ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ లకు కేంద్ర ఇచ్చిన, 10 శాతం రిజర్వేషన్లు అమలు ఎప్పుడు జగనన్నా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,162; 104 తత్వాలు (Tatvaalu) and views 225,894.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Update on 1/22/2021

గుర్తు ఉందా, మనం జగనన్న ను ఓసీ ఆర్థిక రిజర్వేషన్లు గురించి కోరుతూ, అందరూ నాయకుల కు విన్నపాలు పంపాము. మరోసారి గుర్తు చేద్దాం. జగనన్న ఆల్రేడి ఒప్పుకోని ఉంటే చెప్ప గలరు.

తెలంగాణ ప్రభుత్వం, ఆర్ధికంగా వెనుకబడిన ఓసీలకు కేంద్రం ఇచ్చిన, 10 శాతం రిజర్వేషన్లు, అమలు కు ఓకే అన్నది. కేసీఆర్ గారు ఈ మధ్యనే ముందుకు వచ్చారు, మిగతా రాష్ట్రాలు ఎప్పుడో అమలు చేసినా.

ఇందులో కూడా ముందు ఉండాల్సిన మన జగనన్నను, చాలా విషయాలు లో తప్పు దోవలో నడుపుతున్న సలహా దారులు, మరి ఇప్పుడు అయినా కేసీఆర్ చూపిన బాటలో ముందుకు తీసుకుని వెళతారో, లేదా ఇంకా ప్రతిపక్షాలు మేల్కొని ధర్నా లు చేసిన తర్వాత, ముందుకు వస్తారో చూద్దాం.

మనకెందుకు ఆ అపవాదు జగనన్న, కేంద్రం ఇచ్చినది కాబట్టి మిగతా పధకాలు లాగా, దీనిని అమలు చేయాలి, లేదంటే ఆ మిగతా పధకాలు ఆపాలి కదా అని నచ్చ చెప్పి, ముందుకు వెళదాం అంటున్న అభిమానులు.

దేవుడు వరం ఇచ్చిన కూడా, పూజారి ఆపడం అంటే ఇదే కదా. రైతులకు మీటర్లు బిగించాము కదా అలాగనే.

రాష్ట్రంలో లో బీజేపీ, తెదేపా, జనసేన నిద్ర లో కాబట్టి సరిపోతుంది కానీ, లేకపోతే ఊరక ఉంటారా ఇన్నాళ్లు? దేవాలయాల కోసం దేవుని కోసం చేసిన ధర్నా లు, బీద ప్రాణ మున్న మనుషులు కోసం చేయరా?

Original :

In Jan 2019, the Narendra Modi government had approved 10% reservation for EBCs in Education and Employment and had accordingly amended the Constitution, to add it to the existing 50 % quota for SCs, STs and OBCs.

General category individuals, whose total family income is less than Rs 8 lakh per annum and who have less than 5 acres of agricultural land, will qualify for the same.

చంద్రన్న మోదీ గారికి, జై అంటారు ఇప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నై అన్నారు. జగనన్న, మోదీ గారికి జై అంటారు. మోదీ గారంటే ఉన్న భయ భక్తి గౌరవం తో.

కానీ మోదీ గారి లా, ప్రభుత్వ ప్రజా పన్నుల తో చేసే కార్యక్రమాలకు, తమ పేరు పెట్టకోకుండా నిస్వార్థంగా చేద్దాం, అని సలహాదారులు చెప్పరు.

చంద్రన్న పెట్టుకున్న పధకాలు పేర్లు, ఆ తర్వాత గెలిపించలేదు అని తెలిసికూడా, అదే దోవలో జగనన్న పధకాలు.

మన మంచి పనులతో, ప్రజల గుండెల్లో పేరు నిలవాలని, బయట పధకాలు పేపర్లు ప్రకటన లో కాదని, ఎవరు చెపుతారు మన జగనన్న కు, చంద్రన్నకు?

బీజేపీ వాళ్ళు, మోదీ గారి పేరు చెప్పుకుని, 10 ఏళ్లుగా ఆంధ్రా లో, నెట్టుకు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ ని చూసి, పోరాట పటిమ నేర్చుకోరు, స్ధానికంగా పట్టణ గ్రామాల్లో బలపడరు బలపడనీయరు.

రాష్ట్ర నాయకుడు మారినా, వారి ధ్యేయం ఒకటే, రాష్ట్రం నుంచి ఒక్క సీటు కూడా, మోదీ గారికి బహుమతిగా ఇవ్వకూడదని, ఎన్నేళ్ళు గడచినా. ఇప్పటి వరకూ ఇవ్వలేదు కదా, రెండో పార్టీ అండ లేకుండా?

జనసేన, ఏకో నారాయణ సేన. రెండో నాయకుడు, కనపడడు, వినపడడు. స్ధానికంగా ఎదగరు, చాటుగా ఉంటారు. అభిమానులు వేరు, బాధ్యత గలిగిన కార్యకర్తలు వేరు అని ఎన్నటికీ తెలుసుకోరు.

ఎందుకంటే కేంద్రం అనుమతించిన పధకాలు కూడా, ఇక్కడ సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అని కేంద్ర శాతం పబ్లిక్ గా చెపుతున్నారా అని, స్ధానికంగా గ్రామ పట్టణాలలో, పై పార్టీల వారు, ఎవరూ గొంతెత్తి అరవరు. స్ధానిక నాయకులు కు మార్గ దర్శకం చేయరు, వారిని ఉత్తేజ పరచరు.

కేంద్రం 10 శాతం ఆర్ధికంగా వెనుకబడిన, ఓసీ లకు వరంగా ఇస్తే, ఆంధ్రా లో ఎప్పుడు మొదలు పెడతారు, ఎందుకు చేయరు అని, రాష్ట్ర బీజేపీ జనసేన టీడీపీ నాయకులు, గట్టిగా నిలదీయరు, అడగరు. జగనన్న అంటే, వీరికి భయం భక్తి లేదా కులాల నటన మత్తులో, ఓసీ లు కనపడరు.

56 బీసీ కార్పోరేషన్ లకు అధ్యక్షులు పెట్టిన జగనన్న కు, ప్రభుత్వ పధకాలు పేరు లో కూడా, బీసీ లకు ఎస్సీ ఎస్టీల కు రిజర్వేషన్లు కల్పించి, వారి పేర్లు ఎందుకు పెట్టరు అని అడగరు, అని ప్రజల అభిప్రాయం.

జగనన్న కూడా ధైర్యంగా, ఓసీ ల లో కూడా, ధనం లేక ఇబ్బందులు పడే ప్రజలు ఉన్నారు, అని గుర్తించరు. ఓసీ మంత్రులు కూడా గుర్తు చేయరు, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.

నిన్న చీరాల బీజేపీ జనసేన అర్జీలు ఇచ్చారు దీని కోసం ఎమ్మార్వోకు, 10 శాతం అమలు కు. సంవత్సరం గా అన్ని పార్టీలు గమ్ముగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు లేకుండా, అంటే ఆల్రెడీ అమలు జరుగుతుందా, స్థానికంగా వీరికి తెలీదా?

జగనన్నా, సలహాదారుల మాయలో నుంచి, బయటకు వచ్చి, ప్రజల కష్టాలు కన్నీళ్ళు చూడన్నా. 10 శాతం ఆర్ధికంగా వెనుక బడిన, ఓసీ నిరుపేదలకు దోవ చూపించు అన్నా, అంటూ ఆర్తిగా అలమటిస్తున్న ప్రజలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,162; 104 తత్వాలు (Tatvaalu) and views 225,894
Dt : 21-Oct-2020, Upd Dt : 22-Jan-2021, Category : General
Views : 766 ( + More Social Media views ), Id : 770 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : implement , 10 % percent , reservation , center , modi , financially backward , ocs , jagan , chandra babu , pawan , veerraaju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content