Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. కన్నతల్లి ని మరువద్దు, కన్న దేశాన్ని, ఊరు ని మరువద్దు. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా , పొగడరా నీ తల్లి భూమి భారతిని.
ఆగష్టు 15 వస్తుంది/ వచ్చింది, పిల్లలకు జెండా పండుగ చాక్లెట్ల పండగ. ఒక రెండు చిన్న జండా లు కొని ఇంటి బయట లోన పెట్టుకోవాలి. కొనలేని వారికి కొని ఇవ్వాలి. మన దేశం లో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో, విశ్వం లో ఎక్కడా లేదు.
ఆ మాత్రం ఖర్చు చేసి, జెండా ఉంచుకునే క్రృతజ్ఞత ఉంటుంది కదా, కర్మ భూమిలో పుట్టిన మనకు. పౌరులుగా, ఇది మన కనీస ధర్మం. ఇది ఒక చిన్న దోవ క్రుతజ్ఞత చెప్పుకోటానికి.
పిల్లలకు మన దేశ గొప్పతనం గురించి చెప్పాలి, మనకున్న స్వేచ్చా స్వాతంత్రాల గురించి చెప్పాలి. ఎన్నో దేశాలలో తినడానికి తిండి, నీళ్ళు కూడా లేవు. పోరాటాలతో దద్దరిల్లు తుంటే, కనీసం నిద్ర కూడా ఉండదు. పిల్లలు ఒక వైపు, పెద్దలు ఒకవైపు పారిపోతుంటారు చంపుతారేమో అని. మనకు ఆ భయం లేదు.
అన్నిటిలో పశ్చిమ దేశాలను చూసి ఒళ్ళు కాల్చుకునే (జీన్స్, వాలెంటైన్స్ డే , పిజ్జా, బర్గర్, బరువు, లావు) మనం , మంచి విషయాలలో వారిని ఎందుకు అనుసరించము? పశ్చిమ దేశాలలో, దేశ భక్తి పొంగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ. వారి ఇంటి దగ్గర, బయట, లోపల, ఎక్కడైనా కాని, ఒక జాతీయ జెండా ఉంటుంది.
అంతరంగ హ్రుదయం లో లేకపోయినా లేదా ఉన్నా, ఇంట్లో మన వాళ్ళ ఫోటోలు మరియు దేవుని ఫోటోలు, 32 పెట్టుకుంటాము ఆడంబరంగా. అలాగే, మెడలో మరియు వేలికి, దేవుని దండలు ఉంగరాలు ధరిస్తాము. మరి మన దేశ గుర్తు గా చిన్న జెండా కూడా పెట్టుకోలేని, క్రుతజ్ఞత లేని , అధో స్తితిలో ఉన్నామా? మరి మన మనసులో ఉంటే చాలులే అనుకుంటే, మరి దేవుని ఫోటోలు, దండలు, ఉంగరాలు ఎందుకు?
జెండాలు ఫాన్సీ షాపు, బుక్ షాప్ లో ఉంటాయి. వాళ్ళ దగ్గర లేకపోయినా మార్గం చెపుతారు. దగ్గర లో ఉన్న స్కూల్/ కాన్వెంట్ పంతులు గారి ని అడిగినా, దొరికే చోటు చెపుతారు. ఎందుకంటే, వారు రంగుల కాగితాలతో స్కూల్ అలంకరించి, జెండా వందనము చేస్తారు కాబట్టి.
బీద వారికి ప్లాస్టిక్ జెండాలు తక్కువ ఖర్చు లో దొరుకుతాయి. మధ్యతరగతి వారికి కాటన్ లేదా గుడ్డ జండాలు దొరుకుతాయి. మీ స్ధోమతను బట్టి తెచ్చుకోవడం మంచిది.
డబ్బు ఉన్న వారు ఈ వారం, డబ్బు గుడి హుండీలో వేసే బదులు, తాగే బదులు, సినిమా బదులు, బయట తిండి బదులు, పదిమంది కి జెండాలు పంచితే ఇంకా పుణ్యం.
విదేశాలలో ఉన్నవారు, తాము భారత్ వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్త తో తెచ్చుకుంటారు లేదా తర్వాత స్నేహితులతో తెప్పించుకుంటారు. స్థానికం గా ఉండే, భారత సాంస్కృతిక సంఘాల నుంచి లేదా వారి కార్యక్రమాల నుంచి కూడా పొందవచ్చు. అంటే, మనసు ఉంటే, మార్గం ఉంటుంది కదా.
విదేశాలలో ఉన్న వారు, భారత జెండా తో పాటు, ఆ దేశ జెండా కూడా ఎగురవెయ్యాలి. అంటే, అమెరికాలో మనము, భారత జాతీయ జెండా తో పాటు అమెరికా జెండా ను కూడా ఎగుర వెయ్యాలి. అది అన్ని దేశాల సాంప్రదాయము.
కన్న తల్లి ని , కన్న భూమి ని ప్రేమించని వాడు స్నేహితులు ను, దేవుడు ని ప్రేమించలేడు. వారి నటన బయటపడుతుంది ఎప్పటికైనా.
తల్లి ని కన్నది అమ్మమ్మ , తాతమ్మ , . . . వాళ్ళ ను కన్నది , మోసింది మన దేశం, భూ మాత. తల్లి 9 మాసాలు మోస్తే, భూ మాత 99 ఏళ్ళు మోస్తుంది. కాబట్టి కన్నతల్లి కన్నా, కన్న భూమి గొప్పది. జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ అంటారు కదా.
మన దేశం చంద్రుడు , మార్స్ మీదకు పోవడం గురించి ఆలోచన చేస్తుంటే. మన దాయాది పక్క దేశం, కశ్మీర్ లోకి ఏ మార్గం లో రావాలా అని ఇన్నేళ్లు గా, ఇంకా ఆలోచన చేస్తూనే ఉంటుంది, వారి దేశం దివాళా తీసినదాకా. ప్రపంచంలో ఒక్క దేశం, వారికి అనుకూలంగా మాట్లాడడం లేదు, ఇప్పుడు ఆర్టికల్ రద్దు తర్వాత.
అందుకే పక్క ఇల్లు గురించి చెడు ఆలోచన చేసేవాడు , ఇబ్బంది పెట్టేవారు , గోడ దూకేవారు , అసూయ చెందే వారు , ఏడ్చేవారు , ఎన్నటికీ ఎదగరు, వారికి పతనం ఒక్కటే ఫలితం.
జననీ జన్మభూమిశ్చ . . . , ఆ పాట విని, ఇంకా మానవత్వం క్రుతజ్ఞత కన్నీళ్ళు ఉన్నాయా, అని సరి చూసుకోవచ్చు. హ్రుదయం ఉండి తెలుగు గుర్తు ఉంటే, సిగ్గు అనిపించకపోతే నోటితో, ఆ పాట పదాలు పలుకే ప్రయత్నం చేయవచ్చు.
చిన్నప్పుడు అన్న గారి సినిమా లో ఆ పాట చూస్తుంటే, కళ్లు ధారలౌతు ఒళ్ళు పులకరిస్తూ, ఆ రూపమే ఈ జవాను రా అన్న మాటకు, బోర్డరు దగ్గర జవాను అవ్వాలని అనుకొన్నాం.
దేవుడు, అంతటి పరాక్రమం కు పనికి రావు. కానీ కత్తి పట్టుకో, ఆకు ఉల్లి వెల్లి కాకర లాంటి బుల్లెట్లు కోసుకో, అమ్మకు రసం ఇచ్చి, బీపీ షుగర్ మీద పోరాడమన్నారు.
అంతేగాక మాట ల తో నే, నీ మిత్రుల శత్రువైన మోహం ను, దూరం చేసే ప్రయత్నం చేయి. ఫలితం నాకు వదిలేయి అన్నారు.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ
ఏ తల్లి నిను కన్నదో.. ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా ||జననీ||
నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలెవరకు.రా.
ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి నువు మరో రూపు నువు రా ||జననీ||
గుండె గుండెకు తెలుసు గుండె భరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత భాదెంతొ
నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లొ ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి, మారాలి నువు రాక్షసుడిగా
మనుషుల కోసం.. ఈ మనుషుల కోసం.. నీ మనుషుల కోసం ||జననీ||
చిత్రం : బొబ్బిలి పులి (1982), సంగీతం : చక్రవర్తి, గీతరచయిత : దాసరి, నేపధ్య గానం : బాలు
మిగతా పాటలు కూడా విని ఆనందించండి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,404; 104 తత్వాలు (Tatvaalu) and views 258,575 Dt : 11-Aug-2019, Upd Dt : 11-Aug-2019, Category : General
Views : 2722
( + More Social Media views ), Id : 153 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
India Independence day ,
Aug 15 ,
Indian Flag Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments