నిజమైన వారసులు/ పిల్లలు ఎవరు? మొక్కుబడిగా విధిలేక జనం కోసం ఆస్తి కోసం, చితికి నిప్పు పెట్టేవారా? - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,874; 104 తత్వాలు (Tatvaalu) and views 230,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, నిజమైన వారసులు/ పిల్లలు ఎవరు? మొక్కుబడిగా విధిలేక జనం కోసం ఆస్తి కోసం, చనిపోయాక చితికి నిప్పు పెట్టేవారా లేదా అటెండెన్స్ వేసుకునేవారా? మంచాన పడ్డ లేదా నడవలేని లేదా నిస్సహాయత రోజు నుంచి, నిస్వార్ధముగా నీళ్ళు మందులు ఇచ్చినవారా? లేదా కనీసం, ప్రేమ గా రోజూ మాట్లాడి మనశ్శాంతి ధైర్యాన్ని భవిష్యత్ ఆశను ఇచ్చే బయట వారా?

Who are the real heirs/ children? just for act/ public/ assets, set fire to the pyre or visit after death? give medicine water from the Bedridden or unable to walk or helpless? Or at the very least, other folks, speak daily with love and give you peace of mind, courage, Hope for future?

జవాబు - ఇక్కడనే సంస్కార పెంపకం, పిల్లలకు క్రుతజ్ఞతలు విశ్వసనీయత దయ జాలి మానవత్వం నేర్పిన, ఉత్తమ తల్లి దండ్రుల బ్రతుకు సఫలం అయ్యేది.

మనము జంతువులము కాదు, అవసరం తీరాక ఎగిరిపోకూడదు/పారిపోకూడదు/వదలిపోకూడదు, క్రుతజ్ఞత విశ్వసనీయత లేని నక్క/ క్రూర మ్రుగము లాగా, అని పిల్లలకు నేర్పిన సంస్కారులే, ముదుసలి తనము లో సుఖముగా గౌరవముగా దేవతలు గా, తమ పిల్లలతో ఉంటారు, పూజింపబడతారు.

ఎందుకంటే వీరు కూడా, మాత్రుదేవోభవ, పిత్రుదేవోభవ అని ఆచరణలో చూపారు, నేర్పారు, అరిషడ్వర్గాలను జయించారు, తమ యుక్త వయస్సులో.

చేతి స్పర్శ, ప్రేమ గా ఓ మాట, దీనికి ఉన్న మందు బలం గుణం, ఇంక దేనీకీ లేదు ప్రపంచములో. ఒక చెయ్యి ఇంకో చెయ్యిని పట్టుకుంటే చాలు, ప్రాణము తిరిగి వస్తుంది. అమ్మ 77+ దాకా ఉండటానికి, అసలైన మందు, ఇదే. లేకపోతే, 2015 లోనే ఇక ఉండరు, అని ప్రపంచ స్థాయి వైద్యుడు చెప్పింది, మీకు తెలుసు పాతవి చదివి ఉంటే. దూరంగా ఉన్నప్పుడు కూడా, రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం ఫోన్.

పెళ్ళైన వారిని అడగండి, రాత్రి భాగస్వామి ఉండాలి, పగలు పిల్లలు ఉండాలి దగ్గర అంటారు. లేకపోతే తమ బ్రతుకు వ్రుధా అంటారు, కపట నటన ప్రాపంచిక మోహములో. కానీ తమను కన్న లేదా భాగస్వామిని దానమిచ్చిన/ అమ్మిన (కొనడం కూడా అంతే తప్పు సుమీ) ముదుసలి వారు, వీరికి సాటి మనుషులు గా కనపడరు. వారి చెమట రక్తముతో, వీరు ఎదిగి, దానిని మరుస్తారు. 3 కంపెనీలు ఇళ్ళు వ్యాపారాలు 100 మంది జనము తో తిరుగుతారు, కానీ ముదుసలి వారితో సమయం వీరికి ఉండదు.

ఎందుకంటే, పగలు మరియు రాత్రి కాకపోయినా, కనీసం ఉదయ సంధ్య వేళ మరియు సాయం సంధ్యవేళ అయినా, ముదుసలి అమ్మ నాన్న అత్త మామ, మా దగ్గర ఉండాలి అని అనుకోరు. గతములో నే అనుకున్నాం, మనసున్న బీదవాడు అందరికీ దూరంగా ఉంటాడు, సమాన స్థాయిలో. స్వార్ధముతో తన సుఖము మాత్రమే కోరుకోడు.

ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల ను తమతో ఉంచుకుని బాధ్యత గా చూడలేని చవటలకు/ మూర్ఖులకు (ఆడ మగ ఇద్దరు), పెళ్ళి అనవసరము. శరీర సౌఖ్యం కోసం పెళ్ళి చేసుకున్నా కూడా, వారు పిల్లలకు భాగస్వామికి మంచి చేయలేరు, సంస్కారం నేర్పలేరు, మనశ్శాంతి ఉండదు, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు వీరు.

వీరి ముదుసలి తనములో గౌరవముగా పిల్లలతో ఉండలేరు, ఇదే 80 శాతం నిరూపణ అయ్యింది. కలియుగం 100 శాతం పాపం/ ప్రళయానికి చేరడానికి, వీరే శతవిధాలా సహాయం చేస్తున్నారు, దీనికి మాత్రం వీరిని మెచ్చుకోవాలి.

క్రిష్ణుడే ఎప్పుడో చెప్పారు, బంధం కన్నా ధర్మం గొప్పది. క్రిష్ణునికి తలకొరివి పెట్టింది, అర్జునుడు, సొంత పిల్లలు కాదు సుమా.

చచ్చాక ఎవరు తలకొరివి పెట్టారో, దానికి విలువ లేదు, బతికి ఉన్నప్పుడు ఎవరు ప్రేమగా చూసారో, ఎవరు ప్రేమగా మాట్లాడారో దానికి మాత్రమే విలువ ఉంది. శాస్త్రం లో చెప్పింది, త్రికరణ శుద్దిగా ప్రేమతో ఉన్న సంతానం గురించి మాత్రమే, విశ్వాసఘాతక సంతానం ల గురించి కాదు.

దగ్గర ఉండి చూసుకోని కుసంస్కారులు, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు, తలకొరివి పెడితే, అది నరకానికి దోవ అవుతుంది. మనము చేసుకున్న పాపాలకు, ఇది అదనము పాపము అవుతుంది అంటారు పెద్దలు.

కాబట్టి నిజమైన వారసులు/ పిల్లలు ఎవరు?

1 - ఉత్తములు - మనల్ని కనీసం మంచాన పడ్డ లేదా నడవలేని లేదా నిస్సహాయత లేదా రోగంతో అల్లాడుతున్న రోజు నుంచి, నిస్వార్ధముగా తమతో పాటుగా ఇంట్లో దగ్గర ఉంచుకుని, వీలైతే తమతో రోజూ నడకకు ఇతర ఆనందాలకు తీసుకువెళుతూ, సొంత ధనముతో, నీళ్ళు మందులు ఆహారం ప్రేమ గౌరవం మర్యాద ఇచ్చిన వారు. వీరు మొదటి నుంచి కూడా, భూత దయ జాలి సంస్కారం తో ఉంటారు - అది సొంత పిల్లలు అయినా బయట వారైనా. మానవ/నర సేవ మాధవ/నారాయణ సేవ అని త్రికరణశుద్ది గా భావించి పాటించేవారు. అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించిన వారు వీరు. 3 మంచి పిల్లలు ఉన్నా, అందరూ పోటీ పడతారు, ఉత్తమ వైద్యం సేవ మనశ్శాంతి అందచేయడానికి, తమ స్థాయిని బట్టి.

ఫించన్ లేదా ఇతర ధన ఆస్తి పదవి హోదా వీసా అందం ఆశతో, చూసే వారు, ఈ తరగతికి చెందరు. ఎందుకంటే అవి అందినాక, వీరి విక్రుత రూపం చూపుతారు, కాబట్టి అధములు అవుతారు.

2 - మధ్యములు - కనీసం, ప్రేమ గా ప్రతి రోజూ ఉదయం సాయంత్రం మాట్లాడి మనశ్శాంతి ధైర్యాన్ని భవిష్యత్ ఆశను ఇచ్చే, అప్పుడు అప్పుడు వచ్చి చూస్తూ పలకరిస్తూ, సహాయం చేస్తూ అండగా ఉండే, బయట వారు అంటే కడుపున పుట్టిన వారు కాదు. వీరు అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించిన వారైతే, వీరూ ఉత్తములే. ఎందుకంటే, మానసిక బలం ఇస్తారు. అంటే సొంత పిల్లలు ఈ తరగతికి చెందరు.

3- అధములు - మొక్కుబడిగా, విధిలేక జనం కోసం, ఫించను, ఆస్తి లేదా ఇంకోదాని కోసం వ్యాపారముగా, పెంచిన విశ్వసనీయత క్రుతజ్ఞతలు లేకుండా, కపట నటన ప్రాపంచిక భ్రాంతిలో, చనిపోయాక చితికి నిప్పు పెట్టేవారు లేదా అప్పుడప్పుడు అటెండెన్స్ వేసుకునేవారు. పాపభీతి దైవ భక్తి వీరికి ఉండవు. వీరు రాకపోతేనే, మనకు పుణ్యం.

సొంత పిల్లలు మొక్కుబడిగా, గతము మరచి, ఆరోగ్యం లేదా ఇతర అవసరాలు, ధనం ఆస్తి ఇచ్చి, బయటవారికి ఏదో దయా ధర్మముగా చేయించినట్లు ఇతరులతో చేపిస్తారు. తమ ఇంట్లో తమ తో ఉంచుకోరు, పైన కింద దగ్గరలో కూడా, కొంత మంది ధూర్తులు ఉంచుతారు. ఇంకొంతమంది తల్లి దండ్రుల ఆస్తులనే అమ్మి సేవ చేస్తున్నట్లు నటించి, పెద్దల ధనం అయిపోగానే, దిక్కుమాలిన వారిగా దూరంగా పడేస్తారు. వీరంతా అధములే. ఈ 3 వ అధమ జాతి చివరి రోజులు, చాలా భయంకరముగా ఉంటాయి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,874; 104 తత్వాలు (Tatvaalu) and views 230,161
Dt : 27-Apr-2023, Upd Dt : 27-Apr-2023, Category : Devotional
Views : 527 ( + More Social Media views ), Id : 92 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : heirs , children , act , public , assets , fire , pyre , death , caretaker
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు