఎందరో ఉన్నారు. మరి 15 ఏళ్ళ, సంసారము చేసిన నువ్వు ఉండలేవా, పిల్లల మీద ప్రేమతో? మొదటి భార్య మారవచ్చేమో? దూరముగా ఉండే పిల్లలు బాగు పడ్డ అవకాశాలు తక్కువ కదా? అంటే, ప్రేమ జాలి దయ కరుణ బాధ్యత నీతి నియమాలు తక్కువగా అబ్బుతాయి. ఎందుకంటే, అవి పేరెంట్స్ కే తెలీదు కాబట్టి.

జవాబు - వారికి అన్యాయము చేయను. కానీ పెళ్ళి లేకుండా ఉండను. తప్పకుండా 2 పెళ్ళి కి వెళతాను. ఇక జన్మలో మొదటి భార్య జోలికి వెళ్ళను, చూస్తారు గదా.

6) అదేమిటి, మొదటి పిల్లల కోసము వెళుతూ ఉంటే, మాటలు కలవవా? కోపాలు తగ్గినాక మరలా అవసరాలు నాటకాలు మొదలు అవ్వవా?

జవాబు - నేను అంత వెర్రి కాదు, ఇంత అవమానము జనము అందరి ముందు జరిగాక, ఆ రాక్షసి తో అలాంటి విలువ లేని లెక్కలేని మనిషితో, మరలా అలాంటి యదవ పనులు చేయను.

7) సరే, అంటే, పిల్లల మీద బాధ్యత ప్రేమ లేవు, స్వార్ధపరులు మీరు. పర్లేదు. మరి రెండో పెళ్ళి జరిగితే, వారికి అన్యాయము చేయవా? ఇవే గొడవలు రావా? అది కూడా పెటాకులు అయితే, జనము ఊయరా? మనము వెధవలము కామా? అప్పుడు అయినా, పిల్లలకు ముందే, జాగ్రత్త పడతావా విడాకులు?

జవాబు - అన్ని అనుమానాలు అయితే, ఇక ఎవరము వ్యాపారాలు పెళ్ళిళ్ళు చేయము. ఇప్పుడు జరిగిన అనుభవముతో, మరలా అలా జరగకుండా, చూసుకుంటాను, జాగ్రత్త పడతాను. జనము ఊస్తారు కాబట్టే, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను.

8) రెండో భార్య, మొదటి భార్య ఇంటికి వెళ్ళవద్దు, పిల్లలను తేవద్దు, ధనము ఇవ్వ వద్దు అంటే?

జవాబు - అన్ని ముందే చెపుతాను, దాపరికము ఎందుకు. కాబట్టి వెళ్ళవద్దు అని అనరు, రోజుకి గంటే గదా పిల్లలతో. ధనము ఎందుకు ఇస్తాను, పిల్లలను ఎందుకు ఇక్కడకు తెస్తాను. ఆ మాత్రము తెలివి నాకు ఉండదా? ముందే అన్నీ వప్పుకున్నాక, ఎందుకు వద్దు అంటుంది రెండో భార్య?

9) ఎందుకంటే, మనిషి స్వార్ధ జీవి. రెండో పెళ్ళి వాడిని, తొందరగా నమ్మలేరు. ఆస్తి రాయొచ్చు, ధనము ఇవ్వొచ్చు అని అనుమానం ఉంటుంది. అందులో మన బుద్ది, వారానికే తెలిసిపోతుంది. కాబట్టి నమ్మరు. నువ్వైనా, వారైనా, పెళ్ళికి ముందు మాటలు, పెళ్ళి అయిన తర్వాత మాటలు కలవవు. ఇద్దరూ మాటలు తప్పుతారు. ఎందుకంటే, అందరూ అవకాశ వాదులే. అవసరాలు అనుమానాలు తప్ప, నీతి నియమాలు కట్టుబాట్లు ఉండవు కాబట్టి.

జవాబు - నా చేతులారా ఈ యజ్ఞము మనసా వాచా కర్మణా చేస్తున్నా కాబట్టి, అవన్ని సంతోషము ఎదుర్కొంటాను. ఇప్పుడు అనుభవము వచ్చింది మొదటి విడాకులతో. అంటూ పెడ చెవిన పెట్టి, ఇద్దరు విడాకులకు పోయారు.

* గోపీ మరలా గాయత్రి ని చేసుకున్నాడు, ఇప్పుడు 3 పిల్లలు. మరలా పైన ఏళ్ళ క్రితము అనుకున్న, అన్ని విషయాలు మొహాలు తగవులు మొదలైనాయి. మొన్న సర్ది చెప్పాము.

మరి తర్వాత ఏమి జరుగుతుందో, ఆ 5 గురు పిల్లల విలువల భవిష్యత్ ఏమిటో, ఆ దేవునికే తెలియాలి. మన ఖర్మ మనము రాసుకోవడము అంటే ఇదే, అనవసరముగా.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,593; 104 తత్వాలు (Tatvaalu) and views 224,694
Dt : 27-Oct-2020, Upd Dt : 27-Oct-2020, Category : General
Views : 881 ( + More Social Media views ), Id : 778 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : respect , husband , wife , care about kids , him , wise , tough , indian marriage , children , future , issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content