పిల్లలు భాగస్వామి రానంటే, బలవంతముగా తీసుకుని వెళ్ళావు, తల్లితండ్రులు మాత్రం అక్కడే?-అనగనగా Parody - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,373,525; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

* అబ్బాయి ఎలా ఉన్నావు? ఎక్కడ ఉద్యోగం? అంతా బాగున్నారా?

బాగున్నాము అండి. బెంగళూర్ (ఇంకో పెద్ద నగరం, ఇంకో రాష్ట్రం లేదా ఇంకో దేశం అని అనుకోవచ్చును) లో ఉద్యోగం, అంతా బాగానే ఉన్నాము.

* అక్కడ ఒక్కడివే స్నేహితులతో ఉంటున్నావా? పిల్లలూ ఫామిలీ మన ఊళ్ళో ఏనా?

మీరు భలే వారే, ఫామిలీ పిల్లలూ నా తోనే ఉండాలి. వారంటే ప్రాణం, పెళ్ళి చేసుకున్నాక, జీవిత భాగస్వామి పక్కన ఉండాలి కదా.

* మరి అమ్మమ్మా తాత ల బాబాయి అత్తల తో ఉండాలని పిల్లలు, పెద్ద నగరం లో కష్టము తన మన తోడు ఉండరు, భధ్రత ఉండదు ఇక్కడ అందరూ మనవారు, మీ తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు, ఉండారు అని ఇల్లాలు, పోరు పెట్టలేదా?

ఎందుకు పెట్టలేదండి. పిల్లలు మారాము చేసారు రామని, మా వాళ్ళు అంతే. మనతోనే ఉండి, మన సౌకర్యాలు అన్ని అనుభవించాలి కదండీ. సినిమాలు, షికార్లు, కారులు, పార్క్లు, ఆ వైభోగమే వేరు కదండీ, మెట్రోపాలిటన్ సిటీ మీరు ఎప్పుడూ రాలేదా?

* లేదయ్య, నాకు ఆ భాగ్యం కలగలేదు. మరి మన ఊళ్ళో తక్కువ ఖర్చు తో చదువులు అవుతాయి కదా పిల్లలకు? నీకు భవిష్యత్ సేవింగ్స్ ఉంటాయి.

భలే వారే, మా పిల్లలకు ఇంటర్నేషల్ లేదా మంచి స్కూల్ లో సీటు ఇప్పించాను, మా ఫామిలీ మొత్తానికి కార్పొరేట్ వైద్యము అందుతుంది అండి. అందుకే నా కుటుంబము మొత్తము, నాతో నే ఉండాలి, మారాం చేసినా వదలను, ఎంత ఖర్చు అయినా జడవను, కంటికి రెప్పలా కాచుకోవాలి.

* మరి ఖర్చుకు ధనముకు ఇబ్బంది లేదా? విదేశాల కు యోగము ఉందా?

అయ్యో ఫ్లాట్ లు కొన్నాను, ఆస్తులకు ధనంకు లోటు లేదు. ఉందండీ, మా వాళ్ళనందరినీ వీసాలతో విదేశాలకు కూడా తీసుకుని వెళ్ళవచ్చును, ఇబ్బంది లేదు. మా పిల్లల సేవలకు మంచి చెడుకు, తల్లి దండ్రులను అత్త మామలను కూడా, 6 నెలలు తీసుకుని పోవచ్చును, అన్ని పనులు చేయించుకోవచ్చును.

* మంచిది, భార్యా పిల్లలు అంటే ఆమాత్రం ప్రేమ బాధ్యత ఉండాలి, 10 ఏళ్ళ పెళ్ళితో. శభాష్.

మరి మీ పెద్ద వయసు, అమ్మా నాన్న పరిస్తితి? అక్కడ చిన్న ఊళ్ళో ఉన్న సౌకర్యాలతో ఇబ్బంది కదా?

వారికేమండి చిన్న ఇల్లు ఉంది, నేను ధనం పంపిస్తాను ఎవరిని చేయి చాచకుండా. మా తమ్ముడు చెల్లి వాళ్ళు చూస్తారు. హాయిగా అక్కడే కాలం గడిపేస్తారు.

* మరి నువ్వు పట్నం రాండి, మంచి వైద్యము ఇప్పిస్తాను అని బలవంతము చేయలేదా?

అడిగానండి, వారు మన మాట వినరు, అక్కడే ఉండి, అక్కడే పోవాలని వారి ఆశ. వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడము.

* మంచి వాడివయ్య, 10 ఏళ్ళ పెళ్ళితో వచ్చిన వారి మీద ప్రేమ మోహం బాద్యత, 40 ఏళ్ళు కని పెంచి ఈ స్థితికి తెచ్చిన మరియు వచ్చిన వారి మీద లేదు కదా?

పిల్లలు రానంటే, బలవంతముగా తీసుకుని వెళ్ళావు, ఎంత ఖర్చు అయినా భరించి దగ్గర ఉండాలి అంటావు. పట్టణ సౌకర్యాలు సుఖాలు చూపించాలి అన్నావు. కళ్ళకు రెప్పలా కాచుకోవాలి అన్నావు.

ముదుసలి తల్లి తండ్రులు మాత్రం అక్కడే సర్దుకుంటారు అంటావు. రేపు వారికి ఏమి జరిగినా, మన రావడానికి ఒక పూట కనీసం.

ఏమి చేద్దాం రోజులు అలా ఉన్నాయి. రేపు మన బతుకులు కూడా అంతేలే.

పాత రోత, కొత్త వింత అంటే, ఏరుదాటాక తెప్ప తగలేయడం అంటే, విసిరేసిన ముద్ద తిన్న కుక్కకు ఉన్న విశ్వాసం పిల్లలకు ఉండదు అంటే, ఇదే కాబోలు. కలికాలం.

కూతుళ్ళు అయినా అంతే నండి, కొడుకు చూడనప్పుడు, తర్వాత బాధ్యత కడుపున పుట్టిన, పసుపు కుంకుమ తో వెళ్ళిన, కూతుళ్ళదే కదా.

విడియో పాట వినండి.

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఊహూ 2
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న ఆ 2 ||అనగనగా ||

ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండి కూడ చవటలయ్యారు ఒట్టిచవటలయ్యారు ||అనగనగా ||

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడూ, అయ్యో ఇంటి దీపమార్పివేయనెంచెనొక్కడూ
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడూ 2
పడుచు పెళ్ళామే బెల్లమని బ్రమసెనొక్కడూ ఊ బ్రమసెనొక్కడూ ||అనగనగా ||

కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెనూ 2
కంటిపాపకంటె ఎంతొ గారవించెనూ 2
దానిగుండెలోన గూడుకట్టి ఉండసాగెను ||అనగనగా ||

నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 2
కూరిమిగలవారంతా కొడుకులేనురా 2
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా ఆ కుక్కమేలురా ||అనగనగా ||

సాహిత్యం: ఆత్రేయ, ఎంటీయార్, ఆత్మబంధువు Atmabandhuvu NTR Savitri

-

*పిల్లలు భాగస్వామి రానంటే, పట్టుబట్టి తీసుకెళ్ళావు, తల్లితండ్రి మాత్రం ఊళ్ళో?- అనగనగా Parody*

సినిమా థియేటర్ లేదా ఓటీటీ లో మనకు పొగ, తాగుడుకు హానికరం అని రాస్తారు. ఎవరూ ఫీల్ కారు, బాధపడరు, తిట్టరు, అలగరు, సినిమా చూడటం మానరు. నచ్చకపోతే, గమ్ముగా ఉంటాము. అలాగే మంచి మాటలు ఏవైనా, అవి ఎవరినీ ఉద్దేశ్యించినవి కావు, మంచి వారు ఎవరు తమ భుజాలు తడుముకుని, గుడ్డలు చించుకోరు - వారు మేము అలాంటి తప్పుడు పనులు చేయలేదు, చెయ్యము అని ఆనంద పడతారు. తల్లి దండ్రులను, కంటికి రెప్పలా దగ్గర ఉంచి కాపాడతారు.

ఇక నిజమైన తప్పుడు వారి మాటలు చేష్టలు, మనము పట్టించుకోకూడదు ఎటూ. రావణ దుర్యోధన రాక్షస ప్రవ్రుత్తి వారు దూరముగా వెళతాము అంటే, తల వంచి నమస్కారం పెట్టడమే. దొంగ ని దొంగ అంటే, ఊరుకుంటాడా? నేను దొంగను కాదు అని, వీరంగం చేస్తాడు పెద్దగా అరుస్తూ, ఎక్కడ బయట పడుతుంది అని భయముతో.

ఒకనాడు, కేవలం కొడుకులే హ్రుదయం లేని బండరాయిలుగా కధనాలు చూసాము. ఇప్పుడు అన్నిటిలో, మగవారిని మించి మహిళలు ఉన్నారు. అత్తను చూడము అన్నిది పాత మాట, అమ్మను కూడా చూడం అన్నది నేటి మాట. అసలు ముదుసలి వారే మాతో వద్దు అన్నది ఎక్కువమంది బాట.

గతం అలాగే క్రుతజ్ఞతలు మరచి, అనాధలుగా వదిలేయడంలో, పుట్టిల్లు మెట్టిల్లు కు సమాన స్థానం. ఇది నేటి ఉత్తముల ఆలోచనా తీరు. పెరుగుతున్న ఖాళీ లేని వ్రుద్దాశ్రమాలు దీనికి సాక్ష్యం. కాలం కర్మ ఎవరినీ విడువదు. పంచభూతాలు మనల్ని వదలవు.

పెళ్ళి కి గుణం అన్నది అసలు విలువ లేనిది, ధనము వీసా హోదా అవసరం అవకాసం మాత్రమే ముఖ్యం, ఇది నేటి పతన సిద్దాంతం. రేపు జీవిత భాగస్వామికి రోగము వచ్చి మంచము ఎక్కినా, నిర్దాక్షిణ్యముగా వదిలేయడానికి రెడీ, ఉపయోగం లేకపోతే పాత చాపను, కుక్కను, ఆవును, బర్రెను కూడా ఇంట్లో ఉంచము కదా అంటున్నారు. ఇది కూడా తెలియకపోతే, మీరు ఎప్పుడు ఎదుగుతారు అంటున్నారు మనల్నే గేళి చేస్తూ.

ఎంతో మంది తల్లి దండ్రుల కన్నీటి కధలు విన్నాము, మాట్లాడాము, చూసాము. వాటి ప్రతిఫలమే ఈ పాట, వారికే అంకితం.

కానీ పిల్లా పాపలతో, ముదుసలి తల్లి దండ్రులను ఇంట్లో పెట్టుకుని, రోజూ చేయిపట్టి నడిపించే ఉత్తములు నూటికి 10 మంది ఉన్నారు, గుడిలో ప్రతి వారం చూస్తున్నాము.

అనగనగా ఒక నాన్న, అనగనగా ఒక అమ్మా, ఊహూ 2
నాన్న గుణము మిన్న, అమ్మ మనసు వెన్న ఆ 2 ||అనగనగా ||

ఆ నాన్నకు ఐదుగురు పిల్లలున్నారు
వారు చదువు సంధ్యలుండి కూడ, చవటలయ్యారు, గతం మరచిపోయారు, దూరంగా ఉంచి ధనం విదిలించారు ||అనగనగా ||

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కరు, అయ్యో ఇంటి దీపమార్పివేయనెంచెనొక్కరు
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కరు, ఇంట్లో స్థానమే లేదని పలికొనొక్కరు
జీవిత భాగస్వామే బెల్లమని, బ్రమసెనొక్కరు ఊ బ్రమసెనొక్కరు, చేతి ప్రేమ బరువన్నారు||అనగనగా ||

పిల్లలతో పాటు, తండ్రి కుక్కను పెంచీ, ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెనూ 2
కంటిపాపకంటె, ఎంతొ గారవించెనూ , పిల్లల కంటే జంతువులే ఎక్కువాయేను 2
దానిగుండెలోన, గూడుకట్టి ఉండసాగెను ||అనగనగా ||

నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 2
కూరిమిగలవారంతా, పిల్లలేనురా, గుణవంతులే మన ఇంటి అండాయెరా
జాలిగుండె లేని పిల్లల కన్న, కుక్కమేలురా ఆ కుక్కమేలురా ||అనగనగా ||

మీరూ పాడి, ఆ వ్రుద్ద తల్లి దండ్రులకు, సంఘీభావం తెలియ చేస్తారు కదూ.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,525; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985
Dt : 01-Jan-2021, Upd Dt : 01-Jan-2021, Category : Songs
Views : 1102 ( + More Social Media views ), Id : 904 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wife , children , kids , come , forcibly , taken away , mother , father , there , village , town , atmabandhuvu , ntr , ANAGANAGA OKA RAJU
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content