వసంత పంచమి - విద్యాభ్యాసానికి ఆరంభం, అలాగే క్రుతజ్ఞతలు తెలుపు రోజు - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,443; 104 తత్వాలు (Tatvaalu) and views 224,675.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చదువుల తల్లి సరస్వతమ్మ కటాక్షం లేకుండా, ఒక్క మంచి మాట పలకలేము, ఒక్క మంచి మాట రాయలేము, మనసు కదలదు బుద్ది మెదలదు దేహం సహకరించదు.

మంచి మాట కోటి రూపాయల మూట, అని ఎన్నో సార్లు రుజువు అయ్యింది, ఎందరు ఎందరికో తమ ప్రత్యక్ష జీవితములో.

మనము రోజూ, దేవుని పుత్రులు గా, వ్యక్తులు గా వ్యక్తిగతముగా తెలియకపోయినా, కలవకపోయినా, మనల్ని కలుపుతుంది, ఈ అక్షరాల, ఈ మాటల, పూల దండే కదా?

ఈ మంచి మాటల పలుకులే కదా, రోజూ గురువులు అందరికీ వందనాలు చేస్తుంది.

ఈ మంచి మాటలే కదా, కన్న తల్లి (లేదా ఇతర అక్క అన్న చెల్లి తమ్ముళ్ళు పెద్దలకు చిన్నలకు) కన్నీళ్ళు రోజూ తుడుస్తూ, మనశ్శాంతి నిస్తూ, ఆనందాన్ని ఇస్తూ, కోప తాపాలతో, 7 ఏళ్ళు మనతో సగర్వముగా, నేలపై నడిపించింది.

గురువులందరికీ ఉదయం శుభోదయం, శుభదినం, శుభ సంకల్పము అని మేలు కొలుపుతూ, రాత్రికి శుభరాత్రి, సుఖ నిద్ర, శుభ స్వప్నం అని నిద్రపుచ్చుతుంది, ఈ మాటలే.

లేకపోతే ఎక్కడ జిల్లా రాష్ట్ర అధికారులు, ఎక్కడ రాష్ట్ర ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు? వారికి విన్నపాలు వేడుకోలు అలాగే బాధ్యతను గుర్తు చేసే మాటలు పంపాలి అంటే, అక్షర జ్ఞానం ధైర్యం ఉండాలి.

ఆ సరస్వతీ కటాక్షం, దీవెనలు అండ ఉండాలి. ప్రయత్నం మాత్రమే మనది, పుణ్యం పాపం ఫలితం వారిది మరియు దేవునిది, మనము అది ఆశించకూడదు. మన మిత్రులు సర్ధుకోవచ్చు తప్పులు ను, కానీ అధికారులు ఇతరులు సర్దుకోలేకపోవచ్చు.

మంచి మాట మంచి పలుకు, మనశ్శాంతి ని ఇస్తుంది, బాధ్యతను గుర్తు చేస్తుంది, మంచి సమాజం వైపు, అలాగే దేవుని వైపు నడిపిస్తుంది.

మానసిక జపం మంత్రం పూజ, దేవుని కోసం కాదు మిత్రమా, మనకు దేవుడు ఇచ్చిన భాగ్యానికి, మనము సంస్కారముతో తల్లి దండ్రుల మంచి పెంపక బాధ్యతతో, క్రుతజ్ఞతలు తెలుపుటకు మాత్రమే సుమా.

పసిపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ అక్షర మాలను నేర్పుతాము. అలాగే మనము కూడ, నిరంతరం మంచి మాటలను చదువుతూ నేర్చుకుంటూ, మననము చేసు కుంటూ, మంచి వారిగా ఉందాము మంచిని పెంచుదాము. ఆ తల్లిని అలాగే మన తల్లిని, ఒక్క సారి మనసారా స్మరిద్దాము, ఫోటో వాట్సాప్ స్టేటస్ లో ఉంది.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా.

ప్రతి రోజూ పంపకపోయినా, మన వాట్సాప్ స్టేటస్ రోజు చూస్తూ, భుజం తట్టే, గురువు లందరికీ, ధన్యవాదాలు క్రుతజ్ఞతలు, మీ వలననే ఈ అక్షర కుసుమాలు, ఆ తల్లి ఈ తల్లి దీవెనతో, వ్రుద్ది చెందాయి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,443; 104 తత్వాలు (Tatvaalu) and views 224,675
Dt : 16-Feb-2021, Upd Dt : 16-Feb-2021, Category : Devotional
Views : 861 ( + More Social Media views ), Id : 977 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vasantha , panchami , rushi , begin , education , kids , thanksgiving day , adults , sarasvati
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content