మీ కన్నా వారం ముందు, మేము ఇళ్ళు లో స్వచ్చంద నిర్భంధము, మా ప్రభుత్వం మాటలు గౌరవించి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1436 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1470 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇప్పుడే ఒక గురువు గారు, ఈనాడు లో ఆర్టికల్ పంపారు. వృద్ధులు ఇద్దరు గల్ఫ్ నుంచి వచ్చి, సహాయకులు ఎవరూ లేక తప్పనిసరి పరిస్థితి లో షాపులకు వెళుతుంటే, అదే అపార్ట్మెంట్ వారు భయంతో పోలీసులకు ఫోన్ చేశారు అనీ. తమకు తమ కుటుంబాలకు ఇబ్బంది అని వారి తో. వారు బయటకు వెళ్ళడము తప్పే, కానీ మార్గము చూపాలి కదా మనము లేదా తోటి వారు.

ఏవండీ, ఫోన్ చేసిన వారికి మానవత్వం ఉంటే, వృద్ధ దంపతులకు, సహాయం చేయవచ్చు కదా? కిటికీ లో నుంచి, సరుకులు చెప్పండి, మేము డోర్ బయట పెడతాము. మీరు తీసుకోండి, హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఉన్నాము, మాకు డబ్బు కు తొందర లేదు కొరవ లేదు అని చెప్పవచ్చు.

మా అక్క ఒకరే ఉంటేనే, మా బజారు జనం, కనీసం బాగున్నారా అని కూడా పలకరించరు. సెంటర్ కు వెళుతున్న కూడా, ఏదైనా కావాలా అని 5 ఏళ్లుగా ఎవరూ అడగరు. మనకు అసలు, అవతల వాళ్ళ మంచి గురించి, ఆలోచన అలవాటు లేదు కదా. మన ఇళ్ళు దగ్గర చదువుకునే పిల్లలు, వృద్ధులు, ఒంటరి వాళ్ళు ఉంటే, మానవత్వం తో సహాయం చేయండి, ఈ కష్ట సమయంలో.

నెలాఖరులోగా ఇద్దురు లే, ఆ డబ్బులు అంటామా ఉదారంగా, సరుకులు తెచ్చి 5 ఏళ్లుగా తెలిసిన వారైనా? అబ్బే, మనవంతు సహాయం చేయము. చేస్తే వారు బయటకు రారు కదా? అంటే వాళ్ళు తిండి లేకుండా బాధ పడాలా, లేక చావాలా?

అలా దూరం పెడితే, మనం ఎంత మందిని దూరం పెట్టాలో, ఒకసారి ఆలోచన చేయండి. తెలుగు వారికి పెద్ద విమానశ్రయం హైదరాబాదు లేదా బెంగుళూరు లేదా చెన్నై. కొంచెం చిన్న వి వైజాగ్ విజయవాడ తిరుపతి. గత రెండు నెలలుగా, ఎంతో మంది వీటిలో విమానం దిగి, హోటల్, కారు, సినిమా, ఆటో, బస్సు, రైలు లో స్నేహితులు బంధువులు తో తిరిగారు, షికారు లేదా ఇల్లు చేరడం కోసం. ఆ బంధువులు స్నేహితులు, మన పల్లెటూరు లేదా పట్టణం నుంచి ఉండవచ్చు కదా?

మరి ఆ ఊళ్ళు లో ఉన్న, మన పిల్లలు లేదా పెద్దలు, ఆ పెద్ద ఊర్లో ని రైలు, బస్సు, ఆటో, కారు, హోటల్ వాడకుండా నే మన ఊరు వచ్చారా? మరి వారికీ టెస్టు చేయించి దూరంగా పెడితే? ఇక ఎవరం ఎవరినీ కలవ లేము, మన పక్కన ఇల్లు వాళ్ళను కూడా నమ్మలేము. అలా మనం భయపడి, భయపెట్టకూడదు.

మానవత్వం లేని తప్పుడు ఆలోచన లు వద్దు. అవసరం అయితే వారికి సహాయం చేయాలి. అందుకే ప్రభుత్వం ఎవరినీ కూడా, బయటకు రావద్దని చెపుతుంది. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలీదు కదా. పైకి అందరమూ భక్తులమే, మరి గుడిలో ప్రసాదం ఏమైంది? సామెత తెలుసు కదా.

మొన్న నామినేషన్ కు వెళ్ళవద్దు అని, బయట ఊరక తిరగవద్దు అని, మా గురువు లందరికీ చెపితే నెల నుంచి, లెక్క లేకుండా, అందరూ బయట తిరుగుతున్నారు.

నిన్న ఒక పోలీసు అధికారి, ఇద్దరు కుర్రాళ్ళు ను బైకు మీద పట్టుకుని ఆపి అడిగితే, తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట, ఆసుపత్రి మందులు కు అని అబద్ధాలు చెప్పారు. వారిని మందలించి, వెనక్కి పంపారు ఇంటికి.

కుర్రాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు? తమ తల్లి దండ్రులు ను కదా? రేపు శిక్ష ఎవరికి? ఆ పిల్లలు మరియు ఆ తలి దండ్రులు కే కదా? పిల్లల ను ఇంట్లో ఆపండి లేదా వారితో పాటే వైరస్ చెల్లి, మన ఇంటికి వస్తుంది ఏమో కదా.

ప్రభుత్వం మాట వినండి. మీ కన్నా వారం ముందు, మేము ఇళ్ళు లో బందీలుగా ఉన్నాము. మా ప్రభుత్వం మాటలు, మా క్షేమం కోసం మే కాబట్టి.

మీరూ అంతే చేస్తారు కదూ. మన దేశాన్ని, మన జనాన్ని కాపాడే బాధ్యత మన చేతిలో ఉంది. మన ధనం ఇవ్వకుండానే, చెమట కక్కకుండానే, ఊరక మన ఇంట్లో మనం ఉంటే చాలు మిత్రమా?

వింటారు కదూ, తలవంచి నమస్కారం చేస్తూ ప్రాధేయపడుతున్నా, ఇంట్లో నే నమ్ముకున్న వారికి, అండగా ఉండండి. సర్వేజనా సుఖినోభవంతు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1470 General Articles, 48 Tatvaalu
Dt : 24-Mar-2020, Upd Dt : 24-Mar-2020, Category : General
Views : 535 ( + More Social Media views ), Id : 438 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona virus , stay at home , respect govt and police , help neighbors
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content