గ్రామ సర్పంచ్ ప్రెసిడెంట్, మన ఊరు ఎమ్మెల్యే ఎంపీ - మనకు భుజం తట్టి ధైర్యం చెపుతున్నారా? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,786,467; 104 తత్వాలు (Tatvaalu) and views 217,097.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కరోనా వంటి విపత్కర పరిస్థితి లో, మన గ్రామ సర్పంచ్ ప్రెసిడెంట్, మన ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ, మన జనం మధ్యలో మనకు అందుబాటులో ఉన్నారా?

మన మార్కెట్లు, మన కర్ఫ్యూ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు సడలింపు అని చెపుతున్నారా? సమాచారం అందిస్తున్నారా? వారు మన బజారు రాకపోయినా, కనీసం ఊళ్లో అయినా జనం గోడు వింటున్నారా? కనీసం, ఫోన్ మరియు వాట్సప్ లో అయినా, అందుబాటులో ఉన్నారా, తమ ప్రాంత ప్రజల రక్షణకు సహాయం కొరకు?

మనకు భుజం తట్టి ధైర్యం చెపుతున్నారా? మన మధ్య అప్పుడు అప్పుడు అన్నా పర్యటిస్తున్నారా? గ్రామ పట్టణ ప్రజలు, ఎవరి ఊరు లో, వారికి వారు చెక్ చేసుకోండి.

ఇప్పుడు పర్యటించరు కదా అనకండి లేదా అనుకోకండి. మన ఊరు పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ వాలంటీర్ లు, హేల్త్ కేర్ వర్కర్లు, పర్యటిస్తూ ఉన్నారు కదా , తగిన జాగ్రత్తలు తో. ఇప్పుడు ఎన్నికైన లేదా రేపు ఎన్నిక కావాలి అనుకునే వారు, తమ ఊరు లేదా గ్రామ ప్రజలను, తగిన కరోనా జాగ్రత్తలు తో, జనాన్ని కలవాలి భరోసా ఇవ్వాలి కదా.

కనీసం ఎన్నికైన ఊరు దగ్గరగా, అందుబాటులో ఉండి, చెత్త, కూరలు లేదా రేషన్ గురించి, ఫోన్ లో వాట్సాప్ అయినా అందుబాటులో ఉన్నారా ఉంటున్నారా?

అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకులు కూడా రాష్ట్ర పరిధిలో ఉన్నారా? లేక పక్కన రాష్ట్రం లేదా దేశాల నుంచి, సందేశాలను ఇస్తున్నారా? అది వారి నిబద్దతను ప్రజలకు తెలుపుతుంది.

చూసారు కదా, ఇటువంటి విపత్కర పరిస్థితి లో, ధనం కు విలువ లేదు. ధనము ఉన్నా కొనలేని పరిస్థితి కదా? కేవలం మంచి తనం కు, సహాయం, సహకారము కు మాత్రమే విలువ ఉంది. నిజమైన నాయకులు ఎవరో, కేవలం ఉత్సవ వినాయకులు విగ్రహాలు ఎవరో, మీ ముందుకు ఉదాహరణ ల తో సహా, ఈ కరోనా చూపిస్తున్నది.

కళ్ళు తెరచి చూద్దాం, వచ్చే ఎన్నికల్లో మన మంచితనాన్ని కూడా, ధనం, కులం, వర్గం, మతం ఆధారం కాకుండా, మంచితనం అందుబాటులో ఉండే, గుణం ఆధారంగా ఎన్నిక చేసుకుందాం.

ముఖ్యమంత్రి సహయ నిధి కి, సినిమా వారు రాజకీయ నాయకులు ఎంత విరాళాలు ఇస్తున్నారు గమనించండి. ఎవరికి వారే ఆత్మ విమర్శ, మంచి నిర్ణయం చేసుకోండి.

సర్వేజనా సుఖినోభవంతు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,786,467; 104 తత్వాలు (Tatvaalu) and views 217,097
Dt : 30-Mar-2020, Upd Dt : 30-Mar-2020, Category : Request
Views : 794 ( + More Social Media views ), Id : 457 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Corona , Covid 19 , politicians , village president , mla , mp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content