గౌరవ రాష్ట్ర మరియు జిల్లా ప్రభుత్వ ఐయేఎస్ అధికారులు మరియు ఇతర అధికారులు కు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,375; 104 తత్వాలు (Tatvaalu) and views 225,591.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గౌరవ రాష్ట్ర మరియు జిల్లా ప్రభుత్వ ఐయేఎస్ అధికారులు మరియు ఇతర అధికారులు కు నమస్కరించి వ్రాయునది,

భారత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారధులు మీరు. ప్రజాస్వామ్యానికి, ప్రజల సంక్షేమానికి రక్షకులు మీరు, అభినందనలు ధన్యవాదములు. లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ కూడా, మీ చేతిలోనే ఉంది.

కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వ పధకాలను, విజయవంతముగా చిత్తశుద్ది తో అమలు చేసే బాధ్యతను, మీ మీద ఉంచింది భారత ప్రభుత్వము. చీఫ్ సెక్రటరీ నుంచి, వివిధ శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు గా మీరే ఉన్నారు. మీ అండ లేకుండా, రాష్ట్ర నాయకుల పధకాలు, ఇంచె కూడా ముందుకు జరగవు. 5 ఏళ్ళ ఎన్నికల వాగ్ధాన నాయకులు ఒకవైపు, కనీసం 30 ఏళ్ళ పైగా సర్వీసు తో, ప్రజలతో కలసి ఉండే మీరు ఇంకోవైపు.

అలాంటి బాధ్యతాయుత పదవిలో ఉండి, కొన్ని పనులలో తప్పులను వాస్తవాలను, గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పలేక పోతున్నారు అధికార నాయకులకు, బదిలీలకు తలవొగ్గి అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ప్రజలకు. ఒక పధకానికి ధైర్యముగా ప్రకటనలలో, కేంద్ర మరియు రాష్ట్ర వాటా శాతము, ఇంత అని చెప్పలేకపోతున్నారు, రాష్ట్ర ప్రజలకు. అది చాలా సార్లు దాస్తున్నారు, ప్రజలకు చేరడము లేదు.

అలాగే రాష్ట్ర పధకాలకు, వ్యక్తుల పేర్లు పెడుతుంటే, కనీసము ఇది ప్రజల పన్నుల సొమ్ము, మీరు బయట ఏమైనా ప్రచారము చేసుకోండి, కానీ రాజ పత్రములో అధికారముగా, 5 ఏళ్ళు మాత్రమే ఉండే, సగం ప్రజల వలన మాత్రమే గెలిచే, వ్యక్తుల పేర్లు పెట్టలేము, ఇది రాజ్యాంగ విరుద్దము, అని చెప్పలేకపోతున్నారు.

ప్రతి పధకము తో పాటుగా, అప్పు మరియు వడ్డీ లూ, కూడా చెప్పండి ధైర్యముగా. ప్రతి నెల పెరుగుతున్న అప్పు మరియు వడ్డీ, ముందు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎంత చేసింది తేడాలు నేటికి, అన్ని వివరాలు ప్రజల ముందు ప్రతి నెలా ఉంచండి.

స్వాతంత్ర సమర యోధులు, అల్లూరి, టంగుటూరి ప్రకాశం, దుగ్గిరాల, రైతన్నల పేర్లు, రాష్ట్రములో ఎక్కువ పన్నులు కట్టిన వారి పేర్లు, బయటకు రావడము లేదు, పధకాల పేర్లు గా.

ఒకవేళ రాజకీయ నాయకులు వత్తిడి పెట్టినా, కనీసము నోట్ లో లేదా మీ సొంత సోషల్ మీడియాలో, వాస్తవాలను ప్రజలకు చెప్పడము లేదు. అలాగే రాష్ట్ర వత్తిడులు గురించి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పడము లేదు.

ఒకవేళ వ్యక్తుల పేర్లు పెట్టాల్సి వస్తే పధకాలకు, 30 ఏళ్ళు సేవ చేసే మీ పేర్లు ఉండవద్దా కొన్ని పధకాలకైనా? ఎస్సీ, ఎస్టీ, మహిళా, బీసీ రిజర్వేషన్లు ఉండవా, రాష్ట్ర పధకాల పేర్లలో? మరి వారందరికీ కూడా, మీరు న్యాయము చేయాలి కదా?

ఈ రోజు జగన్ గారు, న్యాయ వ్యవస్థ లో ఉన్న సమస్యల గురించి, సుప్రీం కోర్ట్ కి విన్న వించారు ధైర్యముగా, అభినందనీయం. అలాగే, మీరు కూడా, రాజకీయ నాయకుల నుంచి ఉన్న ఒత్తిడులను లేదా వ్యవస్థలోని పొరపాట్లు తప్పులను, ధైర్యముగా జగన్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్ట్ కి ఎందుకు చెప్పరు?

ఆలోచన చెయ్యండి, బాధ్యత గల అధికారులుగా, మీరు ప్రజలకు మంచి చేయడానికి, మంచి దోవ చూపడానికి ఉన్నారు, అదే మీ ప్రధాన లక్ష్యం కావాలి, అందుకై పాటు పడాలి కదా.

నేను కూడా రాష్ట్ర మరియు జిల్లా ప్రభుత్వములో పని చేసా, ఆ రాజకీయ వత్తిడులు, అలాగే పై అధికారుల వత్తిడులు ఎలా ఉంటాయో, మీ అంత కాకపోయినా, కొంత వరకు తెలుసు.

ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, దానిని పరిరక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను, ఆదర్శముగా రాష్ట్రములో కూడా మీరు కొన సాగించాలని, జరుగుతున్న తప్పులను జగన్ గారి ద్రుష్టికి తీసుకుని వెళ్ళి, వాస్తవ పరిస్తితులను చెప్పేందుకు, దేవుడు తగిన శక్తిని ఇవ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ

అందరు రాష్ట్ర మరియు జిల్లా ఐయేఎస్ అధికారులకు పంపగలరు, మంచి కోసం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,375; 104 తత్వాలు (Tatvaalu) and views 225,591
Dt : 11-Oct-2020, Upd Dt : 11-Oct-2020, Category : Request
Views : 783 ( + More Social Media views ), Id : 751 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : honble , state , district , government , ias , officers , other officers
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content