Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మొన్న 2018 ఊరు వచ్చి నప్పుడు 3 లక్షలు అడిగితే, ముందు చెప్పాలి కదా అన్నారు. కోట్ల వ్యాపారం చేసే వారికి, మూడు లక్షలు కోసం ముందు చెప్పాలా అన్నా.
మరి వ్యాపారం దెబ్బతిందని, ఇంట్లో వాళ్ళు లేదా ఫైనాన్స్ లో పని చేసే వారు, ముందు గా కస్టమర్ లేదా చుట్టంగా, చెప్పారా అని అడిగాను.
బయట 2 లక్షల అప్పు చేసి, జీవితంలో మొదటి సారి చేయిచాపి 2 వారాల గడువు తో, ఇంటికి రంగులు, పైన స్లాబు, ఇంట్లో పనులు, బయట జనం కు ఊరక సహాయం కు ఇచ్చాను.
బాబాయి, అరుపులు, బతిమాలి, అభ్యర్థించి, వేడుకొని, దండం పెట్టి, 2 లకారాలు ఇస్తే, చేబదులు ఇచ్చిన వారికి వెనక్కి ఇచ్చాను.
ఇంతవరకు బాబాయి దగ్గర నుంచి ఫోన్ లేదు. కనీసం, సంవత్సరం కు ఒక లక్ష తీసుకో. ఇది గో పావలా వడ్డీ ఇస్తున్నాము, మీరు చుట్టాలు. లేదా అసలు నీవి మా దగ్గర ఏమీ లేవు, అని కూడా సమాధానం లేదు.
మాట తప్పి అబద్దాలు చెప్పి, తప్పు వారి దగ్గర ఉంచుకుని, మన మీద కోప్పడితే లేదా అలిగితే, దేవుడు మెచ్చరు.
నోట్ల రద్దు కు , సంవత్సరం లేదా రెండు ఏళ్ల ముందు, స్పష్టంగా చెప్పాను, ఇంక ఈ వ్యాపారం వద్దు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసూకోండి, ఉన్నది అనుభవించండి, చాలు అని.
నాయనమ్మ అన్నం తిన్న, కృతజ్ఞతలు నాకు ఉన్నాయి. మీరు ఒక్క మాట అనండి, మేము ఇవ్వము అని ఇంక అడగను జీవితంలో. కానీ ఆ పాప భారం, తరాలు భరించాలి. ఎందుకంటే కన్నతల్లి చూసేవాడిని, ఇబ్బంది పెట్టకూడదు.
ఆ కడుపు మంటతో, జరిగింది వివరముగా పైన చెప్పిన విధముగా, మెస్సేజ్ పెడితే, పిన్ని ఫోన్ చేసింది, నేను ఎత్తలేదు. ఎందుకంటే ఆ బాధ లో, కోపం లో మనం నోరు జారి తప్పు గా మాట్లాడకూడదు.
చిన్న నాయనమ్మ క్షమించదు. మాట తూలావా నా పిల్లల ను అని. అందుకే ఫోన్ ఎత్తలేదు తమాయించుకుని.
ఇప్పుడు కూడా డబ్బు అవసరం లేదు, కానీ ఎంతో మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడుగుతున్నా, ఇవ్వలేక పోతున్నా అని గుండెల్లో బాధ.
కానీ నా బాబాయి కుటుంబం, వారి పిల్లలు చల్లగా ఉండాలి, ఇలాంటి వాటిలో చిక్కుకో కూడదు.
మా నాన్న డబ్బు, వారి దగ్గర ఉన్నంత కాలం, వారి ఆఫీసు మనుషులే, ఫోన్ చేసి వివరాలు చెప్పాలి, అది వారి వృత్తి ధర్మం. ఇంటర్నెట్ ఫోన్ ఉచితం, చాలా కాలంగా కూడా.
నేను ఫోన్ చేసి దేబిరించకూడదు. అలా నేను ఫోన్ చేసి అడిగితే, వారికి ఇంకా మంచిది కాదు. దేవుడు మెచ్చరు. అందుకే నేను ఎప్పుడూ, డబ్బు గురించి ఫోన్ చేయను.
2014 లో అమ్మను అడిగాను , వడ్డీ లు వద్దు మనకు అని. అమ్మ అంది, అన్నదమ్ముల బంధం కు గుర్తు అది ఉండనీ అని.
రెండో బాబాయి కూడా అడిగారు, నీ దగ్గర ఉంటే చెప్పురా మంచి వడ్డీ వస్తుంది అని, మాకు మంచి చేయడానికి. ఎంతో మంచి చేశాడు, అమ్మ ను బిడ్డను కలపడానికి.
కానీ ఈ బాబాయి ని అడగలేదు, కదిలించలేదు, తక్కువ వడ్డీ అని తెలిసినా, మోసము చేస్తున్నారు అని తెలిసినా. అప్పుడు అంతా బాగానే ఉంది.
పాపం మా పిన్ని కొడుకు కూడా, మావి ఉందని తెలిసి, తనూ పెట్టాడు బాబాయి దగ్గర. ఇప్పుడు పిల్లల చదువు కోసం పొలం బేరము పెట్టారు, మనం డబ్బులు ఇవ్వకపోతే. ఆ పాపం ఎవరికి?
ఇంకా అలా ఎంతమంది ఉసురు మనకు అవసరమా? మన కుటుంబం కు క్షేమమా? దేవుడు మన్నిస్తారా?
అని భాను, తన స్నేహితుడు క్రాంతి తో అసలు వడ్డీల బాధలు ఇంకా చెప్పసాగాడు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,166; 104 తత్వాలు (Tatvaalu) and views 254,454 Dt : 05-Feb-2020, Upd Dt : 05-Feb-2020, Category : General
Views : 973
( + More Social Media views ), Id : 303 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
uncle babai money interest business issues Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments