మొదలైన అమెరికా తెలుగు సంఘ నాయక ఎన్నికల తంటాలు - జన సేవ మరచి తమ వారి సేవలో - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,061,795; 104 తత్వాలు (Tatvaalu) and views 236,212.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, అని రాయప్రోలు అన్నారు ఆనాడు.

ఈనాడు విదేశాలలో, దానిని కొంచెము మనకు అనుగుణముగా మార్చి, మన ముఠా అవసరాలకు మరియు రాజకీయాలకు వాడుకోవడము, ఇప్పుడు మన అందరకూ అలవాటే. ఈరోజు విదేశాలలో గుడులను కూడా, తమ సొంత రాజకీయాలకే వాడుకుంటున్నారు, శాఖలు గా విడిపోయి సొంత గుడులు ఎగబడి కడుతున్నారు, చందాలు పోగేసి.

1970-80 దగ్గరలో, తెలుగు వారి నిజమైన సేవకు, తానా స్థాపించారు. ఆనాటి పెద్దలు, నిస్వార్ధముగా, మంచి మంచి కార్యక్రమాలు హుందాగా చేసారు. ఆ లక్ష్యం ఆ పట్టుదల వేరు.

ఉదాహరణకు ఎంటీయార్, మంచి లక్ష్యము తో పెట్టిన తెదేపా, ఇప్పుడు ఎవరి చేతిలో, ఏ అవస్థలో ఉందో మన అందరికీ తెలుసు.

కానీ ఆ తర్వాత సంఘాలలో తెగులు ప్రారంభము అయ్యింది. కొత్త నాయకులు వచ్చారు, సొంత కంపెనీల వ్యాపారాల ధన బలముతో, తిష్ట వేసారు. కొందరికి పొసగలేదు, ఎన్నో ఉపజాతులు గా విడిపోయారు - నాట్స్, పోట్స్, వాట్స్, అటా, పెటా, చిటా అంటూ, ఊరికొకటి జిల్లాకు ఒకటి, కులానికి ఒకటి, వర్గానికి, పార్టీకి ఒకటి అని, ఎన్ని రకాలు గా విడిపోయి, ఎంత గబ్బు పట్టాలో, అంతా పట్టింది.

కొంత ప్రజా సేవ, మరింత తమ వారి సేవ. మరలా తమ అవసరాలకు కలుస్తారు విడి సంఘాలు గానే, సంఘాల యూనియన్ గా పెత్తనం చలాయిస్తారు.

ఒక్క తానా నే కాదు, అన్ని సంఘాలలో, వారసత్వం అనుచరులను ప్రవేశపెట్టారు. గతములో అధ్యక్షులుగా పని చేసిన వారు, మరలా తమ పట్టు నిలబెట్టుకోవడము కోసము, ముఠాలను ఏర్పరిచారు. రూల్స్ పెట్టి, కేవలము తమ చెప్పు చేతలలో ఉండేవారినే ఎంచుకుంటున్నారు.

మరలా ఎక్కువ మంది, గ్రీన్ కార్డ్ దారులు, భారత్ లో ఎలెక్షన్ సీటు కోసం. టార్గెట్ లు పెట్టారు, ప్రతి రాష్ట్రములో, ఇంత మందిని బలవంతము గా అయినా, మీ సొంత డబ్బులు కట్టి చేర్చండి, అప్పుడే మీకు గుర్తింపు అని, అమాంతము సభ్యులను పెంచారు.

ఎన్నికల బాలెట్ పేపర్లు, వ్యక్తుల ఇంటి వస్తే, వాటిని అన్ని తీసుకుని, మనకు నచ్చిన వారికి ఓటు వేసి, తమ పట్టును కొనసాగిస్తున్నారు అని గుసగుసలు. ఎమ్మెస్ చదవడానికి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు కూడా, ఇందులో భాగస్వామ్యం చేసారు. ఎన్ని రకాలుగా దిగజారాలో, అంతా దిగజారారు.

అమెరికా 4 దిక్కులా, తమ ముఠాలను వర్గాలు అనుచరులను, పటిష్టం చేసుకున్నారు. చికాగో, న్యూయార్క్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి చోట్ల, వర్గాలు గా ఏర్పడ్డారు. ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు.

తెలుగు సంఘ కార్యక్రమాల కోసం, భారత్ నుంచి వచ్చిన మహిళా తారలతో వ్యవహారాలు, మనం సోషల్ మీడియాలో చూసాము. పార్టీల కోసం ముసుగులో రాలీలు ప్రచారం చేసారు. ఒక అధ్యక్షుని, సంస్కారవంత మైన భాష, అందరూ ఇంటర్నెట్ లో విన్నారు.

ఇంకా చిత్రమేమిటి అంటే, విడిపోయిన సంఘాల వారు తమ కార్యక్రమాలలో, మరలా ఆ విడిపోయిన ముఠాను వీరు, ఈ ముఠాను వారు పిలుచుకుని గౌరవించుకుంటున్నారు, జనాలను పిచ్చి వారిని చేసి. ఆ ఐక్యమత్యమే గౌరవమే ఉంటే, ఇన్ని సంఘాలు ఎందుకు?

ఎందుకంటే, మన ఉనికి కావాలి, మనకు అమెరికాలో (విదేశాల్లో) మరియు ఆంధ్రా తెలంగాణా లో రాజకీయ నాయకుల అండదండలు ఉండాలి అంటే, ఓ సంఘానికి నాయకుని గా ఉండాలి.

అధ్యక్షుడు గా నిలబడేది కూడా, ఖాళీగా ఉండి, జనము కోసము తిరిగే, శ్రమతో చమటోడ్చే, మామూలు సామాన్య వ్యక్తులు కాదు. ఏదో ఒక వ్యాపారమో లేదా కంపెనీ ఓనరో లేక భాగస్వామో లేక ఇంకో పెద్ద ఉద్యోగమో ఉన్నవారు. అంటే, పార్ట్ టైం గా ప్రజా సేవ చేసే వారు మాత్రమే వస్తున్నారు, ఎన్నుకుంటున్నారు.

ఇక్కడ తెదేపా కి జలుబు చేసిందంటే, అక్కడ తానా తందానా అంటూ, చీదుకుంటుంది అని వారు తప్ప, అందరూ అనుకుంటారు.

అది అందరమూ అంగీకరించాలి కదా, మన ఉద్దేశ్యమే అది. విడగొట్టు, పేరు తెచ్చుకో, పదవులు ఆదాయము, సమకూర్చుకో. తెలంగాణా విడిపోకపోతే, కేసీయార్ గారి కుటుంబాని కి 4 ఉద్యోగాలు రావు కదా?

సాధారణముగా ఆంధ్రాలో తెదేపా అధికారములో లేకపోతే, తానా నాయకత్వం గురించి పెద్దగా పోటీపడరు. కానీ ఈ సారి, బహిరంగముగా 3 బయటకు వచ్చారు - గోగినేని, నిరంజన్, నరేన్. తెర వెనుక గాడ్ ఫాథర్స్ మంతనాలు జరుపుతున్నారు, మిగతా ఇద్దరిని విరమింప చేయాలని.

ఎందుకంటే, వీరు ముగ్గురు రెచ్చిపోయి, మూడు ముక్కల ఆటలో తగువులాడుకుంటే, ఇంకా తానా పరువు రోడ్డున పడుతుంది. అప్పుడే వారి ప్రచారములో, ఇప్పటి వరకు సంఘములో ఉన్న సంకెళ్ళు తెంచుతాము, కుల మరియు పార్టీ మచ్చ చెరుపుతాము, బాలెట్ల నియంత్రణ తగ్గిస్తాము, మన సంస్థ అందరిదీ అన్నట్లు గా ప్రవర్తిస్థాము, అనే స్లోగన్లు మొదలు అయ్యాయి. ఇంకెన్ని విడ్డూరాలు బయటకు వస్తాయో చూడాలి మరి.

మంచి కొత్త నాయకత్వము వచ్చి, ముందు వారి పడగ నీడ లేకుండా, సొంత కొత్త ఆలోచనలతో సంస్కరణలతో, అన్ని కులాలను పార్టీలను వ్యక్తులను సమూహాలను కలుపుకునే విధముగా, తీర్చి దిద్దుతారు అని ఆశిద్దాము. తానా ఖ్యాతిని మరలా పునరుద్దరిస్తారు అని ఆశిద్దాము. పాత నాయకులు కూడా వెనక్కి తగ్గి, స్వేచ్చగా కొత్త వారు తమ అభిప్రాయాలను తెలిపే విధముగా, కొత్త వారిని ఎన్నుకునే విధముగా, పరిస్థితులను కల్పిస్తారని ఆశిద్దాము.

ట్రంప్ నేరుగా పార్టీలోకి వచ్చిన విధముగా, కొత్త మంచి వారికి అవకాశాలు ఇస్తారని ఆశిద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,061,795; 104 తత్వాలు (Tatvaalu) and views 236,212
Dt : 15-Jan-2021, Upd Dt : 15-Jan-2021, Category : America
Views : 1105 ( + More Social Media views ), Id : 924 , Country : USA
Tags : usa , foreign , telugu , sangham , community , leaders , election , troubles , people , service , tana , ata , nats

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content