స్వాతి ముత్యం - వటపత్ర శాయికి, వరహాల లాలి, రాజీవ నేత్రునికి - కమల్ హాసన్, రాధిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,440; 104 తత్వాలు (Tatvaalu) and views 225,600.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాతపాటలు మంత్రాలు శ్లోకాలు గుర్తుకు తెచ్చుకుంటూ, ఇతరులకు గుర్తుకు తెప్పిస్తూ వారిని సంతోషపెడుతు ఉన్నాము అంటే, గతం మరువలేదు, ఇంకా మనకు మూలాలు గుర్తు ఉన్నాయి, తల్లి దండ్రుల సేవ ఉంది, క్రుతజ్ఞతలు విశ్వసనీయత ఉంది, సంపాదన సౌకర్యాలతో మత్తు ఎక్కి కొమ్ములు మొలవలేదు అని కూడా ఒక సాక్ష్యం సుమా. మన పిల్లలు అదే క్రుతజ్ఞత నేర్చుకుంటే, మనల్ని దగ్గర పెట్టుకుని చూస్తారు, నడవలేనప్పుడు.

విశ్వనాథ్ గారి మంచి చిత్రాలలో ఇదొకటి. అమ్మ మనకు లాలి పోస్తూ లాలి పాటలు మాడటము చూసాము. అందులో దేవుని పేర్లు కలుపుతూ, ఆ దేవ దేవునికే లాలి పోస్తున్నట్లు తన్మయత్వముతో స్నానం చేపించడం, పాత రోజుల పద్దతి. మరి ఇప్పుడు నాగరికత పెరిగి, టబ్బులు వచ్చినాక, అసలు ఆ విషయమే మరచారు, తమ అమ్మలకు విడిచారు. అంత ఓపిక ఎవరికీ లేదు, కాళ్ళ మీద పిల్లడిని పండేసుకుని, తలస్నానము చేపించడం, ఎక్కడో ఓ నూటికి ఇరవై మందికి తప్ప.

చూడండి కమ్మటి పదాలు, వటపత్ర శాయికి, వరహాల లాలి , రాజీవ నేత్రునికి, రతనాల లాలి అంటూ, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి, పగడాల లాలి. కనీసం దేవుని లాలి పోస్తున్నట్లు నటిస్తూ, ఈ పాట అయినా, నోటితో పలికే ప్రయత్నం చేస్తారా, అందరికీ వినిపిస్తారా.

లాలీ.. లాలీ.., లాలీ లాలీ.. 2
వటపత్ర శాయికి, వరహాల లా.లి
రాజీవ నేత్రునికి, రతనాల లా.లి - 2 సార్లు మొత్తము
మురిపాల కృష్ణునికి..ఆ......
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి, పగడాల లాలి ||వటపత్ర శాయికి|| లాలీ.. లాలీ.., లాలీ లాలీ

కల్యాణ రామునికి, కౌసల్య లా.లి 2
యదువంశ విభునికి, యశో.ద లాలి 2
కరిరాజ ముఖునికి...ఈ ఈ
కరిరాజ ముఖునికి, గిరి తనయ లాలి 2
పరమాంశ భవునికి, పరమాత్మ లాలి ||వటపత్ర శాయికి|| లాలీ.. లాలీ.., లాలీ లాలీ

జోజో.. జోజో.. జో... 2

అలమేలు పతికి, అన్నమయ్య లా.లి 2
కోదండ రామునికి, గోపయ్య లా.లి 2
శ్యామలాంగునికి, శ్యామయ్య లాలి 2
అగమనుతునికి త్యాగయ్య లాలి ||వటపత్రశాయికి ||

లాలీ లాలీ సాంగ్-స్వాతి ముత్యం పాటలు - కమల్ హాసన్, రాధిక, ఇళయరాజా, Vishwanath

vatapatra sayiki varahala lali Swathi Mutyam Kamal Haasan Radhika Ilayaraja vishwanath

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,440; 104 తత్వాలు (Tatvaalu) and views 225,600
Dt : 05-Oct-2022, Upd Dt : 05-Oct-2022, Category : Songs
Views : 363 ( + More Social Media views ), Id : 1563 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vatapatra , sayiki , varahala , lali , swathimutyam , kamal , haasan , radhika , ilayaraja , vishwanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content