Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1. నిజం మాట్లాడే వారు/ మంచి దోవలో నడిచే వారు
2. అబద్దాలు చెప్పే వారు/ చెడు దోవలో నడిచే వారు
3. నటించేవారు/ చెడు దోవలో నడుస్తూ, మంచి దోవగా చూయించేవారు
1 min read time. *అందరూ మీ లాగా నీతి గా ఉండాలి అంటే కష్టం కదా. మరి మీకు అందరితో ఇబ్బందులు/ మాటలు రావా?* లేదా
*ఏవండీ మనుషులు ఎన్ని రకాలు మనస్తత్వం గా ఉంటారు, వారి స్వభావం తెలుసుకోవడం ఎలా? ఎవరితో మనకు ఎక్కువ జాగ్రత్తలు గా ఉండాలి? మరి దైవం అండ?*
జవాబు - ముందు మన గురించి మనము తెలుసుకోవాలి. మనము మోహం లో ఉంటే, మన ఎదురు కనపడేవి అన్నీ కూడా, మనకు అలాగే కనపడతాయి.
అందుకే పచ్చ కామెర్లు వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అంటారు కదా. తాగుబోతు/ నటన/ కపటం/ తిరుగుబోతు/ లోభి/ దాపరికం/ అహంకారిల కు, ప్రాణస్నేహితులు కూడా అలాంటి వారే ఉంటారు. వీరి బంధం గట్టిది, ఎందుకంటే పతనం వైపు కలసి సమిష్టిగా నడుస్తారు.
మనము మోహము బయట ఉంటే, అంతా మనకు స్పష్టము గా అర్ధం అవుతుంది, వారి ఆలోచన ఏమిటి, తర్వాత ఏమి జరుగుతుంది, వారికి మనము దూరంగా ఉండాలి అని. మనము నీతి గా ఉండి, మనకు కష్టం లో కనీసం మాట తోడు ఉండని, 100 మంది కన్నా, మంచి గా పలికే గౌరవించే ఒక్కరు/ 10 మంది చాలు. తక్కువ మంది గా ఉండే, స్థిర నిజాయితీ స్నేహితులే మన రక్షకులు.
కాకపోతే, 50 శాతం పైన, తాము మోహములో ఉన్నాము అన్న విషయం వారికే తెలీదు, తెలిసినా ఒప్పుకోరు. వీరు రాహు/ కేతు/ శని దేవుల నీడలో, హాయిగా భ్రమలలో తేలియాడుతుంటారు, శిక్షణ మొదలు అయ్యిందాకా. ఏలినాటి శని కొంతమందికి మరలా 20 ఏళ్ళ పై దాకా తాకకపోవచ్చు.
అప్పుడు దాకా వీరు హీరోలే, ఆడిందే ఆట పాడిందే పాట, ధనము హోదా అహంకారం అన్ని ఎక్కువే, మంచి అసహ్యించుకుంటారు గేళి చేస్తారు. కానీ ఆ నీడ పడిన తర్వాత, మొత్తము తల్లకిందులు అవుతుంది. మనము చూసాము కోటీశ్వరులు కూడా, రోడ్ పై బాబూ అనడం.
మన చుట్టూ చాలా మంది ఉన్నారు, వారి గురించి చెబితే, మరలా బాధపడతారు. అందుకే పురాణాలు అన్ని రకాల ఉదాహరణలు ఇచ్చింది. ఆ పుణ్యాత్ములు వచ్చి మనల్ని తిట్టరు. మన చుట్టూ ఉన్నవారు, అమ్మయ్య, అని భుజాలు తడుము కోరు.
దాదాపుగా, మనుషులు 3 రకాలు, అందరూ వీటిలో ఏదో ఒక కోవకు చెందిన వారే, మనస్తత్వాన్ని బట్టి. ఎంత దాచాలి అనుకున్నా, వారు దాచలేరు. ఒక గంట మాట్లాడితే, స్పష్టత వస్తుంది. కానీ మనం మోహం బయట ఉంటేనే తెలుస్తుంది.
1. నిజం మాట్లాడే వారు/ మంచి దోవలో నడిచే వారు - విదురుడు, ధర్మరాజు లాంటి వారు
2. అబద్దాలు చెప్పే వారు/ చెడు దోవలో నడిచే వారు - దుర్యోధనుడు, రావణుడు లాంటి వారు
3. నటించేవారు/ చెడు దోవలో నడుస్తూ, మంచి దోవగా చూయించేవారు - శకుని, శల్యుడు లాంటి వారు
1 వ రకం కు 10 మంది గట్టి స్నేహితులు/ బంధువులు ఉంటే, 2 వ రకం కు 100 మంది స్నేహితులు ఉండవచ్చు, ఇక 3 వ రకం కు 1000 మంది ఉండవచ్చు. మంది ఎక్కువ అయ్యేసరికి, మనసు మంచి సాత్వికత గుణం పలుచ బడుతుంది
సాధారణముగా మొదటి ఇద్దరి తో, మాకు మీకు ఎప్పుడూ సమస్యలు ఉండవు. ఎందుకంటే వారి మాటలు, వారి చేతలు, మనకు స్పష్టముగా కనపడతాయి. వారి పనులలో క్లారిటీ ఉంటుంది. 1 జోలికి 2, 2 జోలికి 1 రారు. ఇద్దరికీ స్పష్టత ఉంది. ఒకరు తూర్పు, ఇంకొకరు పడమర.
1.
మొదటి రకం, ఎవరినీ ఏమీ అనరు. ఉన్నది సత్యం చెపుతారు. చేతనైంది చేస్తారు. మన మాట వింటారు. మనకు మంచి చెపుతారు. కనీసం మాట చేయూతనిస్తారు, మనం పతనం కాకుండా ముందే హెచ్చరిస్తారు. వారు ఏమీ చేయకపోయినా, వారు మనకు కీడు మాత్రం చేయరు. మన ఎదురు ఎన్ని తిట్టినా, చాటుగా మన గురించి చెడు గా మాట్లాడరు.
2.
రెండవ రకం, వారి చెడు దోవలో వారు ఉంటారు. వారు అబద్దాలు చెపుతారు, అని మనకు స్పష్టము గా తెలుసు, ఆశ నమ్మకం కపటం ఎటూ ఉండదు. వారు అవసరమైతే సహాయం కూడా చేస్తారు/ అడుగుతారు. నచ్చకపోతే, దూరంగా ఉంటారు.
ఎందుకంటే, వారితో (1 వ రకం) తలనొప్పి ఏదో క్లాస్ పీకుతారు, మనకు వద్దు, ఆ గంటలో మనము ఇంకొంత దోచుకోవచ్చు, ఇంకొన్ని తప్పుడు పనులు చేయవచ్చు, లేదా మనల్ని మోహం నుంచి బయటకు లాగుతారు, అని అనుకుంటారు.
లేదా మన దగ్గర ఉన్నా, మన దగ్గర మాత్రం సత్యం గ్రహిస్తామని అబద్దాలు చెప్పరు, మనకు తగిన విధం గా ఉంటారు ఆ కొద్ది సమయం.
ఉదాహరణకు ఒక మిత్రుడు వచ్చి, నేను ఈ తప్పుడు వ్యాపారం చేస్తున్నా, తప్పలేదు, కుటుంబ భారానికి అంటే, అతనిని మనమేమి అనగలం. ఆ దోవ తప్పు అంటే ఆపు అంటే, మనల్ని ఇంకో మంచి దోవ చూపు అంటారు. మనకు అంత శక్తి ఉందా?
కాబట్టి, మన వరకు నిజాయితీగా ఉంటారు. మనం మంచి చెప్పినా, ఎదురు వాదించరు, తగువులాడరు, ఎందుకంటే అవి సత్యాలు అని వారికి తెలుసు. చెప్పుకోనీ అని, గమ్ముగా విని వెళ్ళి పోతారు, వారి దోవ వారిదే.
దుర్యోధనుడు లాంటి స్వభావం స్వతహాగా, ఎవరి జోలికీ వెళ్ళడు. నా లాంటి వారి గురించి చెప్పినా కూడా, సమవుజ్జీ ఉండాలి, మనకెందుకు అలాంటి నీతి గల వారితో వదిలేయండి, దండగ అంటాడు.
కానీ రారాజు పతనం అయ్యింది, శకుని మాటలు విని మాత్రమే, కక్ష పగలు పెంచుకుని. అలాగే రావణుడు పతనం అయ్యింది, చెల్లెలు శూర్పణక మాట విని, మోహం లో చిక్కుకుని.
3. అసలు సమస్య ఈ
3 వ రకం వారితోనే, మీకైనా మాకైనా. వీరు చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు. అంతా దాపరికం, మోసం, కుట్ర, చాటుతనం. మీకు సోషల్ మీడియా లో వాట్సాప్ ల లో, ఎలా తెలుసుకోవాలో ఉదాహరణలు ఇచ్చాము. వీరికి దేవుడు కూడా దూరం. భస్మాసురు లాంటి వారు.
మంచిపనులు చేస్తున్నట్లు గా నటిస్తారు, ఎంతో మందిని బాధిస్తారు/ దోచుకుంటారు. అంతా చాటే. అవసరం అవకాశం ముఖ్యం. బాధలలో ఒకరకముగా ఉంటారు, ఆనందము లో ఇంకో లా ఉంటారు. తాము నాశనం అవుతూ, ఇతరులను నాశనం చేస్తారు. అపవాదులు వేయడానికి వెనుకాడరు.
మేకవన్నె పులి సామెత. తడి గుడ్డతో గొంతు కోస్తారు. ఇక్కడో మాట, అక్కడో మాట. మన ఎదురు నటిస్తారు, అబ్బో నువ్వు దేవుడివి అంటారు, పక్కకు పోయి, ఇంకో మాట అంటారు.
వీరికి మన మాటలు శూలాలు గా గుచ్చుకుంటాయి. తట్టుకోలేరు, నేరుగా వారి అహాన్ని దెబ్బతీస్తాయి, కపటాన్ని బయట పెడతాయి. మామూలు గా చెప్పినా కూడా, తననే అన్నారు అనుకుంటారు. ప్రతి దానికీ, భుజాలు తడుముకుంటారు. మనల్ని ఆపే ప్రయత్నం, చేస్తారు.
ఇది మనము జాగ్రత్త గా గ్రహించ గలిగితే, వారిని దూరముగా ఉంచగలిగితే, మనకు ఎటువంటి సమస్యలు మాటలు ఉండవు. వారికి మనశ్శాంతి, అలాగే మనకు కూడా.
విభీషణుడు, సుగ్రీవులు సొంత అన్నకే దూరంగా వెళ్ళారు, మనస్తత్వాలు కలవక.
మనము కూడా ఉమ్మడి కుటుంబాలు మరియు పెద్దలను వదిలేసి, అందరము ఒంటరిగానే బతుకుతున్నాము కదా, చుట్టూ 100 సమస్యలతో మూర్ఖముగా, బయట పదిమంది సహాయం అర్ధిస్తూ.
దైవం అండ అందరికీ ఒకటే, వారు మంచి వైపు కు మారతారు అని అవకాశం ఇస్తారు. ధనం అధికారం అన్ని ఇచ్చి, పరీక్షలు పెడతారు.
రావణుడి కి కూడా శివుడు వరాలు ఇచ్చారు కదా. ముందు వార్నింగ్ లు ఇస్తారు, మంచి వారితో చెప్పిస్తారు, కానీ ఇక మారరు అనుకుంటే, వారిని పతనం లేదా లయం చేస్తారు.
Types of people mentality behaviour, know their nature? be careful? god blessings
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,347,743; 104 తత్వాలు (Tatvaalu) and views 254,604 Dt : 13-Jun-2022, Upd Dt : 13-Jun-2022, Category : General
Views : 1490
( + More Social Media views ), Id : 1427 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
types ,
people ,
mentality ,
behaviour ,
nature ,
careful ,
away ,
god ,
blessings ,
duryoadhana ,
sakuni ,
ravana Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments