డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా, పేదవాడు నాడే పుట్టాడమ్మా - తొలికోడి కూసింది - Movie - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అందమయిన లోకమని రంగురంగు
* ఆశలకి అంతముందా చెప్పమ్మా
* గడ్డిమేసి ఆవు, పాలు తాగి మనిషి
* తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా
* ముద్దు గులాబీకి, మొగలి పువ్వులోన
* ఉన్నవాడు తినడూ, పేదను
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

పల్లెటూరి అందాలను, మనుషుల్లో క్రూరత్వాన్ని నిర్దయను మోసం అహంకార బల ప్రదర్శనను, ఎంత బాగా చూపించారో చూడండి.

డబ్బు లేని వాడు కాదు, పేద వాడు. అన్ని ఉన్నా, మానవత్వం నీతి నిజాయితి స్తిరత్వం మనశ్శాంతి లేని వాడు, కంటి నిండా నిద్ర పోలేని వాడు, నిజమైన పేదవాడు, దరిద్రుడు.

డబ్బు ఉండి ఎక్కువై లేదా అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసలైన వారు, ఏమీ మంచి చేయలేని వారు, అన్నిటిలో నిజమైన పేదవారు.

ఎందుకంటే, ధనము ఎక్కువ చేరినప్పటి నుంచి, అతనిలో గుణ పరముగా, అరిషడ్వర్గాలు అన్ని అమాంతము పెరిగి పోయి, మంచి మానవత్వము సంస్కారము తగ్గిపోతాయి, కుటుంబ పతనము వైపు పరుగులు తీస్తాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనము లేదు కదా.

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి, విషమౌతాడు. మనిషి చాల దొడ్డాడమ్మా, తెలివి మీరి చెడ్డాడమ్మ, డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా, పేదవాడు నాడే పుట్టాడమ్మా - ఎంత అర్ధము ఉంది, ఈరోజు జరుగుతుంది అదే. ఆ ఉన్నవాడు తినడూ, ఈ పేదను తిననివ్వడూ.

అమ్మ పాలు తాగి, ముదుసలి నాన్న అమ్మకు తమ తోటి సౌకర్యాలు భాగ్యాలు ఇవ్వడానికి తమతో పెట్టుకోవడానికి, ఇష్టపడని మూర్ఖులు మన చుట్టూ ఉన్నారు, ఎన్నో నిందలు కారణాలు వారి మీద వేసి. ధనం విసిరి ఇంట్లో లేదా ఆశ్రమం లో పడేస్తున్నారు ఒంటరిగా అనాధలుగా. మీ సేవకు మేము పనికి రాము అని.

ఎంత ముచ్చటగా లోకం తీరు చెపుతుందో చూడండి, ఈ పాటలో అక్క గా, చూడలేని చెల్లెలికి, తానే కళ్ళు అయ్యి.

ప్రతి మాటలోనూ, మనము సిగ్గు పడే, బుద్ది తెచ్చుకునే పదాలు ఎన్నో, మనసు తో ఆస్వాదించండి, మధుర గాయని కంఠముతో.

ఓ ఓ...
అందమయిన లోకమని., రంగురంగులుంటాయని, అందరు అంటుంటారు రామ రామా..
అంత అందమైంది కానే. కాదు చెల్లెమ్మా.
చెల్లెమ్మా..., అందమైంది కానే కాదు చెల్లెమ్మా - 2

ఆకలి ఆశలు, ఈ లోకానికి, మూలమమ్మా
ఆకలి ఆశలు, ఈ లోకానికి, మూలమమ్మా, ఆకలికి అందముందా రామ రామా..
ఆశలకి అంతముందా చెప్పమ్మా, చెల్లెమ్మా.., ఆశలకి అంతముందా చెప్పమ్మా..
||అందమయిన లోకమని ||

గడ్డిమేసి ఆవు.. పాలిస్తుంది, పాలు తాగి మనిషి.., విషమౌతాడు 2
అది గడ్డి గొప్ప తనమా.., ఇది పాల దోష గుణమా.. 2
మనిషి చాల దొడ్డాడమ్మా చెల్లెమ్మ, చెల్లెమ్మా.., తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..
||అందమయిన లోకమని ||

ముద్దు గులాబీకి.. ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన.. నాగుంటాది 2
ఒక మెరుపు వెంట పిడుగూ.., ఒక మంచి లోన చెడుగు..
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా, చెల్లెమ్మా.., లోతుకెళ్తే కథే వేరు పిచ్చమ్మా
||అందమయిన లోకమని ||

డబ్బు పుట్టి మనిషీ.. చచ్చాడమ్మా, పేదవాడు నాడే.. పుట్టాడమ్మా 2
ఆ ఉన్నవాడు తినడూ.., ఈ పేదను తిననివ్వడూ..
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా, ఈ. లోకం., కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా..

అందమయిన లోకమని రంగురంగులుంటాయని అందరు అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా, చెల్లెమ్మా అందమైంది కానేకాదు చెల్లెమ్మా

తొలికోడి కూసింది, దర్శకత్వం కె.బాలచందర్, తారాగణం శరత్‌బాబు, సీమ, సరిత, మాధవి, జీవా

toli kodi kusindi, Tholi Kodi Koosindi, Balachander, Saritha, Madhavi, Sarath Babu, Seema , Jeeva, Andamaina Lokamani  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 31-May-2021, Upd Dt : 31-May-2021, Category : Movie
Views : 602 ( + More Social Media views ), Id : 1183 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andamaina , lokamani , dead , poor , toli kodi kusindi , chicken , balachandar , Saritha , madhavi , sarath , sima , jiva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content