పాద పూజ చేసేటప్పుడు, రాగి చెంబు తో నీళ్లు తీసుకుని, పెద్దలు అంటే తల్లి దండ్రులు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,178; 104 తత్వాలు (Tatvaalu) and views 225,964.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

74 ఏళ్ల అమ్మ, గత 6 ఏళ్లుగా, శ్రీ రామ కోటి రాస్తుంది. జులై 3, 2020 కి 8 లక్షల 50 వేలు రామనామాలు అయినాయి. కష్టాలు మాత్రము తగ్గలేదు ఇంకా పెరిగాయి, కానీ మానసిక బలం కూడా తగ్గలేదు.

కరోనా కూడా ప్రేమతో, తనకు కావల్సిన అన్ని లక్షణాలు, అంటే బీపీ షుగర్ వర్టికో ఉన్న అమ్మ జోలికి రాలేదు, దేవుడైన రాముని దయవలన. ఇక ముందు కూడా రామ నామం ఆగదు ఆపదు. కరోనా వలన అమ్మ ఉదయం 5 కి లేవడం లేదా ఏ ఇతర కార్యక్రమం కూడా మారలేదు. అలాగని, కరోనా ను లెక్క చేయకుండా ఎదురు కూడా వెళ్ళలేదు, ప్రభుత్వ నియమాలను పాటిస్తూ, సొంత కషాయ వేప నిమ్మ కాకర రసాలు తాగుతూ, జాగ్రత్తలు తీసుకుంటుంది.

మీరు ధైర్యంగా ఉండండి, కరోనా మన అసలు శత్రువు కాదు. మన అజాగ్రత్తలు, మన నిర్లక్ష్యం, మన లెక్క లేనితనమే మన అసలు శత్రువు. అంటే మన చెడు అలవాట్లు మాత్రమే, మన జీవిత శత్రువులు. ప్రభుత్వం మాట వినండి, మీ పెద్దలు ను వదలి, అనవసరముగా ఫోటోలో దండతో ఉండకండి. వ్యక్తిగత సంస్కారం ముఖ్యం.

పాద పూజ చేసేటప్పుడు, రాగి చెంబు తో నీళ్లు తీసుకుని, పెద్దలు అంటే తల్లి దండ్రులు, అత్త మామలు, లేదా మన క్షేమం కోరే పెద్దలు ఎవరైనైనా, కుర్చీలో కూర్చొన బెట్టి, నమస్కారం చేసి, వారి కాళ్ళను పళ్ళెం లేదా తగిన దాని లో ఉంచి, చిన్నగా నీళ్ళు పోస్తూ, వేద మంత్రాలు లేదా వచ్చిన దైవ మాటలను పలుకుతూ, పాదాలను వెనక ముందు కడుగుతూ రుద్దుతూ శుభ్రం చేయాలి. పూర్తి అయిన తర్వాత, ఆ నీళ్ల ను నెత్తిన చల్లుకోవాలి.

ఆ తర్వాత దైవ పలుకు లు లేదా మంత్రాలతో పూలతో పూజించాలి. ఆ తర్వాత ఒక గుడ్డతో, ఒక్కొక్క పాదాన్ని తుడవాలి, అప్పుడు పళ్ళెం బయట, వారి పాదాలు ను పెట్టాలి.

ఇది త్రికరణ శుద్దిగా అంటే మనసా వాచా కర్మణా ఉండాలి చేయాలి. అన్ని ఇచ్చిన తల్లి దండ్రుల కు ఇలాంటి వి లక్ష చేసినా, వారు మనకు చేసిన దాంట్లో, ఒకటో వంతు భాగం కూడా రుణం తీర్చుకోలేము.

మీ తల్లి దండ్రుల పాదాలకు కూడా, నమస్కారం చేసే భాగ్యం కలిగించండి అని రాము, గోపీ తో చెప్పారు తమ మాత్రు పాద పూజా విధానం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,178; 104 తత్వాలు (Tatvaalu) and views 225,964
Dt : 05-Jul-2020, Upd Dt : 05-Jul-2020, Category : General
Views : 1757 ( + More Social Media views ), Id : 588 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : feet puja , parents , elders , water , copper jug
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content